S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆది సోమ మంగళ వారాల్లో భాగస్వామ్య అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయాలకు ఆస్కారం. పెద్దలతో చర్చలు, సమావేశాలు. నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బుధ గురువారాల్లో అనుకోని సమస్యలు, అనారోగ్య లోపాలు. అన్ని నిర్ణయాల్లో, కార్యక్రమాల్లో అప్రమత్తంగా మెలగాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో సమస్యలుంటాయి. లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో ఒత్తిడులు. వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రశాంతంగా గడపాలి. శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో సంతృప్తి. ఉన్నత వ్యవహారాలు, దూర ప్రయాణాలకు అవకాశం. సహకారం అధికంగా లభిస్తుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలుంటాయి. భాగస్వామ్యాల్లో సంతోషం. కొత్త పనులను చేపట్టవచ్చు. సోదర వర్గంతో అనుకూలత. గురువుల మార్గదర్శనం లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆది సోమ మంగళ బుధవారాల్లో పోటీలు, ఒత్తిడులు, చికాకులు తప్పకపోవచ్చు. అనవసరమైన ఖర్చులుంటాయి. విందులు వినోదాలపై దృష్టి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. శత్రువులు, రుణాలలు, రోగాల సంబంధించిన ఆలోచనలుంటాయి. మొండితనం ఇబ్బంది పెట్టవచ్చు. బుధ గురువారాల్లో భాగస్వామ్యాల్లో అనుకూలత. నూతన పరిచయాలు ఇబ్బంది పెట్టే సూచనలు. తొందరపాటు కూడదు. మధ్యవర్తిత్వాలకు దూరంగా మెలగాలి. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. నిర్ణయాదుల్లో అప్రమత్తంగా మెలగాలి. శుక్ర శనివారాల్లో అనుకోని సమస్యలుంటాయి. ప్రమాదాలకు అవకాశం. వ్యతిరేకతలు అధికవౌతాయి. అనారోగ్య భావనలు. నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. దైవధ్యానం, ఆధ్యాత్మిక యాత్రల వల్ల అనుకూలత.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆది సోమ మంగళ వారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. స్ర్తి జన సహకారం, మార్గదర్శనం లభిస్తుంది. సంతాన వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. ఆలోచనలకు రూపకల్పన. నూతన కార్యక్రమాలకు అనుకూలం. బుధ గురువారాల్లో అన్ని విషయాల్లో పోటీలు, ఒత్తిడులుంటాయి. శత్రువుల బాధలు పెరుగుతాయి. రుణాదుల వల్ల ఇబ్బందులు. భాగస్వామ్యాల్లోనూ జాగ్రత్త వహించాలి. ఖర్చులు, నష్టాలు తప్పకపోవచ్చు. సత్కార్యక్రమాల కోసం వెచ్చించాలి. శుక్ర శనివారాల్లో పరిచయాలు, భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి. కొంత జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. పెద్దల మార్గదర్శనాన్ని స్వీకరించాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆది సోమ మంగళవారాల్లో సౌకర్యాలు, సౌఖ్యంపై దృష్టి. గృహ వాహనాది వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాలపై దృష్టి. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడితో గుర్తింపు అధికారిక వ్యవహారాలకు అనుకూలం. సుఖంగా గడిపే ప్రయత్నం. శ్రమ తప్పకపోవచ్చు. బుధ గురువారాల్లో ఆలోచనలకు రూపకల్పన. అభీష్టాలు నెరవేరడానికి ఎక్కువ ప్రయత్నించాలి. అన్ని పనుల్లో లాభాలుంటాయి. సంతాన వర్గ వ్యవహారాలపై దృష్టి. సృజనాత్మకత పెరిగినా అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు కూడదు. శుక్ర శనివారాల్లో వ్యతిరేక ప్రభావాలు అధికం. మొండిగా ప్రవర్తిస్తారు. ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. శత్రు రుణ రోగాదులు శ్రమకు గురిచేయవచ్చు. కార్యనిర్వహణలో జాగ్రత్త అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆది సోమ మంగళ వారాల్లో ఇతరుల సహకారం అధికంగా లభిస్తుంది. సోదర వర్గ అనుకూలత. దగ్గరి ప్రయాణాలు, ఆధ్యాత్మిక, విహార యాత్రలకు అనుకూలం. రచనలకు చక్కని ప్రోత్సాహం. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. నూతన కార్యక్రమాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ఘర్షణ తప్పదు. బుధ గురువారాల్లో ఆహార విహారాలపై దృష్టి. గృహ వాహనాది వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. ఏవో కొన్ని లోపాలుంటాయి. వాటికి దూరంగా మెలగాలి. సామాజికమైన గౌరవం ఉంటుంది. శుక్ర శనివారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. లాభాలున్నా అనుకోని సమస్యలు కూడా ఉండవచ్చు. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. గురువుల మార్గదర్శనం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆది సోమ మంగళవారాల్లో కుటుంబంలో అనుకూలత. ఆర్థిక వ్యవహారాలు చర్చిస్తారు. మాట విలువ పెంచుకునే ప్రయత్నం. అనుకోని సమస్యలుంటాయి. విహారాదుల్లో జాగ్రత్త. వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. కాలం, ధనం కోల్పోకుండా చూడాలి. నిల్వధనంపై ప్రత్యేక దృష్టి. బుధ గురువారాల్లో సహకారం లభిస్తుంది. సోదర వర్గ వ్యవహారాలు స్పందింపజేస్తాయి. ప్రయాణాదులకు అనుకూలం. మాతృవర్గ వ్యవహారాలపై దృష్టి, లక్ష్యాలను సాధించే యత్నం. కార్యనిర్వహణలో ముందడుగు వేస్తారు. శ్రమ ఉన్నా శుభ ఫలితం. శుక్ర శనివారాల్లో ఆహారాదులపై దృష్టి. గృహ వాహనాది సౌకర్యాలు ఇబ్బందికి గురి చేయవచ్చు. గుర్తింపు కోసం ప్రయత్నం. శ్రమాధిక్యం. