S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యుగాది నానీలు...

ఆకాశంలో
పాలపుంతలా
మామిడమ్మ
ఒళ్లంతా నిండుగా పూత!

కాకి పొదిగిన
కోయిల తన ఉనికిని
చాటుతూ కుహూల
కచేరీ మొదలుపెట్టింది!

వ్యయానికి తగ్గ
ఆదాయాన్ని పెంచి
అవమానాలను తృంచమని
పంచాంగ శ్రవణం హెచ్చరిస్తోంది!

శరీరంలోని
చేదుని వదిలించుకోమని
వేప్పువ్వు
చెట్టంతా విరబూసింది!

పాత కవితొకటి
కొత్త చొక్కా తొడుక్కొని
కవి సమ్మేళనంలో
కదం తొక్కుతోంది!

-యన్.కే.నాగేశ్వరరావు 90303 60988