S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నీకు స్వాగతం

ఏడాదికోసారి పలుకరించే
అతిథీ నీకు స్వాగతం
నీ రాక కోసం మేమంతా
వేయి కన్నులతో వేచి చూస్తున్నాం
మామిడి పూతలు తిన్న
కోయిలలు నిన్ను
మధురంగా స్వాగతిస్తున్నాయి
చైత్రమాస ప్రారంభపు
నులివెచ్చటి కిరణాలు
నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాయి
జీవితంలోని చేదుని తీపిని
సమానంగా స్వీకరించాలని
ఉగాది పచ్చడి ద్వారా తెలుసుకుంటూ
ఈ కొత్త ఏడాదిలో
సరికొత్త ఆశలకు, ఆకాంక్షలకు
పునాదులు వేస్తాం
నీ నెచ్చెలి హేవలంబని
సగౌరవంగా సాగనంపుతూ
వేపపూతలు, మావిడాకులతో
కవి సమ్మేళనాలు, పంచాంగ శ్రవణాలతో
పట్టు పరికిణీలతో పడతులు
స్వాగతాలు పలుకగా
రావమ్మా ఓ విలంబ
మా అందరికీ ఆనందం
కలిగిస్తూ తేవమ్మా ఉగాది.
*

-పి.చంద్రికశేఖర్