S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేతాజీ మరణం

నేతాజీ మరణం
గుండు సుబ్రహ్మణ్య దీక్షితులుగారి పరిశోధనా వ్యాసం ‘నేతాజీ - మిస్టరీ’ ద్వారా నేతాజీ మీద గాంధీగారి వైఖరి అర్థమైంది. ఇద్దరూ అకళంక దేశభక్తులే. మార్గాలు వేరైనా వారి గమ్యం ఒక్కటే- అదే స్వాతంత్య్ర సముపార్జన. నేతాజీ మరణం మీద అనేక కమిటీలు నివేదికలను సమర్పించాయి. నేతాజీ మరణానికి మూడే కారణాలు - ఒకటి విమాన ప్రమాదం. రెండు - రష్యాలో కాల్చి చంపడం. మూడు - సహజమరణం. ఆయన మరణం ఎప్పటికీ మిస్టరీయే.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
సండే గీత
మంచిని గుర్తు పెట్టుకొని సంతోష సమయాల్ని పదిలం చేసుకొని నిస్సహాయంగా ఒంటరిగా ఉన్నప్పుడు నెమరువేసుకుంటే జీవితం నిత్య సంతోషంగా ఉంటుందని చెప్పిన ‘సండే గీత’ బహు చక్కగా ఉంది. అలాగే తథాస్తు దేవత లుంటారంటూ ఎప్పుడూ మంచిని తలచుకుంటూ చెడుని మదిలోకి రానివ్వకుండా ఉండాలని చెప్పిన బహు విలువైన ‘ఓ చిన్న మాట’ కూడా బావుంది. ఒక ప్రశ్నకు సమాధానంగా మనకు స్వాతంత్య్రం రాలేదు - అధికార మార్పిడి జరిగిందంతే అనడం ఎంతో సత్యం. మనవాళ్లిప్పటికీ ఆంగ్ల సంస్కృతికి బానిసల్లాగే ప్రవర్తిస్తున్నారు. ఆనాటి చట్టాలే పాటిస్తూ, ఆనాటి చదువులే చదువుతున్నాం. నిజమే అధికార మార్పిడి మాత్రమే జరిగింది.
-ఆర్.మరుదకాశి (కరప, తూ.గో.జిల్లా)
విలన్స్..
ఈ శీర్షికన అందించిన ‘బ్రిటిష్ రాణి ఆభరణాలు’ గొప్ప ఉత్కంఠతతో ఊహించని విధంగా ముగిసి మమ్మల్ని ఎంతగానో అలరించింది. దొంగ నుంచి కాపాడుకోడానికి జేన్ పాటించిన నాలుగు రక్షణలు అద్భుతంగా ఉన్నాయి. మల్లాది వారి స్ఫూర్తి కథ ‘నో రిఫండ్స్’ మంచి నీతిని చెప్పింది.
-కె.ప్రవీణ్ (కాకినాడ)
దూరపుకొండలు
ఆదివారం అనుబంధం ద్వారా ఎన్నో విలువైన విషయాలను ఆస్వాదించ గలుగుతున్నాం. కనె్నగంటి వారి ‘దూరపు కొండలు’ కథతో భూతదయ అనేది జీవితంలో ముఖ్య భాగమనీ, రాసి మెప్పు పొందటం కాదు -అనుశీలన, ఆర్ద్రత కలిసిన అమలు ముఖ్యమని తెలియజెప్పటం అభినందనీయం. ‘నేతాజీ - మిస్టరీ’ స్పెషల్ దాచుకోదగినది. ఇలాంటి మరిన్ని వ్యాసాలను ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం ద్వారా ఆశిస్తున్నాం.
-గంగసాని పద్మారెడ్డి (హైదరాబాద్)
ధైర్యం
‘సండే గీత’లో ధైర్యం కథ చాలా బాగుంది. కంటిచూపుని పోగొట్టుకున్న బ్రెయిలీ ధైర్యంతో ఆ పరిస్థితిని ఎదుర్కొని, ప్రపంచ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకోవడం చాలా బాగుంది. ధైర్యంతో ఏ పనినైనా సాధించవచ్చు అన్న స్ఫూర్తిని అందించింది. ‘బటన్’ కథలో పవర్ బటన్ ఆఫ్ చెయ్యాలనీ, లేకుంటే అన్నీ సమస్యలొస్తాయని చక్కగా తెలిపారు. సిసింద్రీలో ‘కోతి-అల్లరి’ ఒకరికి ఉపకారం చేయకపోయినా అపకారం మాత్రం చేయకూడదన్న నీతిని బోధించింది.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
సెలబ్రిటీ
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నారు. ఎన్నో విజయవంతమైన క్లాసిక్ క్రైం సినిమాల్ని నిర్మించిన వ్యక్తి సైతం ఈ విధంగా ప్రవర్తించటం ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. మూడు నెలలపాటు అనేక సినిమాలు చూస్తూ పప్పులని, చాక్లెట్ బార్స్‌ని తింటూ.. పాలు తాగుతూ గడిపాడని తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. లోకంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అన్న సందేహం వెంటాడుతోంది.
-డి.రోజారాణి (జడ్చర్ల)
అవీ-ఇవీ
ఈ శీర్షికన అందిస్తున్న బిట్స్ బాగుంటున్నాయి. అందమే అందమా.. భంగిమ.. పండుగ కళతోపాటు వెజ్జీ ఫెస్టివల్ ముచ్చట గొలిపింది. సిసింద్రీలోని కథ.. స్ఫూర్తి కథ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకొంటున్నాయి.
-డా.శివభూషణం (కర్నూలు)
శాస్తవ్రేత్తలు
సిసింద్రీ శీర్షికలో ‘ప్రపంచ శాస్తవ్రేత్తలు’ పేరిట ఆయా శాస్తవ్రేత్తల విశేషాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. ‘లోకాభిరామమ్’ శీర్షిక మా ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది. ‘పుస్తకం-మస్తకం’ ఎన్నో విషయాలను తెలియజెప్పింది. ‘అక్షరాలోచనాలు’లో కవితలన్నీ బాగున్నాయి. ‘స్ఫూర్తి’లో మల్లాదిగారి నీతి కథల గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘వేట’ కథ రసరమ్యంగా ఉంది.
-పి.బాబ్జీ (కర్నూలు)
వాస్తు
ఈ శీర్షికన అందిస్తున్న వ్యాసాలు ఉపయుక్తంగా ఉంటున్నాయి. హద్దులు తెచ్చే అనర్థాలు ఆద్యంతం చదివాం. హద్దు అన్న పదం వెనుక ఎంతటి అర్థం నిక్షిప్తమై ఉందో.. హద్దులు మీరి ప్రవర్తించిన సందర్భాల్లో మనుషులు ఎలా శిక్షార్హులవుతారో, అలాగే వాస్తుపరంగా నిర్ణయించిన హద్దులు మీరిన సందర్భాల్లో ఇంటిల్లిపాదీ ఎలాంటి దుర్భర పరిస్థితులకు లోను కావల్సి వస్తుందో... లాంటి అంశాలను కూలంకషంగా చర్చించారు. ‘సండే గీత’ అర్థవంతంగానూ, సందేశాత్మకంగానూ ఉంది.
-ఎన్.సురేందర్‌రావు (కరీంనగరం)