S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గొంతులు

రోజూ మనలని రకరకాలైన గొంతులు పలకరిస్తూ ఉంటాయి. అవి మనకు తెలిసిన వ్యక్తులవి కావొచ్చు. తెలియని వ్యక్తుల గొంతులు కావొచ్చు. మన గొంతూ కావొచ్చు.
ఈ గొంతులు పరస్పర విరుద్ధమైన మాటలని చెబుతూ వుంటాయి. కొన్ని గొంతులు నువ్వు ఆ పనిని చేయగలవు అంటాయి. అవ్వే గొంతులు నువ్వు ఆ పనిని చెయ్యలేవు అంటాయి. ఈ రెండు రకాల గొంతుల మధ్య మనం ఉక్కిరిబిక్కిరి అవుతూ వుంటాం.
మనం ఏ గొంతు మాట వింటే, దాని ప్రభావం మన జీవితం మీద ఉంటుంది. అందుకని ఏ మాట వినాలో, ఏ మాట వినకూడదో నిర్ణయం తీసుకోవాల్సింది మనమే.
అందుకని ఆశావహ దృక్పథంతో చెప్పిన గొంతు మాట వైపు మన దృష్టిని కేంద్రీకరించాలి.
లేకపోతే మనం జీవితంలో విఫలం అవుతూ వుంటాం.
‘అనుకుంటే నువ్వు ఉదయమే లేవగలవు. ఉదయం నువ్వు లేవడం అసంభవం’ ఈ రెండు గొంతులు మన ఉదయాన్ని నిర్దేశిస్తాయి.
‘నువ్వు చాలా విలువైన వ్యక్తివి. నువ్వు ఎందుకూ పనికిరాని వ్యక్తివి’
‘ప్రయత్నం చేస్తూ వుండూ
వదిలివేయి’
‘ఈ ప్రపంచాన్ని నువ్వు అంతో ఇంతో మార్చగలవు
ఈ ప్రపంచం చాలా దుర్మార్గమైనది. నువ్వు ఏమీ మార్చలేవు’
ఇలాంటి విరుద్ధమైన మాటలు సమాజంలోని వ్యక్తుల నుంచి వస్తే పర్వాలేదు. మనలోనే ఇలాంటిమాటలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మనం చేస్తున్న పని మంచిదా కాదా నిర్ణయించుకోవాల్సింది మనమే. మంచిదైనప్పుడు వ్యతిరేక భావజాలం వున్న వ్యక్తుల మాటలని దూరంగా ఉంచాలి.
మనం ఏ మాటలు వింటామన్నది ముఖ్యం.
గొంతు ఒక్కటే.
రెండు రకాల మాటల్ని పలుకుతుంది.
అనుకుంటే మనం ఏదైనా సాధించగలం.
అలాంటి మాటల్నే కనీసం మన గొంతు పలికేలా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది.
కనీసం ఆశావహ దృక్పథం వున్న మాటల్ని స్వీకరించేలా మనలని మనం మలచుకోవాలి.

- జింబో 94404 83001