S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జానపదం.. అతని పథం

డా.ఆర్.వాసుదేవ్‌సింగ్ రచయిత, నర్తకుడు, పరిశోధకుడు. వీరు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల విభాగంలో పిహెచ్.డి. చేసి, తన సిద్ధాంత వ్యాసానికి స్వర్ణ పతకం పొందారు. ఇప్పుడు కూచిపూడి నృత్యంలో అదే విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. చేస్తున్నారు. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్నో గ్రంథాలు, వ్యాసాలు ప్రచురించారు. ఎన్నో భాషలలో వీరి పుస్తకాలు ప్రచురింపబడ్డాయి.
వీరితో ముఖాముఖి ఇలా జరిగింది...
ప్ర: మీరు నాట్యం ఎప్పుడు మొదలుపెట్టారు?
జ: 1982లో కోట సుబ్రహ్మణ్య శాస్ర్తీగారి వద్ద నేను భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. వారికి రెండు కాళ్లు పనిచేసేవి కావు. చేతులతో, బొమ్మలతో నేర్పించేవారు. నేను 1985లో మాస్టర్ రమణగారి వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. వీరు వెంపటి చినసత్యంగారి శిష్యులు. తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో ఎం.ఏ. చేశాను. ఇప్పుడు పిహెచ్.డి చేస్తున్నాను. జానపద కళలతో అనుబంధం 1995లో మొదలయింది. ఎన్నో పుస్తకాలు రాశాను. ఎం.్ఫల్, పిహెచ్.డి చేశాను జానపదంలో.
ప్ర: మీరు శాస్ర్తియ కళాకారుడు కదా.. జానపద కళలు ఎలా నేర్చుకున్నారు?
జ: జానపద కళలకు ఎంతో స్వేచ్ఛగా రూపకల్పన ఉంటుంది. ఇది వౌఖికంగా చాలావరకు ఉంటుంది. నాకు రెండూ ఇష్టం. ఎం.్ఫల్‌కి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుండీ జానపద కళతో నాకు విడదీయని బంధం.
ప్ర: మీరు నర్తకుడు కదా.. అయనా ఎన్నో పుస్తకాలు రాశారు...
జ: అక్షరం పదిలం. నేను చేసిన రచనలు తరతరాలు మిగిలిపోతాయి నా తరువాత కూడా. నాకు రాయడం అంటే ఎంతో ఇష్టం.
ప్ర: మీరు నృత్యం నేర్పిస్తారా?
జ: 1999 నుండి సంప్రదాయ, జానపద నృత్యాలు నేర్పిస్తున్నాను. నాకు సామాజిక అంశాలతో రూపకల్పన (కొరియోగ్రఫీ) చేయడం ఇష్టం. సుజాత గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్‌లో 1999 నుండి నేర్పిస్తున్నాను.
ప్ర: మీరు ఎన్ని పుస్తకాలు ప్రచురించారు?
జ: నేను తెలుగు, కన్నడ, ఇంగ్లీషు భాషలలో పుస్తకాలు ప్రచురించాను.
తెలుగులో - ఒగ్గు కథ - అభినయ సమన్వయం. కంగుంది కుప్పం వీధి నాటకాలు - శాస్త్రానుశీలనం. కళావ్యాసావళి, కూచిపూడి పగటి వేషాలు, మార్కండేయ యక్షగానం, తెలుగు కళారూపాల చరిత్ర.
కన్నడలో - ఒగ్గు కథ - అభినయ సమన్వయం, కంగుంది కుప్పం వీధి నాటకాలు - శాస్త్రానుశీలన.
ఆంగ్లంలో - ఒగ్గు కథ - ఎ కాంపనీడ్ ఇమిటేషన్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్. స్ట్రీట్ ప్లేస్ ఆఫ్ కంగుంది కుప్పం - ఎ టెక్నికల్ స్టడీ.
ప్ర: మీరు ఎంతో పరిశోధన చేశారు కదా...
