S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జైలు పక్షి

ఏక్సెల్ జైలు పక్షి అని సెల్మాకి తెలుసు. ఐనా అతన్ని ప్రేమించింది. ఏక్సెల్ కూడా ఆమెని ప్రేమించాడు. సెల్మా అతన్ని ప్రేమించే దానికన్నా ఏక్సెల్ ఆమెని అధికంగా ప్రేమించాడు. వెంటనే పెళ్ళి చేసుకుందామని కోరాడు. వెంటనే అంటే అతని ఉద్దేశం జైలునించి విడుదలయ్యాక.
సెల్మాకి ఓ సమస్య వచ్చింది. ఏక్సెల్ జైల్లో ఉండగా ఆమె జోతో ప్రేమలో పడింది. ఏక్సెల్‌తో పోలిస్తే జో మంచివాడు. ప్లంబర్. నీతిగా ఎక్కువ సంపాదిస్తాడు. ఏక్సెల్‌లా అధికంగా ప్రేమించడం అతనికి చేతకాకపోయినా ఎప్పుడు జైల్‌కి వెళ్తాడో అనే భయం ఉండదు.
ఐతే ఏక్సెల్ పెరోల్ పూర్తిచేసుకుని మళ్ళీ జైలు శిక్షని కొనసాగించడానికి వెళ్తూ బెదిరించాడు.
‘‘సెల్మా. నేను జైలు నించి తిరిగి వచ్చేదాకా వేచి ఉండు. ఈలోగా ఇంకెవర్నైనా పెళ్ళి చేసుకుంటే మాత్రం నువ్వు తగిన ఫలితాన్ని అనుభవిస్తావు.’’22
ఏక్సెల్ అన్నంత పనీ చేస్తాడని ఆమెకి తెలుసు. తను త్రికోణపు సమస్యలో చిక్కుకుందని సెల్మాకి అనిపించింది. ఏక్సెల్ తనని ప్రేమిస్తున్నాడు. తను జోని ప్రేమిస్తోంది. జోని తను పెళ్ళి చేసుకుంటే ఏక్సెల్ జైలు నించి వచ్చాక తనని శవంగానో లేదా విధవగానో మార్చచ్చు. ఆమె ప్రాక్టికల్ మైండ్‌కి ఈ సమస్యకి ఓ పరిష్కారం లభించింది.
పెళ్ళికి ఎంతవుతుందో సెల్మా విచారించింది. నాలుగు వేల డాలర్లు. జోకి చెప్పగానే ఆ డబ్బుని సిద్ధం చేస్తానని కూడా చెప్పాడు.
జైలు నించి విడుదలయ్యాక ఏక్సెల్ ఆమెని తమకి పరిచయమైన బార్లోనే కలిసాడు. సెల్మా అతనితో ప్రాధేయపూర్వకంగా చెప్పింది.
‘‘ఏక్సెల్ డార్లింగ్! మనం వెంటనే పెళ్ళి చేసుకుందాం.’’22
‘‘నేను జైల్లో ఉండగా నాకు సంపాదన లేదు. ఎలా పెళ్ళి చేసుకోగలం? ముందు సంపాదించాలి.’’ ఏక్సెల్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.
‘‘ఐతే మళ్ళీ సంపాదించు. ఎలా సంపాదించాలో నీకు కొట్టిన పిండే కదా?’’2ఆమె సూచించింది.
‘‘ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అన్నది తెలుసుకోడానికి కొంత సమయం పడుతుంది.’’22
‘‘ఐతే నేను పనిచేసే ఇంట్లో నువ్వు దొంగతనం చేయొచ్చు.’’2సెల్మా ఉత్సాహంగా చెప్పింది.
ఏక్సెల్ ప శార్ధకంగా చూసాడు.
