S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భవిష్యకాలం

బోళ్ల కమలాకర్ (గోదావరిఖని)
ప్ర: స్వగృహ యోగం ఉన్నదా? శేష జీవితం ఎలా గడుస్తుంది?
జ: మీకు తప్పకుండా స్వగృహ యోగం కలుగుతుంది. రెండంతస్తుల మేడ కాని రెండు వేర్వేరు ఇళ్లు కాని కడతారు. శేష జీవితం అంటే ఎవరికీ కూడా ‘కాలమొక్కరీతి గడువబోదు’ అని పెద్దలు చెప్పిన మాట. అయితే ధర్మాన్ని దైవాన్ని శాస్త్రాన్ని నమ్మినవాడు ఆచరించినవాడు కాల ప్రభావానికి నిలదొక్కుకోగలడు.
కె.సత్యవర్షిత (వెంకటాయపాలెం)
ప్ర: నాకు విద్య , వివాహ యోగం గురించి చెప్పగలరు.
జ: విద్యాయోగం బాగుంది. విదేశీయానం కూడా చేసే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య కారణాల వలన విఘ్నం కలుగవచ్చు. వినాయకునికి ప్రతి సోమవారం నాలుగు ప్రదక్షిణలు చేసి నాలుగు రూపాయలు దక్షిణగా బ్రాహ్మణులకు సమర్పించండి.
బి.సునీత, సుధాకర్ (పెబ్బేరు)
ప్ర: ద్వితీయ సంతాన యోగం ఉందా?
జ: 2019 ప్రారంభంలో మీకు శుభం జరిగే అవకాశం ఉంది.
కె.కృష్ణమూర్తి పట్నాయక్ (రాయగడ)
ప్ర: ఉద్యోగం అకస్మాత్తుగా పోయింది. మళ్లీ ఉద్యోగం చేస్తానా?
జ: మీరు చెప్పిన సంఖ్య ఆధారంగా మీ ఉద్యోగం పోవటానికి కారణం ఒక వాగ్వివాదం కానీ కలహం కానీ కనిపిస్తోంది. మళ్లీ మీకు ఉద్యోగం లభిస్తుంది. కాని స్థిరత్వం తక్కువ. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించండి. పూజించండి.
టి.రతన్‌సింగ్ (కంది)
ప్ర: నాకు ఉద్యోగ యోగం ఎప్పుడు?
జ: వచ్చే అక్టోబర్ తరువాత ప్రైవేట్‌గా దొరికే అవకాశం ఉంది.
టి.హరికృష్ణ (కడప)
ప్ర: బంధు విరోధము - పొరుగు వారిచేత కల్పిత సమస్యలు.. స్థలం దురాక్రమణ.. పరిష్కారం సూచించండి.
జ: ‘దుర్బల స్వబలం రాజా’ నీతివాక్యం. సివిల్ సూట్ వేయటానికి లాయర్‌ను సంప్రదించండి. దైవసేవగా ప్రతి రోజూ 40 రోజులపాటు ‘శ్రీ మత్సుందరకాండ’ పారాయణం చేయించి తేనె, అరటి పండ్లను నైవేద్యం పెట్టండి.
నండూరి కృష్ణమూర్తి (కాకినాడ)
ప్ర: ప్రస్తుత జీవితం ఫర్వాలేదు. ఇక ముందు ఇంతకన్నా బాగుంటుందా? ఉన్నత స్థితిని పొందగలనా?
జ: ‘కర్మణ్యే వాధికరస్తే మాఫలేషు కదాచన’ అన్నది భగవద్గీతా వాక్యం సార్వకాలికం సార్వజనీనం. ‘డూ దై డ్యూటీ దటీజ్ ద బెస్ట్ లీవ్ ఆన్‌టుదై గాడ్ ద రెస్ట్’ అన్నది తాత్వికుల బోధన. మీ విద్యుక్త ధర్మాన్ని చక్కగా నిర్వహించండి. కీర్తిప్రతిష్ఠలు వాటికవే మీ వెంట వస్తాయి.
ఎం.కృష్ణమాచార్యులు (రాజమండ్రి)
ప్ర: మాది ఉమ్మడి కుటుంబం. సంపాదన సరిపోవటం లేదు. ఏదైనా వ్యాపారం చేయగలనా?
జ: అందరూ తలా ఒక చేయి వేస్తేనే మంచిది. సులభంగా ఉండే వ్యాపారం రియల్ ఎస్టేట్ కమీషన్ ఏజెంట్‌గా పని చేయటం. మంచి పేరున్న కంపెనీలో ప్రయత్నించండి.
జె.వి.రవిప్రకాశ్ (సైదాబాద్ కాలనీ)
ప్ర: మోక్షం గురించి ఒక జ్యోతిష్కుడిని అడిగితే నీవు కొన్ని తప్పులు చేసావు అన్నారు. అవి ఏమిటి?
జ: ఆ జ్యోతిష్కునే అడిగితే సబబుగా ఉంటుంది.
సి.బదరీనారాయణ (విజయవాడ)
ప్ర: ఒక ఉద్యోగ విషయంలో ఆలస్యం అవుతోంది. ఇంకా ఎంతకాలం ఆగాలి?
జ: మన ప్రయత్నం మన చేస్తూనే ఉండాలి. మీకు ఉద్యోగం ఇచ్చేవారి పరిస్థితి కూడా బాగుండాలి కదా.
కె.లక్ష్మీనారాయణ (కొత్తగూడెం)
ప్ర: స్వగృహ యోగం - భార్య అనారోగ్యం.. ఇంకా అనేక సమస్యలు.
జ: మొదట ఆరోగ్య సమస్యల కోసం ప్రతిరోజూ గోధుమ పిండి శక్కర ఆంజనేయ స్వామి గుళ్లో చీమలకు వేయండి. స్వామికి అరటి పండ్లు, తేనె సమర్పించండి.
పేరిచర్ల సూర్యకాంతం (తాడేపల్లిగూడెం)
ప్ర: ఇంట్లో నుండి వెళ్లిపోయిన కుమారుడు ఎప్పుడు తిరిగి రాగలడు.
జ: మీ ఇంట్లో వాయవ్య దిశలో వాస్తు దోషం కనపడుతోంది. స్థానిక వాస్తు పండితుని సంప్రదించి సరిచేయించుకోండి. అబ్బాయి మాత్రం దూరంలో ఆగ్నేయ దిశలో క్షేమంగానే ఉన్నాడు.
డి.ఎస్.రెడ్డి (బెంగుళూరు)
ప్ర: కుమారుని విద్యాభ్యాసం...?
జ: మీ అబ్బాయికి స్థిరం చేసే వృత్తులు రాణించవు. మున్ముందు వ్యాపారంలో స్థిరపడతాడు.
జరుబుల సుమ (చెంచుపేట)
ప్ర: భవిష్యత్తు తెలియజేయగలరు.
జ: మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మీకు మానసికంగానో, ఆర్థికంగానో నష్టం కలిగినట్లు కనిపిస్తోంది.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