ఒకేసారి రెండూ..
Published Saturday, 12 May 2018బరువును తగ్గించుకోవడానికి ఈతను మించింది లేదు. అలాగే గుండె వ్యాయామానికి ట్రెడ్మిల్. ట్రెడ్మిల్ అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ ఈతకొలనును పెట్టుకునే స్థోమత అందరికీ ఉండదు కదా! అలాంటివారికోసం వచ్చిందే ఆక్వా ట్రెడ్మిల్. సాధారణంగా కీళ్లనొప్పులు ఉన్నవారు ఈత, ట్రెడ్మిల్ వంటివి చేస్తే నొప్పులు వస్తాయని చాలామంది వాటిని చేయాలంటే జంకుతారు. అటువంటివారి కోసం జపాన్‌కు చెందిన వాటర్ వాకర్ స్పా వారు రూపొందించిన యంత్రమే ఆక్వా ట్రెడ్మిల్. పెద్ద నీటితొట్టి ఉండి, దాని అడుగుభాగంలో ట్రెడ్మిల్ ఉంటుంది. నీటిలో మన బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ట్రెడ్‌మిల్‌పై పరుగులిడినా కీళ్లమీద ఒత్తిడి పడదు. ఫలితంగా కీళ్లనొప్పులు రావు. పైగా ఇది ఈత వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలను కూడా అందిస్తుందట. వ్యాయామ ప్రియులూ.. మరింకెందుకాలోచన? ఆలస్యం చేయకుండా దీన్ని కొని తెచ్చుకుంటే సరి.