‘‘నేను పనిమనిషిగా పనిచేసే ఇంటావిడ విధవరాలు. ఆమెకో కెనడియన్ మింక్ కోట్ ఉంది. దాన్ని ఆమె కొని నాలుగేళ్ళు అవుతోంది. కొన్న మర్నాడే ఆవిడ భర్త అపెండిక్స్ పగిలి మరణించాడు. దాంతో సెంటిమెంటల్‌గా అప్పటి నించి దాన్ని వాడటం లేదు. పనె్నండు వేల డాలర్లు పెట్టి కొన్నానని నాకోసారి చెప్పింది.’’22
‘‘కెనడియన్ మింక్ చాలా ఖరీదైందని విన్నాను.’’ ఏక్సెల్ ఉత్సాహంగా చెప్పాడు.
‘‘దాన్ని ఆవిడ ఇన్‌సూర్ చేసింది కాబట్టి ఆవిడకి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అది దొంగిలించబడితే ఆవిడకి డబ్బొస్తుంది. దాన్ని నువ్వు అమ్మితే కనీసం నాలుగు వేల డాలర్లైనా వస్తాయి. కాబట్టి మనకి మనం సహాయం చేసుకుంటూ ఆవిడకీ సహాయం చేసిన వాళ్లం అవుతాం.’’22
ఏక్సెల్ వౌనంగా ఉండటంతో అడిగింది.
‘‘ఏమంటావు?’’22
‘‘నేను ఇక దొంగతనాలు చేయకూడదని జైల్లోనే నిర్ణయించుకున్నాను. మన పెళ్ళయ్యాక నువ్వు బయట, నేను జైల్లో ఉండి ప్రయోజనం ఏమిటి? అది మనిద్దరికీ ద్రోహం చేసినట్లు అవుతుంది.’’22
‘‘కాని ఈ దొంగతనంలో నువ్వు పట్టుబడవు. ఆ ఇంటి డూప్లికేట్ తాళం చెవి నా దగ్గర ఉంది. ఆవిడ ఇంట్లో లేనప్పుడు నేను పనిచేయడానికి వీలుగా దాన్ని నాకు ఇచ్చింది. మిసెస్ లింటన్ ప్రతీ శుక్రవారం రాత్రి తన అక్కతో ఒపేరాకి వెళ్తుంది. రేపు శుక్రవారం రాత్రి నువ్వు తేలిగ్గా లోపలకి వెళ్ళి దొంగతనం చేయచ్చు. ఆవిడ పడకగదిలోని వార్డ్‌రోబ్‌లో అది ఉంది. చూడగానే నువ్వా మింక్ కోట్‌ని గుర్తుపడతావు. ఆ నేరం నా మీదకి రాకుండా కిటికీలోంచి వచ్చినట్లుగా దాని అద్దాన్ని పగలకొట్టు.’’22
‘‘ఇంతదాకా నువ్వే ఆ పని ఎందుకు చేయలేదు?’’2ఏక్సెల్ అనుమానంగా అడిగాడు.
‘‘తక్షణం నేరం నా మీదకి వస్తుంది. దాని డూప్లికేట్ తాళం చెవి నా దగ్గరే ఉందని చెప్పాగా. నేను దొంగతనం చేసినా దాన్ని ఎవరికి అమ్మాలో నాకు తెలీదు. అలాంటివి నీకు తెలుసు.’’22
‘‘ఇప్పుడు మాత్రం రాదా?’’22
‘‘రాదు. ఆ సమయంలో నేను ఎలిబీ కోసం ఈ బార్లోనే ఉంటాను. బార్ టెండర్ నన్ను గుర్తుంచుకుంటాడు. ఎందుకంటే నేను నా చేతిలోని గ్లాస్‌ను పగలకొడతాను.’’22
ఏక్సెల్ కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు.
