S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రకృతి పులకరింత

ఒక కొత్త వేకువ కోసం
కళ్లపూలను విప్పార్చి
ఆశగా
ఎదురుచూస్తున్న వేళ
చెట్లు పచ్చగా పిలుస్తుంటాయి
ఎర్రని లేత చివుళ్ల సందుల్లోంచి
తెల్లని వేపపూత
ముక్కుల్ని పలకరిస్తుంటుంది
మావికొమ్మల మాటు నుండి
మామిడిపిందెలు తొంగిచూస్తూ
నోరూరిస్తుంటాయి
ప్రక్కనున్న మావిచెట్టు పైనుండి
ఉషోదయాన
కోయిలొకటి
షడ్జమస్వరంతో
సుప్రభాతం పలుకుతుంది
ప్రకృతి
వన కాంతితో హొయలొలుకుతూ
ఉగాది రాగాన్ని ఆలపిస్తుంది
అనాదిగా చెబుతున్నట్లు
ఉగాది అంటే
షడ్రుచులు
కొత్త బట్టలు
పంచాంగ శ్రవణాలు మాత్రమేకాదు
ప్రకృతి పులకరింతకు ప్రతీక
నూత్న జీవన సంరంభానికి నాంది!

-నూతలపాటి వెంకట రత్నశర్మ 9866376050