S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వసంతాల సంతకం

నేనొక కలల బేహారిని
కాలాతీత విహారిని
ఋతువుల కోసం ఋత్వికుడనై
కవితా క్రతువులు చేస్తాను
ఎడారి బ్రతుకుల్లో
ఎల కోయిల రాగాలు పలికిస్తాను
నిశి రేయిని ప్రసరించిన శశికిరణంలో
పసిప్రాయపు ప్రకృతి దరహాసం కోసం
ప్రభాత సంధ్యలు ప్రతిబింబించే వర్ణాలలో
ప్రతిధ్వనించే కలస్వనాల కోసం
శీతల హేమంతపు పులకింతలలో
భూతల వేదికపై విరిసిన పూబంతుల కోసం
మధుమాస వేళల మల్లెతోటలలో
మధురిమలు గ్రోలే మధుపముల కోసం
పదములన్నీ నివేదన చేసి
మదిలో భావాల యజ్ఞం చేస్తాను
తనువెల్లా తలిరాకునై పల్లవించి
తొలి ఋతువుకు స్వాగత తోరణమవుతాను
శిశిరం విసిరిన ఆకుల గలగలలలో
కసిరే వేసవి గాలుల నిట్టూర్పులలో
ముసిరే శ్రావణ మేఘపు గర్జనలలో
విరిసే శారద రాత్రుల వెనె్నలలో
నన్ను నేను దర్శించుకుంటాను
నాలో నేను లీనమై ప్రకృతినవుతాను
వసంతాల సంతకాల కోసం
జీవితాన్ని కాగితంలా పరుస్తాను
*

-బలభద్రపాత్రుని ఉదయ శంకర్