S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బతుకు బరువు

మా ఊరి చెరువు ఒక
వానాకాలం గంగాళం
శీతాకాలపు తామరపూల తటాకం
ఎండ వేడికి తల్లడిల్లిన
జంతుజాలము - విహంగాలకు
చల్లని గుండెతో స్వాగతించి
సేదతీర్చిన ‘అమ్మ ఒడి’
మా ఊరి చెరువు
పిల్లకాలువల పులకరింతలు
నీటిమడుగున సేదతీరిన
పాడిపంటల సోయగాలు
మా ఊరిచెరువు
శ్రమైక జీవుల చేతబట్టిన
రంగుల చీరల చెరువుగట్టు
ఆరవేతలు...
హరివిల్లుల నిత్యదృశ్యాలు
మా ఊరి చెరువు
కృషీవలుల కూనిరాగాలకు
ఆటవిడుపు మా ఊరిచెరువు
చెరువు నిండిన జలపుష్పాలు
గంగపుత్రుల కాసుల గలగలల
బ్రతుకుతెరువు మా ఊరిచెరువు
పిల్ల పెద్దలకు అనుభవాల పరిపూర్ణసారము
ఈతనేర్పిన జ్ఞాపకం మా ఊరి చెరువు
ఎండిన బావులకు వొట్టిపోయిన బోరులకు
ఊతమిచ్చే సంజీవని మా ఊరి చెరువు
శరన్నవరాత్రుల బతుకమ్మల
నెత్తినెత్తిన సుందర దృశ్యము
మా ఊరిచెరువు
చెరువుగట్టున పిల్లగాలుల
వాయిలాకు చెట్లకనువిందు
మా ఊరిచెరువు
వెరసి మా ఊరి చెరువు
మా గ్రామ స్వాగత తోరణం
మా ఊరి మణిహారం
బతుకు బరువును
మోసే చెరువుందని
భరోసాతో...
ఊరు నిదురపోయింది.
*
-మడిపల్లి హరిహరనాథ్
9603577655

కవీ ‘ఆత్మ’హత్య చేసుకోకు

-పున్నమి
93966 10639
పగటి నక్షత్రాల్లా
అప్పుడప్పుడు
సాహిత్య పేజీలో కన్పిస్తావు
కానీ
సాహిత్య సభలకు రావు
కవిగా పేరున్నా
కవి సమ్మేళనాలకు అసలే రావు
పద్యం రాయలేని నువ్వు
పద్యం రాసిన వాడిని ‘కవి’గా గుర్తించవు
తోటి కవిని ఆదరించవు, అభినందించవు
‘మేఖల’ అంటే అర్థం తెలుసుకోక
మేకల కవి, గొర్రెల కవి అని విమర్శిస్తుంటావు
అసలు నువ్వెందుకు రాస్తున్నావో?
ఎందుకు జీవిస్తున్నావో?
నీకే తెలియక
అప్పుడప్పుడు
నీలో నీవే
‘ఆత్మ’హత్య చేసుకుంటావు
అందుకే
కవీ!
నువ్వు రాయకుంటేనే హాయి
రాస్తే
పాఠకుల పాలిట కసాయి

నానీలు

-తోట రామమోహన్
9603897828

ఐరావతమే
మెల్లగా అదృశ్యమైంది
ఆకాశంలో
మబ్బుల గారడీ
* * *
పిలిచినప్పుడు
రాలేదు
పంట చేతికొచ్చేవేళ
వడగండ్లై ముంచింది
* * *

ఎదుటివారి తప్పుల్నే
ఎత్తిచూపుతాం
మనదంతా
గురివింద నీతి
* * *
సృష్టించిన బ్రహ్మకే
హక్కు లేదు
సాటి మనిషిని
నువ్వెలా చంపుతావ్?