S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చెట్టు

ఒక్కో విషయాన్ని ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా దర్శిస్తారు. అది విషయంలోనే కాదు- వస్తువుల విషయంలో, ప్రాణుల విషయంలో, వృక్షాల విషయంలో కూడా వర్తిస్తుంది.
చెట్టు నా ఆదర్శం అన్నాడు కవి ఇస్మాయిల్. ‘చెట్టుని దాటుకుంటూ’ వచ్చానని అంటాడు కవి మిత్రుడు జూకంటి. చెట్టులా వౌనంగా ఉండాలని ఉంటుంది కానీ ఈ ప్రచండ గాలులు నన్ను వౌనంగా వుండనివ్వవు. అక్రమాలు అన్యాయాలు నన్ను వౌ నంగా ఉండనివ్వవు అంటాడు మరో కవి.
‘నేను చెట్టుని కాదు’ అన్నాడు మరో కవి మిత్రుడు. అవును.
మనిషి మనిషే. చెట్టు కాదు. చెట్టు విలువని అంచనా వేయలేం. అలాగే మనిషిని కూడా.
చెట్టుకి, మనిషికి భేదం ఉంది. చెట్టు కదలలేదు. అక్కడే ఉంటుంది. కొంచెం పక్కకి తన కొమ్మని విస్తరించగలదు. పైకి పెరగగలదు. తన వ్రేళ్లను భూమి నుంచి అటూ ఇటూ పరుగెత్తించగలదు. కానీ కొంతమేరకే.
మనిషి అలా కాదు.
తన ప్రస్తుత పరిస్థితి నచ్చకపోతే పరిస్థితిని మార్చుకోగలడు.
తను వున్న ప్రాంతం నచ్చకపోతే మరో ప్రాంతానికి వెళ్లగలడు.
తన ఉద్యోగం నచ్చకపోతే మరో ఉద్యోగాన్ని వెతుక్కోగలడు.
మనిషికి హృదయం ఉంది.
మనిషి మనస్సు ఉంది.
మనిషి ఆలోచించగలడు.
చెట్టు గొప్పదా? మనిషి గొప్పవాడా? అన్నది ప్రస్తుత అంశం కాదు.
మనిషి చెట్టులా చలనం లేకుండా వుండకూడదు.
చెట్టు నుంచి మంచి లక్షణాలు గ్రహించాలి.
చెట్టుకన్నా ఉన్నతంగా ఎదగాలి.
చెట్టులాగా అందరికీ ఉపయోగపడాలి.

- జింబో 94404 83001