S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉగాది వేళ

ఉగాది పురుషా
ఈ వేసవిలో మరీచికలు రానివ్వకు
జలసంపన్న ఋతుపవనాలతో
జలజల వానలతో
పుడమి తల్లి పొంగిపోవాలి
వాన చినుకులతో
మట్టి వాసన మనసుల నలరించాలి
పూత పూసే చెట్లు చిరునవ్వులు చిందాలి
సస్యశ్యామలానికి నాంది పలకాలి
శ్రీ విలంబీ నీకు స్వాగతం
సంవత్సరాలు దశాబ్దాలుగా
దశాబ్దాలు శతాబ్దాలుగా
పరుగెడుతుంటాయి
మనిషికి నూరేళ్ల ఆయుష్షు అంటారు
కాలగమనం, కాలధర్మం
వేర్వేరుగా ఉంటాయి
సృష్టికి దాసులం
తిథి వార నక్షత్రాల మంచిచెడులంటూ
జీవితాన్ని గడుపుతుంటాం
జీవన స్రవంతిలో అలవోకగా
ఆడుతూ పాడుతూ
నవ్వుల నావలో
ఊయల లూగాలని ఆశీర్వదించు
ఎప్పుడూ ఏదో ఆశతో
ఎదురుచూస్తుంది మానవాళి
వసుధైక కుటుంబంలో
అందరూ సమానమే
నిజం కావాలి రాశి శుభ ఫలాలు
ఆనందంతో
పిల్లాపాపలతో
ఉగాది పచ్చడి పాయసాన్నాలతో
పబ్బం గడవాలి.
*

-అనంత మురళీచంద్ర ఎ.ఎస్.ప్రభాకర్ 9963887346