S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అవధుల్లేని ఆనందం!

బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఆనందానికి అవధుల్లేకుండా పోతోందట. కారణం లేకపోలేదు...ఆమె నటించిన షార్ట్ఫిలిం ‘అహల్య’తో పెద్ద సంచలనం సృష్టించడంతో ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. ‘అహల్య’ను చూసిన వారంతా ఆప్టేను ఆకాశానికి ఎత్తేస్తుంటే ఆమె ఉబ్బి తబ్బిబ్బయిపోయిందట. ఈ చిత్రం ఇటు వీక్షకులు..అటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఏ తారకైనా ఇంతకంటే ఆనందమేముంటుంది? తను నటించిన చిత్రం ఇంతటి విజయాన్ని అందుకోవడమంటే మాటలు కాదు, చేతలు కావాలి. ఆ చేతలే రాధికా ఆప్టేలో తన నటన ద్వారా తెరపై ఒలకబోసిందని సినీ జనాలు గుసగుసలాడుకున్నారు. ఒకప్పుడు షార్ట్ఫిలింలు అంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని దాని రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తాజాగా దర్శకుడు శిరీష్ కుందర్ కూడా ఇలాంటి ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. మనోజ్ బాజ్‌పేయి, రాధికా ఆప్టే వంటి బాలీవుడ్ స్టార్‌లతో ‘క్షితి’ అనే చిన్న చిత్రాన్ని ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ సినిమా ఓ సైకలాజికల్ థ్రిల్లర్. గతంలో పలు షార్ట్ ఫిలింలలో నటించిన రాధిక, మనోజ్ తొలిసారి ఈ ప్రాజెక్టుకోసం కలిసి పనిచేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రాధికా ఆప్టే జోరు ఊపందుకుంది. అదీ..సంగతీ!!

హా..హా..హన్సిక!
అందాల ముద్దుగుమ్మ హన్సిక అనుకున్నవేవీ జరగడంలేదట! వెండితెరపై అడుగుపెట్టినప్పటి నుంచి ఎంతగానో ఆశించి, ఎన్నో కలలుగన్న ఈ భామకు ఇప్పటికీ తనకు నచ్చిన పాత్ర లభించనేలేదట. ‘అవునా..ఇది నిజమా?’ అని ఎవరైనా హన్సికను కదిలిస్తే- ‘‘నిజమే. నేను అనుకున్న పాత్ర నాకు ఇప్పటికీ లభించనే లేదు. వచ్చిన అవకాశాల్లో మంచివి అనుకున్నవి చేస్తూపోతూనే వున్నా. కానీ నాకు నచ్చిన పాత్ర మాత్రం ఇప్పటికీ దొరకలేదు. అందుకే అన్ని భాషల్లో నటిస్తున్నా. ఒక్క భాషకే పరిమితం కాదల్చుకోలేదు. ఏ భాషలో ఏ పాత్ర లభిస్తుందో తెలియదు. నా టార్గెట్ మాత్రం అన్ని భాషల్లో నటించాలన్నదే. బాల నటిగా బాలీవుడ్ చిత్రాల్లో నటించినా అటు తర్వాత తెలుగు, తమిళంలో కథానాయికగా పెద్ద బ్యానర్లలో చిందులేసినా..అన్నీ గ్లామర్‌తో కూడుకున్నవే కావడం విశేషం. అందుకే ఇక నటనకు ఆస్కారం వున్న పాత్రలవైపు నా దృష్టి మళ్లింది. అన్ని భాషల్లో నటిస్తూనే నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నా’’అంటూ పెద్ద కహానీలే చెప్పుకొచ్చింది. ప్చ్..హన్సిక!!

నయనానందం!
అందాల భామలు అనుష్క, ఇలియానా, తమన్నా లాంటి క్రేజీ భామలెందరో గతంలో స్విమ్మింగ్ సూట్‌లో అందాల కనువిందు చేసి యువతకు భలే కిక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి దుస్తులు ధరించడం కథానాయికలకు కొత్తేమీకాకపోయినా..అందులో కొంతమంది హీరోయిన్లకు ఇలాంటి దుస్తులు స్పెషలనే చెప్పాలి. ముఖ్యంగా అందాల నయనతార ఇందుకు అతీతం ఏం కాదు. అజిత్‌కు జోడీగా ‘బిల్లా’లో నటించిన ఈ అమ్మడు టూపీస్ బికినీలో దుమ్ములేపింది. అంతేకాదు, ఆ చిత్రంలో నయనతార అందాల కనువిందు చూసి యువత చిత్తయిపోయింది. అటు తర్వాతా కొన్ని చిత్రాల్లో పాటల సన్నివేశాల్లో అందాల ప్రదర్శన చేస్తున్నా, ఎక్కువగా మాత్రం చీరల్లోనే కనిపించడానికి ప్రాధాన్యమిచ్చింది. ఇప్పుడు మరోసారి టూపీస్ బికినీ ధరించడానికి నయన సిద్ధమయిందట. నటుడు విక్రమ్‌తో తొలిసారిగా నటిస్తున్న ఈ కేరళ బ్యూటీ ఇందులో స్విమ్మింగ్ సూట్‌లో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. చూద్దాం..ఆమె అభిమానులు నయనతారను ఇలా చూసి ఎలా ఫీలవుతారో..!?

-సమీర్