S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో-మనం ఎడిటర్‌తో ముఖాముఖి

బొడ్డు రామకృష్ణ, చిరతపూడి
ప్రభుత్వంవారు మరుగుదొడ్లు ఉచితంగా కట్టించి ఇచ్చుచున్నారు. వాటిని ఎంతమంది ఉపయోగించుచున్నారో పట్టించుకొనుట లేదు. నూటికి తొంబది వాడుట లేదు. ఇది ఎంతవరకు సబబు?
వాటిలో ఎన్ని ఉపయోగించుకోగల స్థితిలో ఉన్నాయి?

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
భారత రాజ్యాంగం అంటే ఒక్క అంబేద్కర్ స్మరణేనా? ఆయనకు సహకరించిన రామస్వామి అయ్యర్, కె.ఎం.మున్షీ, బెనగళ నరసింగరావులను అసలు తలవరేమి?
వాళ్లకి ఈ రోజు పొలిటికల్ వాల్యూ లేదు కనుక. రాజకీయ స్వార్థాలకు అడ్డం పెట్టుకోవడానికి అక్కరకు రారు కాబట్టి.

ఆచంట వీరేష్‌కుమార్, పెనుగొండ, ప.గో.జిల్లా
‘వచ్చేటపుడు ఏమీ తీసుకురాము. పోయేటపుడు ఏమీ తీసుకుపోము’ అంటుంటారు కొంతమంది. ‘మానవ జీవితం డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బు అంటే ఇష్టముండటం తప్పుకాదు. దుర్మార్గంగా సంపాదించకుండా ఉంటే చాలు’ అని నా ఉద్దేశం. మీరేమంటారు?
‘్ధనమూల మిదం జగత్’ అని రామాయణమే చెప్పింది.

ఎం.కనకదుర్గ, తెనాలి
దేవాలయాలలోకి కేవలం సంప్రదాయక దుస్తులతో మాత్రమే రావాలన్న తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలపై సెక్యులర్ వాదుల రచ్చ ఎందుకు? సంప్రదాయక దుస్తులను ధరించాలన్న నిబంధన ఇతర మతాలలో ఎన్నో దశాబ్దాలుగా అమలులో ఉంది కదా! దానిని హిందూమతానికి వర్తింపజేస్తే ఇంత అనవసర రాద్ధాంతం ఎందుకు? ఈ కుహనా లౌకికవాదులకు హిందూమతంలో ఉండే సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలో మాత్రమే లొసుగులు కనిపిస్తాయా?
ఔను. హిందువులంటే అలుసు. వాదులాడే ఏబ్రాసుల్లో ఒక్కడూ గుడికి వెళ్లడు.

సామాజిక వివక్ష కొనసాగినంత కాలం రిజర్వేషన్ల వ్యవస్థ కొనసాగించాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఈ మధ్య సెలవిచ్చారు. కేవలం సామాజిక అసమానతలే కాకుండా సమాజంలో ఆర్థిక అసమానతల ఆధారంగా కూడా రిజర్వేషన్లు కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ధనవంతులైన వెనుకబడిన కులాలతోపాటు పేదవారైన అగ్రవర్ణాల వారి అభివృద్ధి కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి కదా!
రాజకీయాల పీడ పోనంతవరకూ అభివృద్ధి కల్ల. రాజకీయ కపటుల రిజర్వేషన్ లొల్లి వల్ల ఉపయోగం సున్న.

ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో సిఫార్సులు, రాజకీయ వత్తిళ్లు కూడా ప్రధాన పాత్ర పోషించాయన్న మీడియా కథనాలపై మీ అభిప్రాయం ఏమిటి? సుఖదుఃఖాలు, గౌరవ అగౌరవాలు, అన్ని దందాలకు అతీతంగా నిరంతర పరమాత్మ ధ్యానంలో గడిపే ఆధ్యాత్మికవేత్తలకు పురస్కారాలు అవసరమా?
ఈసారే కాదు. ప్రతిసారీ పైరవీలనుబట్టే పురస్కారాలు. అందుకే ఆ పద్మాలకు విలువలేదు.