జ: మార్కండేయ యక్షగానం మీద సవిమర్శక పరిశీలన 2011లో చేశాను. అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, న్యూఢిల్లీ వారి సీనియర్ రీసెర్చి ఫెలోషిప్ వచ్చింది. 2008-10 అప్పుడు కూచిపూడి పగటి వేషాల మీద పరిశోధన చేశా. నేను జానపద కళల విభాగంలో ఎం.్ఫల్ చేశాను. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి అప్పుడు నా పరిశోధనాంశం ఒగ్గు కథ - నాట్యశాస్త్రానుసారం. అదే విభాగం నుండి నేను పిహెచ్.డి 2007లో చేశాను. అప్పుడు నా పరిశోధనాంశం కంగుంది కుప్పం వీధి నాటకాలు - శాస్త్రానుశీలనము. నా పిహెచ్.డి సిద్ధాంత వ్యాసం కోసం నాకు స్వర్ణ పతకం కూడా లభించింది. ఇప్పుడు నేను కూచిపూడి నృత్యంలో పిహెచ్.డి. చేస్తున్నాను అదే విశ్వవిద్యాలయం నుండి. నేను భరతుడి నాట్యశాస్త్రం మీద పరిశోధన చేస్తున్నాను. నా పరిశోధనాంశం.. నాట్యశాస్త్రం - ఒక పరిశీలన.
ప్ర: మీరు కొరియోగ్రఫీ చేసిన వివరాలు..?
జ: సిపాయిల తిరుగుబాటు 150 సంవత్సరాల సందర్భంగా నా బాలే ‘1857 నుండి 1947 స్వాతంత్య్ర పోరాటం’ అందరి మన్ననలు అందుకుంది. యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప 2007లో నేను రూపకల్పన చేసిన థీమ్‌సాంగ్ అందరూ మెచ్చుకున్నారు. 4వ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్, కడప, డిసెంబర్ 2012లో తెలుగు వైభవం బాలే చేశాం.
150 నర్తకులతో వందేమాతరం చేయించాను. ఇది ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్, ఎ.పి పోలీస్ అకాడెమీ, హైదరాబాద్, ఫిబ్రవరి 2012 శ్రీకృష్ణ దేవరాయ బాలే, పంచ శతాబ్ది ఫెస్టివల్, కడప, జులై 2010.
‘పర్యావరణం’ బాలే, 220 కళాకారులతో హైదరాబాద్‌లో డిసెంబర్ 2007.
శ్రీకృష్ణ తత్త్వం - మొయినాబాద్, 1999లో 40 మంది కళాకారులతో.
డానె్సస్ ఆఫ్ ఇండియా బాలే, ఫిబ్రవరి 1990లో 160 మంది కళాకారులతో.
వందేమాతరం, భారతీయ విద్యాభవన్, ఫిబ్రవరి 1996లో 75 మంది కళాకారులతో.
శాంతికి వారసులు - సాంఘిక బాలే, హైదరాబాద్‌లో 65 మంది కళాకారులతో.
ప్ర: మీరు ఎన్ని పుస్తకాలకు సంపాదకత్వం వహించారు?
జ: లలిత కళాదర్శిని -1, 2, దర్శిని, నృత్యాంజలి, సుజన రంజని - నృత్య మంజరి - 3,4, ఇంటర్నేషనల్ కూచిపూడి కనె్వన్షన్, సిలికాన్ ఆంధ్ర ప్రచురణ. ఇవన్నీ కళలకు అంకితమైన మంచి సావనీర్లు.
ప్ర: మీరు ఎన్ని గౌరవాలు పొందారు..
జ: నా సిద్ధాంత వ్యాసం పిహెచ్.డికి స్వర్ణ పతకం వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుండి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చింది. ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు ప్రచురించాను. ఇప్పుడు రెండవ పిహెచ్.డి. చేస్తున్నాను. నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్‌కి ఎడిటర్‌గా ఉన్నాను. ఎన్నో లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్స్ ఇచ్చాను. నా పిహెచ్.డి. ఎం.్ఫల్ సిద్ధాంత వ్యాసాలు ఇంగ్లీషు, కన్నడ భాషలలోకి ద్రవిడియన్ విశ్వవిద్యాలయం, కుప్పం అనువదించింది. దాదాపు ముప్పై సంవత్సరాల నుండి జానపద మరియు శాస్ర్తియ నృత్యాలు నేర్పిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ కి మేనేజర్ ఫోక్ ఆర్ట్స్‌గా పని చేశాను.
చిత్రాలు..మంత్రి కేటీఆర్ సమక్షంలో పుస్తకావిష్కరణ..
*మార్కండేయ యక్షగానం పుస్తకావిష్కరణ సభలో..
*ద్రవిడ విశ్వవిద్యాలయంలో సత్కారం..

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి