S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తరం.. తరం.. నిరంతరం

బాబ్బాబు.. దీని మీది అంకెలు కాస్తా చదివిపెడ్దురు.. ప్లీజ్’ అంటూ అటుగా వెళ్తున్న కుర్రవాణ్ణి ఆపి అర్ధించారు, ముక్కుమీదికి జారిపోతున్న బాపూ కళ్లద్దాల్ని సరిచేసుకుంటూ విశ్వనాథంగారు.
తటాలున ఆగిన ఆ కుర్రాడు తాతగారి వైపు గుర్రుగా చూస్తూ చటాలున చెప్పేసి దబేలున అక్కడి నుంచి వెళ్లిపోయాడు మరో అభ్యర్థనకు అవకాశమివ్వకుండా. ఆ పక్కనే వీళ్లిద్దర్నే విస్తుపోయి చూస్తూ వున్న పంకజం బాపూగారి కళ్లద్దాలు పని చేస్తున్నట్లుగా లేదు.. పవర్ మారిందేమో కాస్త చూపించుకోరాదు.. అంటూ వుండగానే, పంకజం విసిరిన ఉచిత సలహాపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా ముఖం పెట్టి, తనని తాతగారని సంబోధించినందుకు ఒక పది మార్కులు- ఉచిత సలహా తన ముఖంపై విసరినందుకు మరొక పది మార్కులు తగ్గించేసి - ఆమెని పరీక్షలో తప్పించేసిన లెక్కల మాస్టారిలా.. ఆమెని ఆపాదమస్తకము చూసుకుంటూ ముందుకు సాగిపోయారు - అసలే రిటైర్డ్ లెక్కల మాస్టారు - కర్కశంగా కోతకోసి పారేసి పంకజంని కఠినంగా ఫెయిల్ చేసేశారు తన అధిక ప్రసంగానికి.
పంకజంకి విశ్వనాథంగారి ఈ వింత పరిణామం అర్థంకాని కఠినమైన పజిల్ అయ్యింది. అప్పటికి, బుర్ర గోక్కుంటూ ఇంటి దారి పట్టింది పంకజం. ఇట్టాంటి అనుభవాలు మాస్టారికి, పంకజంకి కొత్తకాదు. వింత కాదు - తరానికి తరానికి అంతరాలు అంతే మరి.
ఒకనాటి అనుభవం కాలానుగుణంగా అన్యాపదేశంగా మారడంలోకి సహజం - అలా సరిపెట్టుకోకపోతే ఇలాంటి సున్నితమైన తర్కవితర్కాలు.. అక్కడక్కడ అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయ్ తిరస్కారాలు.
ఇద్దరు దారులు వేరై గమనానికి వెళ్లారు, కాని ఎక్కడో అక్కడ కలుసుకోవలసిందే మరి; లేకపోతే తరానికి తరానికి అంతరం పెరిగిపోయి అంతు తెలియని అగాధాలేర్పడతయ్ - పాత, కొత్త విభేదిస్తే సమాజం ముందుకి ఎలా వెడ్తుంది - పాత నీరు.. కొత్తనీరు.. కలిసి ప్రవహించవలసిందే.
పంకజంని అలా నిరసించవలసింది కాదు, ఆమె సూచన సహేతుకమే మరి. శాంతించిన మాస్టారిలో విచక్షణ విచారించింది. పంకజంపైని అలా విరుచుకుపడవలసింది కాదు. అలా ముఖాన్ని గుచ్చినట్లు చూస్తూ నిష్క్రమించవలసింది కాదు - ఉపశమించిన మాస్టారి ‘చెవులుండే మనసుకి’ మనసు మూలుగు వినిపించింది - తన దురుసుతనం తెర మీద చిత్రంలా కళ్లకి కట్టినట్లుగా కనిపించింది.
అలాగే పంకజం కూడా మనస్తాపానికి లోనయ్యింది. మాస్టారికి సూచనలిచ్చి ఉండవలసింది కాదు, ఆయన అనుభవంలో తన వయసు ఏపాటిది? ఏమైనా ఆయనని హర్ట్ చేయకుండా జాగ్రత్త పడవలసింది - ఆ సూచనని ఎంతో సౌమ్యంగా, సున్నితంగా చేసి వుండవలసింది అనుకుంటూ గమ్యాన్ని తాకారిద్దరూను.