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత అనుకూలత.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆది సోమ మంగళ వారాల్లో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాలతో విహార యాత్రలకు అనుకూలం. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. బుధ గురువారాల్లో కుటుంబంలో శుభ పరిణామాలు. ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. మాట విలువ పెరుగుతుంది. అనుకోని సమస్యలున్నా ఇతరుల సహకారంతో అధిగమిస్తారు. అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. శుక్ర శనివారాల్లో ఇతరుల సహకారం లభిస్తుంది. సేవక జనులతో అనుకూలత. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త. నిర్ణయాదులకు అనుకూలం. గుర్తింపు గౌరవాలుంటాయి. గురువుల మార్గదర్శనం లభిస్తుంది. వ్యవహారాల్లో విజయం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆది సోమ మంగళవారాల్లో ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. ప్రయాణాలుంటాయి. విందులు విహారాల కోసం ప్రయత్నిస్తారు. పరామర్శలకు అవకాశం. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. తొందరపాటు కూడదు. శ్రమతో గుర్తింపు. రుణ బాధలు, అనుబంధాల్లో సమస్యలుంటాయి. బుధ గురువారాల్లో నిర్ణయశక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. సామాజిక అనుబంధాల్లో శుభ పరిణామాలు. భాగస్వామ్యాలు సంతృప్తినిస్తాయి. నూతన నిర్ణయాలుంటాయి. శుక్ర శనివారాల్లో కుటుంబ ఆర్థికాంశాల్లో అప్రమత్తంగా మెలగాలి. మాటల్లో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. శారీరక, మానసిక వత్తిడులను అధిగమించాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆది సోమ మంగళ వారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల మార్గదర్శనం. గురువుల ఆశీస్సులు లభిస్తాయి. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ అనుకూలత. నూతన కార్యక్రమాలపై దృష్టి. సృజనాత్మక వ్యవహారాలుంటాయి. కార్యనిర్వహణలో సంతృప్తి. బుధ గురువారాల్లో అన్ని పనుల్లోనూ ఖర్చులుంటాయి. పెట్టుబడుల్లో శుభ పరిణామాలు. వ్యతిరేకతలుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. శత్రు రుణ రోగాదులు ఇబ్బంది పెట్టే అవకాశం. ప్రయాణాలు, పరామర్శలుంటాయి. శుక్ర శనివారాల్లో నిర్ణయాదుల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. మొండితనం తగ్గించుకోవాలి. తొందరపాటు కూడదు. భాగస్వామ్యాల్లో అనుకూలత. పెద్దల మార్గదర్శనం ఉంటుంది. నూతన ప్రణాళికలకు అనుకూలం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆది సోమ మంగళవారాల్లో వృత్తి ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి. అధికారిక వ్యవహారాలపై దృష్టి. వ్యాపార లాభాలుంటాయి. సామాజికమైన గుర్తింపు లభిస్తుంది. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. గృహ, వాహనాలు సంతృప్తినిస్తాయి. కార్యనిర్వహణలో శ్రమతో అనుకూలత. బుధ గురువారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాలు. పెద్దల అనుకూలత, మనోభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. సంతాన వర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కొత్త పనుల నిర్వహణ ఉంటుంది. సంతృప్తి. శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లోనూ ఖర్చులు, పెట్టుబడులుంటాయి. వ్యర్థంగా కాలం, ధనం పోయే అవకాశం. వ్యతిరేకతలు బాగా పెరగవచ్చు. శ్రమతో గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాదుల్లో జాగ్రత్త. పరామర్శలకు అవకాశం.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆది సోమ మంగళవారాల్లో అన్ని పనుల్లో అనుకూలత. నూతన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇతరుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అధికం. విజ్ఞాన విహార ఆధ్యాత్మిక యాత్రలుంటాయి. సంతృప్తిగా గడుపుతారు. సోదరీమణుల సహకారం, కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. బుధ గురువారాల్లో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యనిర్వహణలో శ్రమ అధికం. సౌకర్యాలు సమకూర్చుకునే యత్నం. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. సామాజికమైన గుర్తింపు. శుక్ర శనివారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతృప్తినిస్తాయి. వ్యతిరేకతలపై విజయం. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాల్లో అనుకూలత. నూతన కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆది సోమ మంగళ వారాల్లో అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య లోపాలకు అవకాశం. నిర్ణయాదులు వాయిదా వేసుకోవాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. వౌనంగా మెలగడం మంచిది. బుధ గురువారాల్లో అన్ని పనుల్లో అనుకూలత. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఇతరుల సహకారం లభిస్తుంది. ప్రయాణాదులకు అనుకూలం. ఆధ్యాత్మిక భావనలుంటాయి. ప్రశాంతంగా గడుపుతారు. సంతృప్తి. శుక్ర శనివారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. సామాజిక వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో విభేదించే అవకాశం. తొందరపాటు కూడదు. గృహ, వాహనాలు, ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744