S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డి-విటమిన్ లోపంతో కొత్త బాధలు

ఫ్రమోద లక్ష్మి పరుచూరి, ఖమ్మం
ప్ర : నాకు యాభై ఏళ్లు, కీళ్లనొప్పులున్నాయి. కొత్తగా షుగరు కూడా వచ్చింది. డాక్టర్లు ఎండలో ఉండాలని చెప్తున్నారు. మనకి ఎండ బాగానే ఉంటుంది కదా! ఎండ వల్ల కలిగే ఆరోగ్య లభాలాను వివరిస్తారా?
జ: విటమిన్ 3‘డి’2ని 3‘విటమిన్ సూర్యా’2 అని పిలవాలి. ఇంగ్లీషువాళ్లు ‘సన్‌షైన్ విటమిన్’ అని పిలుస్తారు. దాని ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసు.. ఎముకల వృద్ధికి తోడ్పడుతుందని.
ఇటీవలికాలంలో ‘డి’ విటమిన్ గురించిన పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయి. అనేక కొత్త వ్యాధుల్లో ‘డి’ విటమిన్ లోపం కూడా ఒక కారణంగా కనుక్కోవడంతో ‘డి’ విటమిన్ ప్రాధాన్యత గురించిన కొత్త విశేషాలు వెలుగులోకొస్తున్నాయి. కేన్సర్ వ్యాధిలోనూ, గుండె జబ్బుల్లోనూ, ఇన్సులిన్ ఆధారిత షుగర్ వ్యాధిలోనూ విటమిన్ ‘డి’ పాత్ర గురించి చాలా ముఖ్యమైన సమాచారం ఇప్పుడు అందుబాటులోకొస్తోంది. ఇవి నిర్ధారణ కావలసిన అంశాలు వీటిలో కొన్ని ఉన్నప్పటికీ వైద్యుడి సలహాతో తగినంత ఎండ తగిలేలా ప్రతి ఒక్కరూ చూసుకోవలసిన అవసరం ఉంది.
‘డి’ విటమిన్‌ని విటమిన్ సూర్య అని పిలవడం సబబుగా ఉంటుంది. ఇంగ్లీషువాళ్ళు సన్‌షైన్ విటమిన్ అంటారు. ఇంతకాలం ఇది ముఖ్యంగా ఎముకలు, కీళ్లు, కండరాల వ్యాధులకు సంబంధించిన విటమిన్‌గానే ఎక్కువగా వాడకంలో ఉండేది. ఇప్పడు ‘డి’ విటమిన్ ప్రాధాన్యతని, గుండె జబ్బులు, షుగర్ వ్యాధి, కేన్సర్ వ్యాధుల్లో కూడా గుర్తించారు. మానసిక వ్యాధుల్లో కూడా ‘డి’ విటమిన్ లోపాన్ని ఒక కారణంగా గుర్తించారు. విటమిన్లలో రారాజుగా ‘డి’ విటమిన్ పేరుగాంచే పరిస్థితి దగ్గర్లోనే ఉంది.
నిజానికి తెలుగు ప్రాంతాలు ఎండమండే ప్రదేశాలు. కానీ అపార్ట్‌మెంట్ల సంస్కృతి పెరిగాక ఇంట్లోకి గాలి, వెలుతురు రావటం అనేది తగ్గిపోయింది. ఏ ఇంట్లో పగటిపూట కూడా లైట్లు వేసుకుంటారో ఆ ఇంట్లో వాళ్ళ మీద సూర్యుడి దయ ప్రసరించదు. వారికి ఎముకల వ్యాధులు, కీళ్ళవాతం, గుండెజబ్బులతో పాటు షుగర్ వ్యాధి, కేన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని అర్థం. తెల్లవారుజామునే లేచి మైళ్ళ పర్యంతం నడిచినా, సూర్యోదయానికి ముందే ఇంటికి చేరే వాళ్లకు సూర్యుడి దయ ఏ మాత్ర మూ కలగదు. పూర్వపు రోజుల్లో విద్యార్థులు నడుచుకుంటూనో, సైకిల్ తొక్కుకుంటూనో స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళేవారు. తగినంత ఎండని వాళ్ళ శరీరాలు గ్రహించగలిగేవి ఆనాడు. ఇప్పుడు ఎండ తగలటం ఒక అవమానంగా భావిస్తున్నారు ఎక్కువమంది. గాలి, వెలుతురూ లేని తరగతి గదుల్లో చదువులు సాగుతున్నాయి. పిల్లలకు ఎండ తగలకుండా ఏసీ కారుల్లో తీసుకొచ్చి దింపుతున్నారు. పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో ఏసీ గదులు ఉంటాయి. తద్వారా పిల్లల్ని ఎండకు దూరం చేస్తున్నాం. ఎండ తగినంత లేకపోతే పిల్లల్లో బుద్ధి వికసించదని శాస్త వేత్తలు చెబుతున్నారు.
మనం పిల్లలకు సౌకర్యాలు కలిపిస్తున్నామనుకుంటున్నాం. అది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని వైద్యశాస్త్రం హెచ్చరిస్తోంది. ఏసీ గదుల్లో నివశిస్తూ, ఏసీ కారుల్లో తిరుగుతూ ఏసీ కార్యాలయాల్లో పనిచేసే పెద్దలక్కూడా సూర్యుడి దయ దక్కదు. కరెంటు లైటుల్లో మనం బతుకుతున్నంత మాత్రాన వెలుతురులో జీవిస్తున్నట్టు కాదు. విద్యుద్దీపాల వెలుతురు సూర్యకాంతికి ప్రత్యామ్నాయం కానేకాదు. సూర్యుడి కాంతి పడనిదంతా చీకటే! మనలో అధికులు అలాంటి చీకట్లోనే జీవిస్తున్నారు. ఎండ ఉన్న సమయంలో ఇంట్లోంచి బయటకు రాకుండా అంతఃపురానికి లేదా ఏసీ గదులకు పరిమితమైన స్ర్తీ , పురుషులంతా సూర్యస్పర్శారహితులే! సూర్యకాంతి తగలని వాళ్ల శరీరం తెల్లగా పాలిపోతుంది. చర్మం శక్తినీ, సహజకాంతినీ కోల్పోతుంది. త్వరగా కీళ్ళవాతం వ్యాపిస్తుంది. షుగరు వ్యాధి ఎప్పుడో చాలాకాలం తరువాత రావల్సింది ముందే వస్తుంది. కేన్సర్ లాంటి బాధలు పెరిగే అవకాశం ఉంది.
విటమిన్ ‘డి’ రెండు రకాలుగా ఉంటుంది. ఎర్గోకేల్సిఫెరాల్(విటమిన్ డి2), కోలీకేల్సీఫెరాల్ (విటమిన్ డి3) అని! వీటిలో డి2 విటమిన్ మొక్కల నుండి లభిస్తే, డి3 అనేది సూర్యరశ్మిలోని అతినీలలోహిత 3-బి2 కిరణాల వల్ల శరీరానికి వంటబడ్తుంది. చేపల వంటి కొన్ని ద్రవ్యాలలో కూడా డి3 విటమిన్ దొరుకుతుంది. ఏమైనా ప్రకృతి సహజంగా మొక్కలు, పాలపదార్థాలు, చేపలవంటి కొన్ని జంతు మాంసాల నుండి పొందగలిగే విటమిన్ తక్కువ అనీ, ఎండ నుండి పొందేది ఎక్కువనీ గ్రహించాలి.
ఎండకు కరువులేని మనదేశంలో ‘డి’ విటమిన్ లోపం ఎందుకు ఏర్పడుతోంది..?
శరీరానికి విటమిన్ ‘డి’ వంటబట్టక పోవడానికి లివర్ బలంగా లేకపోవటం కూడా ఒక కారణం. అందుకే లివర్ బలంగా లేకపోవటం కూడా ఒక కారణం. లివర్ బలంగా లేనప్పుడు విటమిన్ ‘డి’ లోపం ఏర్పడి షుగర్, కేన్సర్ గుండె జబ్బులు కూడా రావచ్చు, వచ్చినవి త్వరగా తగ్గకపోవచ్చుననే అంశంపై పరిశోధనలు సాగుతున్నాయి. ఇంతకన్నా సాంకేతికంగా వివరించటం కన్నా విటమిన్ ‘డి’ ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించేలా చేయటం ముఖ్యం.
విటమిన్ ‘డి’ మనకు పాల ద్వారానే ఎక్కువ లభిస్తోంది. కానీ పాలలో స్వచ్ఛత సందేహాస్పదవౌతోంది. ఎండ తగినంత తగలకుండా జీవించే విధానం ఎక్కువైంది. ఆల్కహాల్, స్మోకింగ్‌తో పాటు కల్తీ ఆహారాలు, రంగు విషాలను అతిగా వాడటం వలన లివర్ బలహీనమవుతోంది. ఇవన్నీ డి విటమిన్ లోపానికి కారణం అవుతున్నాయి. నల్లచర్మం ఉన్నవారికి ఎక్కువ ఎండ అవసరమవుతుంది. వ్యాధుల సంగతి అలా ఉంచితే, బుద్ధి వికాసం కూడా తగ్గిపోవటం ‘డి’ విటమిన్ లోపం కారణంగా జరుగుతోంది. ఇది సామాజిక బలహీనతకు దారితీసే అంశం. మనం అంతగా పట్టించుకోని విషయం కూడా! రోజుకు అరగంట వరకు ఎండ తగిలితేనే శరీరం ఆరోగ్యదాయకంగా నడుస్తుంది.
ఎండ తీవ్రతను బట్టి ఈ సమయాన్ని పెంచుకోవటం తగ్గించుకోవటం చేయాలి. చల్లబడ్డాక మాత్రమే బయటకు వెళ్లటం అనేది మంచి అలవాటు కాదని మనవి. ముఖ్యంగా పగటిపూట కూడా లైట్లు వేసుకోవలసిన ఇళ్లలో నివసించేవారికి ఈ సూత్రం మరీ వర్తిస్తుంది. సూర్యభగవానుణ్ణి ఆరోగ్యప్రదాతగా మొక్కే సంప్రదాయం వెనుక ఉన్న ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com