పి.వి.శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
రాష్ట్రంలోని విద్యార్థులందరిని తలా పది రూపాయలు చందా ద్వారా రాజధాని నిర్మాణంలో భాగస్వాముల్ని చేయాలనే చంద్రబాబు ఆలోచన కరెక్టా?
ఉద్దేశం మంచిదే. జనాలకు నమ్మకమే కలగటం లేదు.

పి.సీతాపతి, సికిందరాబాద్
అందరికీ చురుకైన, తగిన జవాబులు చెప్పే సంపాదకులుగా ఉన్న మీరు కూడా కొన్ని అంశాలలో పక్షపాతంతో వ్యాసాలు వెలువరిస్తున్నారని కొందరి ఉవాచ. నిజమేనా?
ఔను. ధార్మిక పక్షపాతం; జాతీయ పక్షపాతం.

ఎ.శివప్రసాద్, సంగారెడ్డి
మొన్నటి హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలలో ప్రభంజనం సృష్టించిన తెరాస పాతబస్తీలో మజ్లిస్‌పై ఇసుకంత కూడా ప్రభావం చూపకపోవడం దేనికి సంకేతం? మైనారిటీలను ప్రభుత్వం తమ చర్యలతో, పథకాలతో సంతోషపెట్టినా కూడా వారిని లెక్కచేయక పోవడానికి గల కారణం ఏమిటి?
సొంతంగానే తమకు ఇన్ని సీట్లు వస్తాయని ఊహించనందువల్ల కారు వారు మజ్లిస్‌తో మొగమాటాలకు పోయినట్టుంది.

శివానంద, ప్రొద్దుటూరు
తెలుగు భాష, హిందూ మతం అంతరించి పోతాయి అనటం సబబు కాదు. బి.టెక్ చదివిన వాడికే ఇంగ్లీష్ రాదు. తెలుగులోనే మాట్లాడతాడు. తెలుగు పేపర్ చదువుతాడు. తెలుగు సినిమాలే ఎక్కువ చూస్తాడు. ఇక హిందూ మతం చాలా ప్రభావం కలది. ఇస్రో కూడా బాలాజీ పూజ చేస్తుంది. మన ప్రతి అణువులో భారతీయత ఉంది. చివరికి మిగిలేది మన తత్వమే. ఎందుకు ఆందోళన?
హమ్మయ్య! ఇంతకాలం హడలి చస్తున్నాం.

బి.సుమతి, తిరుపతి
భారతదేశంలోకి ఇంత ఈజీగా ఉగ్రవాదులు చొరబడి రాగలుగుతున్నారంటే అది బోర్డర్‌లలోని సైనికుల లోపమే కాదా?
సైనికుల్ని మనం ఎక్కడ పని చేయనిస్తున్నాం?

పొట్టి లక్ష్మీసుజాత, అద్దంకి, ప్రకాశం జిల్లా
నేతాజీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల గురించి కూడా సమగ్ర చారిత్రక వాస్తవ కథనాల్ని ఆంధ్రభూమి అనుబంధంలో ఆశించవచ్చా?
నేతాజీ గురించి... వచ్చు.

స్వాతి శాస్ర్తీ, విజయనగరం
హిందూ సమాజానికి ఉన్నదేమిటి? లేనిదేమిటి?
ఎక్కువగా ఉన్నది భక్తి. అసలు లేనిది శక్తి.

డి.వి., వక్కలంక
భిన్నంగా ఆలోచిస్తూ, సినిమాలు తీస్తున్నా కొత్త, చిన్న దర్శకుల చిత్రాలు పరాజయం పాలవుతున్నాయి. పంచ్ డైలాగులూ, ఒంటిచేత్తో పదిమందిని కొట్టే హీరోలూ ఉన్న చిత్రాలు విజయవంతం అవుతున్నాయి. సగటు ప్రేక్షకుడి స్థాయిని ఇవి తెలుపుతున్నాయని అనుకోవచ్చునా?
థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని చిత్రాల తలరాతలు రాసే పెత్తందార్ల పట్టును తెలుపుతున్నాయి.

ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
అమెరికాలో సగం మంది పేపర్లు చదవరు. సగంమంది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయరట - అని వైడల్ గోరె అనే రచయిత ఎక్కడో రాయగా చదివాను. ఇదే నిజమయితే మనకూ వారికీ తేడా ఏముంది?
కాని అక్కడ రాజకీయాలు మనవాటంత చెత్తగా ఉండవు. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com