S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఊహ

ఊహ గొప్పదై వుండాలి.
మన ఊహ గొప్పగా లేకపోతే మనం చేసే పనిలోకి గొప్పతనం రాదు
మనం ఎంతైతే ఊహిస్తామో అది సాధించడానికి ప్రయత్నం చేస్తాం.
మన ఊహ చిన్నదైనప్పుడు ఫలితం కూడా చిన్నగానే ఉంటుంది.
ఈ అభిప్రాయానికి దగ్గరగా వుండే ఓ కథనం ఈ మధ్య చదివాను.
ఓ ఇల్లు కట్టడానికి ఓ వ్యక్తి నిర్ణయం తీసుకుంటాడు. అతనికి స్థలం చాలా వుంటుంది. ఆ స్థలంలో అతను ఓ పెద్ద ఇల్లు కట్టవచ్చు. కానీ అతని ఊహ చిన్నగా ఉంటుంది. చిన్న ప్లాన్ గీస్తాడు.
సుతారీ (మేస్ర్తి) వచ్చి సున్నంతో గీతలు వేస్తాడు. ఆ గీతలు ఎంత వున్నాయో అదే మాదిరిగా ఆ ఇల్లు తయారవుతుంది. అంతకన్నా పెద్దది కట్టే అవకాశం లేదు. అక్కడ వున్న స్థలం చాలా పెద్దది. పెద్ద ఇల్లు కట్టే స్తోమత కూడా ఆ వ్యక్తికి వుంది.
కానీ అతని ఊహ చిన్నది. అందుకని పెద్ద భవనం వచ్చే అవకాశం లేదు.
మన లక్ష్యాలు పెద్దవైనప్పుడు మనం గీసే గీతలు కూడా పెద్దవై వుండాలి.
మన ప్రయాణంలో ఈ గీతలు చాలా ప్రాధాన్యతని సంతరించుకుంటాయి.
మనం కల కనేటప్పుడే పెద్ద కలను కనాలి. ఆ కలకు తగినట్టు శ్రమించాలి. అప్పుడే గొప్పతనం వస్తుంది.
అవకాశాలు వుండటం ఒక ఎత్తు. వాటిని సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు.
ప్రతి వ్యక్తికి తన కలలను పూర్తి చేసుకోవడానికి విశాలమైన స్థలం వుంటుంది.
అయితే అతను గీసుకునే గీతలు విశాలంగా ఉండవు. విశాలమైన గీతలు గీసుకోవడానికి చాలామంది సాహసించరు.
ఊహ గొప్పదై వుండాలి.
మన ప్రయత్నం ఇంకా గొప్పగా వుండాలి.
*