S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈ ఉగాదికి.. ఇలా!

ఆగాగు..!
మామిడి పిందెలు
కోసుకొచ్చేటప్పుడు
కాసిన్ని మమతల్నీ తీసుకురా!
వేపపూల కోసం వెదుకుతూన్నప్పుడు
దారిలో జారిన చిరునవ్వులు
దాచుకుని తెచ్చుకో
తోటలో కోయిల పాట మొదలవగానే
మనసు లోపల నాలుగు మంచి మాటలు
వరుసలో పేర్చుకో
బెల్లం ముక్క తీపిలో కొంచెం
ప్రేమ కలుపుకో
చింతపండు పులుపులో
చింతలన్నీ దులుపుకో
ఆరు రుచుల పచ్చడిలో...
దూరుతోంది జీవన సారం
కష్టసుఖాల కలయికగా
మారుతుంది వ్యవహారం
శ్రమ మన సంస్కృతి
ప్రకృతి ప్రథమ కృతి
ఆమనిది మనసు దోచే శృతి
నిరాశ దరికి రానప్పుడు
నీ రాశి ఏదైతేనేం?
సారం నీలో ఉండాలి గానీ
వారంతో పనేముంది?
విధి నిర్వరిస్తే తిథి ఏం చేస్తుందని?
నిగ్రహానికే ఎప్పుడూ గ్రహాల అనుగ్రహం..
అవమానాన్ని అభిమానం జయిస్తే
సంవత్సర ఫలం ఎప్పుడూ సంతోషమే
తలస్నానం చేస్తూ మనసుని శుభ్రంగా కడుగు
కొత్త బట్టలేసుకుంటూ చెత్త ఊసులొదులు
సూరీడు వచ్చే వేళకి వెలుగుతూ ఎదురెళ్లు
పచ్చని చెట్ల మధ్య నిలబడి కొత్త చిగురు తొడుగు
ఈ ఉగాదికి నువ్వే కోయిలవై..
మనసు మామిడి తోటల్లోంచి
మానవతా గీతం పాడు!

-గరిమెళ్ల నాగేశ్వరరావు 94918 04709