S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సాధువు - అలియాస్

అలియాస్ అన్న పేరుగల భారతీయ సంగీతకారుడు ఉండేవాడు. ఆయన గొప్ప సాధువు. పవిత్ర జీవనం గడిపేవాడు. భక్తిశ్రద్ధలతో జీవించేవాడు. అతనిది నిరాడంబర జీవనశైలి. అతను రోజుకు ఒక రొట్టె తిని కాలం గడిపేవాడు. జనం అతనికి ఎక్కువగా ఆహారం ఇచ్చినా ఏదీ రేపటిదాకా దాచుకునేవాడు కాదు. మిగిలింది ఇతరులకు ఇచ్చేసేవాడు.
ఒక వ్యక్తి ఆయన్ని ‘మీరు ఎందుకు మీ జీవితాన్ని ఇతర్ల మీద ఆధారపడి వుండేదిగా మలుచుకున్నారు?’ అని అడిగాడు.
దానికి ఆయన ‘మనందరం పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడిన వాళ్లమే. నేను ఇతర్లని ఇబ్బంది పెట్టనంతవరకు అదంతా దేవుని గుండానే నా దగ్గరకు వస్తోందని, అంతా దేవుని దగ్గరకే వెళుతోందని భావిస్తాను’ అన్నాడు.
అత్యుత్సాహం
ఒక సేవకుడు ఉండేవాడు. యజమానికి ఒకరోజు తలనొప్పి వచ్చింది. మందుల షాపునకు వెళ్లి తైలం తీసుకురమ్మని, అది పూసుకుంటే తలనొప్పి పోతుందని యజమాని సేవకునితో చెప్పాడు.
సేవకుడు దారిలో ఆలోచనలో పడ్డాడు. తైలంతో తగ్గకుంటే అనుకుని వైద్యుడికి కబురు చేశాడు. వైద్యుడు బాగుచేయకుంటే, తలనొప్పి ఎక్కువై యజమాని కన్నుమూస్తే, గుంత తవ్వడానికి ఇద్దరు, యజమానిని స్మశానం దాకా మోయడానికి నలుగురు మనుషులు అవసరమవుతారు కదా’ అని ఆరుగురిని వెంటదీసుకొచ్చి బయట వుండమన్నాడు.
యజమాని ‘ఎందుకు ఆలస్యమైంది?’ అని అడిగాడు.
సేవకుడు ‘అవసరమయిన అందర్నీ తీసుకొచ్చేసరికి ఆలస్యమైంది’ అన్నాడు.
విషయం తెలిసి యజమాని సేవకుని అత్యుత్సాహానికి విస్తుపోయాడు.

- సౌభాగ్య, 9848157909