‘‘కాని పారిపోవడానికి నాకు కారు అవసరం. అది లేదు.’’22
‘‘నా కారు ఇవ్వను. అది నన్ను పట్టిస్తుంది.’’22
‘‘ఐతే ఏదైనా కారుని దొంగతనం చేస్తాను. శుక్రవారం రాత్రి పని కానిద్దాం. ఏ కారణంగానైనా మిసెస్ లింటెన్ ఒపేరాకి వెళ్ళకపోతే నాకు ముందుగా చెప్పు. లేదా ఆవిడ నన్ను చూస్తే మాత్రం నా చేతిలో చస్తుంది. ఇంకోసారి జైలుకి వెళ్ళలేను.’’22
‘‘అలాగే! శుక్రవారం రాత్రి పనయ్యాక ఇక్కడికే రా. ముందుగా దాన్ని అమ్మి సుమా.’’22
‘‘అలాగే! ఆ రాత్రి ఎనిమిదిన్నరకి మనం ఇక్కడ కలుద్దాం. ఆదివారం చర్చ్‌లో పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాను.’’ ఏక్సెల్ ఉత్సాహంగా చెప్పాడు.
తన పథకం విజయవంతంగా ముగిసినందుకు సెల్మా సంతోషించింది.
***
శుక్రవారం రాతి ఏడున్నరకి ఏక్సెల్ మిసెల్ లింటన్ ఇంటి బయట కారు ఆపాడు. కారు దిగకుండా ఆ ఇంటి వైపు కొద్దిసేపు చూసాడు. టీవీ ఆన్‌లో లేదు. ఏ గదిలో లైట్లు వెలగడం లేదు. అన్నిటికీ మించి ఆవిడ కారు ఇంటి బయట లేదు. అంటే ఇంట్లో లేదు.
అతను ఇటు, అటు చూసి సాక్షులు ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని కారు దిగి ఆవిడ ఇంటి తలుపు దగ్గరకి పెద్ద పెద్ద అంగలతో చేరుకున్నాడు. సెల్మా ఇచ్చిన డూప్లికేట్ తాళం చెవితో లోపలికి వెళ్ళి ఆమె చెప్పినట్లుగా మేడ మీది కుడివైపు రెండో తలుపు దగ్గర ఆగాడు. చెవిని తలుపుకి ఆనింది కొద్దిసేపు విన్నాడు.
నిశ్శబ్దం.
మెల్లిగా తలుపు తెరచుకుని మిసెస్ లింటన్ పడకగదిలోకి వెళ్ళాడు. వార్డ్‌రోబ్ తలుపు తెరిచాడు. ఆవిడ దుస్తులు ఏభైదాకా వెలాడుతున్నాయి. అతను మింక్ కోట్‌ని వెతికి తీసుకుని కిందకి వచ్చాడు. వెనక వంటగదికి ఉన్న తాళాన్ని పగలకొట్టాడు.
అతను లోపలికి వెళ్ళగానే ఓ చెట్టు చాటున దాక్కున్న సెల్మా వెంటనే సమీపంలోని టెలిఫోన్ బూత్ దగ్గరకి వెళ్ళి పోలీసుల నంబర్ డయల్ చేసి చెప్పింది.
‘‘ఒన్ ఫైవ్ ఒన్ ఒన్. ఛార్మెన్ లైన్‌లోని మిసెస్ లింటన్ ఇంట్లో దొంగతనం జరుగుతోంది. నేను ఓ పొరుగింటి ఆవిడని. నా పేరు చెప్పదలచుకోలేదు. వెంటనే ఎవర్నైనా పంపితే దొంగ రెడ్ హేండెడ్‌గా దొరుకుతాడు.’’22
రిసీవర్ పెట్టేసి బార్‌కి వెళ్ళిపోయింది. తన పథకం విజయవంతమై ఈపాటికి ఏక్సెల్ పోలీస్ కార్లో వెనక సీట్లో బేడీలతో కూర్చుని పోలీస్ స్టేషన్‌కి వెళ్తూంటాడని అనుకుంది. మరో పదేళ్ళ దాకా రాడు. ఎందుకైనా మంచిదని గ్లాస్‌ని పగలకొట్టింది. బార్ టెండర్ దాన్ని శుభ్రం చేసిన కొద్దిసేపటికి ఏక్సెల్ చిరునవ్వుతో రావడం చూసి నిర్ఘాంతపోయింది.
‘‘పనైందా?’’2బార్ టెండర్ దూరంగా వెళ్ళాక రహస్యంగా అడిగింది.
