S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నవయవ్వనంలో నాణ్యమైన ఆహారం

ఫ్రశ్న: రొమ్ము కేన్సర్ రాకుండా ఆహారంలో ఏమైనా మార్పులు చేయాలా?
-రోహిణీ భాస్కర్ (సికిందరాబాద్)
జ: యవ్వనారంభం నుండి అంటే టీనేజీ నుండీ కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినేవారికి రొమ్ము కేన్సర్ ప్రమాదం ఎక్కువని ఇటీవలి పరిశోధనలు నిరూపిస్తున్నాయి. రంగులు కలిసిన విష పదార్థాలు వీటికి తోడౌతున్నాయి. నలభైలొచ్చాక డైటింగ్ చేయొచ్చు కానీ, కుర్రకారుకు ఇవన్నీ వర్తించవని చాలామంది బహిరంగంగానే అంటూంటారు. ఈ వయసులో తప్ప ఇంకెప్పుడు తింటారని ప్రశ్నిస్తారు. ఇలాంటి ఆలోచనలను సరిచేసుకోవాలని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. పాతికేళ్లలోపు వయసులో చేసే ఆహార విహారాలే నలభైలు దాటాక రొమ్ము కేన్సర్ లాంటి వ్యాధులకు కారణమవుతున్నాయని ‘మెడికల్ న్యూస్ టు డే జర్నల్’లో ఇటీవల ప్రచురితమైన ఒక పరిశోధన చెప్తోంది.
ఈ హెచ్చరిక తేలిగ్గా తీసుకోవాల్సింది కాదు. మన యువతరం ఆహార విహారాలు విదేశీ ప్రభావం వలన రూపొందుతున్నవే అయినప్పుడు ఈ విదేశీ పరిశోధనలను కొట్టేయలేము. చైనా నూడుల్స్, పిజ్జాలు, ఇంకా జంక్ ఆహారాల్ని జంకు లేకుండా తినటం వలన భవిష్యత్తులో రొమ్ము కేన్సర్, గుండె జబ్బుల ముప్పునకు కారణం అవుతాయని అర్థం చేసుకోవాలి.
యవ్వనారంభ కాలంలో ఆడపిల్లల ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వలన భవిష్యత్తులో రొమ్ము కేన్సర్ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని ప్రొ.డోర్గాన్ అనే శాస్తవ్రేత్త పేర్కొన్నాడు. సాధారణంగా ఆడపిల్లలు ఇంట్లో భోం చేసేప్పుడు నెయ్యి, నూనెలు వేసుకోరు. గొప్పగా డైటింగ్ చేస్తున్నాం అంటారు. కానీ కేకులు, నక్షత్రాల చాక్లెట్లు, కోవా స్వీట్లు, పిజ్జాలూ, బిరియానీ, ఫ్రైడ్ రైసులంటే ఎక్కువగా మక్కువ చూపేది ఆడపిల్లలే! వ్యాపార ప్రకటనలు కూడా ఆడ పిల్లలను ఎక్కువ ఆకర్షించటానికి ఉద్దేశించి ఉంటాయందుకే! కొవ్వు ఎక్కువగా కలిసిన ఆహార పదార్థాలే ఇవన్నీ!
తెలుగువారి ఆహారానికొచ్చేసరికి కొవ్వు విషయంలో చాలా తికమక ఉంది. కల్తీదారుల వలన, విదేశీ కంపెనీల వలన మన ఆహారం పూర్వపు వైభవాన్ని కోల్పోయింది. మనకు మార్కెట్‌లో దొరికే నూనెలో నూనె ఎంత ఉంది, నెయ్యిలో నెయ్యి ఎంతుంది అనే ప్రశ్నలకు సూటిగా సమాధానం దొరకదు. నేతిబీరలో నెయ్యి సామెత మన నెరుూ్య నూనెలకు బాగా వర్తిస్తుంది. ఆహారంలో నాణ్యతకు భరోసా లేకుండా పోతోంది. ఆహార ద్రవ్యాల మీద ప్రభుత్వ అదుపు ప్రశ్నార్థకం అయింది.
ఈ పరిస్థితులలో ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే రేపటి ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం అవుతుంది. నెయ్యి, నూనె, తేనె ఆఖరికి నీళ్లూ, పాలు కూడా కల్తీమయంగా ఉన్నప్పుడు, కొవ్వు అనేది మనల్ని నాశనం చేసే ఒక దుష్టశక్తిగా మారుతోంది. అందుకనే కొవ్వు విషయంలో మనం కళ్లు తెరిచి వాస్తవాల్ని చూడాల్సిందే!
పాతికేళ్ల క్రితం వరకూ మనకు దొరికిన నూనె వేరు, గానుగ దగ్గర నిలబడి నూనె పట్టించుకుని తెచ్చుకునే వాళ్లు. ఇప్పుడొచ్చే పాకెట్ల నూనె వాడకం మొదలయ్యాక స్థూలకాయం రోగుల శాతం పెరిగింది. నూనె రుచి తగ్గింది. ఈ నూనె నాణ్యమైనదేనా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగే ఇతర ఆహార ద్రవ్యాల పరిస్థితి కూడా!
అందుకని రొమ్ము కేన్సర్ రాకుండా ఉండాలంటే కొవ్వు పదార్థాల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిందేననీ, ముఖ్యంగా టీనేజీలో కొవ్వు పదార్థాలకు బానిస కావటం మంచిది కాదనీ ఈ పరిశోధనల సారాంశం. నూనెలో వేసి బొగ్గు ముక్కల్లా వేయించిన పదార్థాలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. వంకాయ బొగ్గులు, బెండకాయ బొగ్గులూ, దొండకాయ బొగ్గులూ మనకు అపకారం చేసేవే!

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com