‘‘కాలేదు.’’22
‘‘అదేం? డూప్లికేట్ తాళం చెవి పనిచేయాలే?’’22
అతను బార్ టెండర్ తెచ్చిన మరో గ్లాస్‌లోకి విస్కీని ఓ గుక్క తాగి చెప్పాడు.
‘‘కొద్దిలో పట్టుబడేవాడిని.’’22
‘‘ఇంటావిడ ఒపేరాకి వెళ్ళిందిగా.’’22
‘‘ఆవిడ వల్ల కాదు. నేను మింక్ కోట్‌తో ఇంట్లోంచి బయటకి వస్తుండగా పోలీస్ కార్ సైరన్ వినిపించింది. వెంటనే దాన్ని నేను వెళ్ళిన కారు వెనక సీట్లో పడేసి నడిచాను. నేను ఊహించినట్లే వాళ్ళు రోడ్ మీద నడిచి వెళ్ళే నన్ను ఆపి చెక్ చేసారు. నా దగ్గర దొంగిలించిన వస్తువులేమీ లేకపోవడంతో వెళ్ళమన్నారు.’’22
‘‘అంటే ఇప్పుడు మింక్ కోట్ ఆ కార్లో ఉంద? మనం వెళ్ళి తెచ్చుకుందామా?’’22
‘‘అంటే మనకన్నా తెలివైనవాళ్ళు. ఒకడు వెనక సీట్లోని మింక్ కోట్‌ని చూసి అనుమానంగా ఆ కారు తలుపు తెరవడం చూసాను.’’22
సెల్మా దీర్ఘంగా నిట్టూర్చింది.
‘‘ఆ కారుని ఎవరు అద్దెకి తీసుకున్నారో వాళ్ళు అనుమానితులు అవుతారు.’’2 ఏక్సెల్ నవ్వుతూ చెప్పాడు.
‘‘అద్దెకారా? కారుని దొంగిలిస్తావని అనుకున్నాను?’’22
‘‘అనుకున్నాను. కానీ అది ప్రమాదం. ఐదు నిముషాల్లో అది గమనించి దాని యజమాని ఫిర్యాదు చేస్తే వెంటనే దాని కెసం పోలీసులు వెదుకుతారు. అందుకని కారుని అద్దెకి తీసుకున్నాను.’’22
‘‘నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదుగా? మరి కారుని ఎలా అద్దెకి తీసుకున్నావు?’’22 సెల్మా ఆశ్చర్యంగా అడిగింది.
‘‘కారుని దొంగిలించడం కన్నా, కారులోని డ్రైవింగ్ లైసెన్స్ దొంగిలించడం మంచిది అనుకున్నాను. ఓ సినిమా హాల్ పార్కింగ్‌లో ఆగిన కార్లల్లోని ఓ వేన్‌లోంచి డ్రైవింగ్ లైసెన్స్‌ని దొంగిలించాను. దాన్ని చూపించి ఆ పేరుతో కారుని అద్దెకు తీసుకున్నాను. ఇప్పుడు జో దొంగ అని పోలీసులు అనుమానిస్తారు.’’22
‘‘జో? అదా అతని పేరు?’’22
‘‘అవును. ఇదిగో.’’22
అతను చూపించిన డ్రైవింగ్ లైసెన్స్ మీద తను ప్రేమించే జో ఫొటో అతికించి ఉండటం గమనించిన సెల్మా మొహం తక్షణం వివర్ణమైంది.
‘‘వాడు ఎవడో ప్లంబర్. వాడు కార్లో దాచిన నాలుగు వేల డాలర్లని కూడా దొంగిలించాను. సినిమాల్లోలా పోలీసులు ఆలస్యంగా వచ్చారు. ఆదివారం మనం అనుకున్నట్లే పెళ్ళి చేసుకుందాం.’’ ఏక్సెల్ చెప్పాడు.
(జేమ్స్ హోల్డింగ్ కథకి స్వేచ్ఛానువాదం)

--మల్లాది వెంకట కృష్ణమూర్తి