ఆ తర్వాత.. కొంతకాలం తర్వాత మళ్లీ విశ్వనాథంగారు, పంకజం అసెంబ్లీ హాలు బస్టాప్‌లో దిగుతూ తారసపడ్డారు. ఒకరినొకరు కళ్లతోనే పలకరించుకున్నారు. పంకజం కళ్లు గుండ్రంగా తిప్పుతూ, ‘బాగున్నారా.. మీకేమైనా సాయపడగలనా రోడ్డు క్రాస్ చేయడంలో...’ అంటూ చెయ్యి అందించబోయింది పంకజం.
‘పాపా.. ఇలా రామ్మా.. నినె్నక్కడో చూసినట్లుంది..’ అంటుంటే పంకజం అది చాలా రోజుల క్రిందటి విషయం లేద్దురు.. అంత జ్ఞాపకానికి తెచ్చుకునేంత అవసరం లేదు. ఎటుకేసి వెళ్తున్నారు చెప్పండి.. నే చేయగల సాయం చేస్తాను.. పెదవి పైకి వస్తున్న నవ్వుని మునిపంటి బిగువున అదిమేస్తూ అంది పంకజం.
‘నో థాంక్స్. నాకెవ్వరి సహాయం ఇంకా అవసరం రాలేదు - తిన్నది అరుగుతున్నది.. అనుకున్నది జరుగుతున్నది.. అంటూ విసురు అభినయిస్తూ పైపైకి, లోలోపల మురిసిపోతూ.. యువతలో కన్పించిన చైతన్యానికి, విశ్వనాథంగారు రవీంద్రభారతి వైపుగా నడక సాగించారు. పంకజం కూడా అదే దారి సాగిపోయింది.
రవీంద్రభారతిలో ఆ రోజు సాయంత్రం గంధర్వ గాయకుడు, వర్సటైల్ గాయకుడు ఘంటసాల వర్థంతి సందర్భంగా గానకచేరీ జరుగుతోంది. విశ్వనాథంగారు పురుషుల వరుసలో కూర్చున్నారు.. స్ర్తిలకు కేటాయించిన వరుసల్లో పంకజం కూడా చోటు వెతుక్కూర్చుంది విశ్వనాథంగారి కనుచూపు మేరల్లో - ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకున్నారు. వాట్ ఎ కో ఇన్సిడెన్స్.. ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు.
గానకచేరీ ఆరంభానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన.. వేదిక నలంకరించిన పెద్దల చేతుల మీదుగా జరుగుతోంది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కళాసమితి కార్యదర్శి ఆహూతులందర్నీ పేరుపేరున సభకు పరిచయం చేసాక, ఆ తర్వాత గానకచేరీ మొదలయ్యింది.
ఇంతలో పంకజం పక్కన ఇంతకు మునుపు తాతగార్నించి తప్పించుకు పారిపోయిన కుర్రాడు వెళ్లి కూర్చున్నాడు. అలా సెటిలయిన ఆ కుర్రాడు పక్క వరుసలో తలఆడిస్తున్న విశ్వనాథంగార్ని చూడ్డంతోనే ఖంగుతిన్నాడు, మళ్లీ ఈయనగారు ఏం సమస్య తెస్తాడోనని. ఘంటసాల పాడిన ఆపాత మధురాల నుంచి.. ఆయన నిర్యాణం వరకు పాడిన పాటల నుంచి ఎంచుకుని, ఆ పాటల్ని పండించడానికి ఎంతో ప్రయత్నం కన్పిస్తోంది, చెవులకు విన్పిస్తోంది. ఆ మధుర గాయకుడు, ఆ గంధర్వ వారసుడు పద్మశ్రీ ఘంటసాల పాడిన ఆపాత మధురాలు.. యుగళాలు.. భక్తిగీతాలు.. ప్రబోధ గీతాలు ఇప్పటి తరానికి ఎంతో కొంత ఊపిరి పోస్తోంది అని చెప్పక తప్పదు. కొంత శ్రావ్యత, మాధుర్యం లోపించిందనిపించినా పాడగా.. పాడగా.. రస పాకాన పడకుంటుందా! అంతోయింతో ఘంటసాల మాస్టారి ఒరవడి, స్వర విన్యాసాలు, మెలకువలు, సంగతులు, గమకాలు బాగానే ఔపోసన పట్టారనిపిస్తోంది - ఆసక్తిగానే అందరు వింటున్నట్లు గమనించారు విశ్వనాథం మాస్టారు.
ఇలా పెద్దవాళ్లు, రస హృదయులు, కవి గాయకుల జంతువులు, వర్థంతులు ఈ తరానికి, ముందు తరాలకి పెద్ద బాలశిక్షలా ఉపయోగపడ్తవని చెప్పకనే చెప్తున్నారు గాయనీ గాయకులు - అలా సంగీతపు మెలకువలను ఓనమాల్లా దిద్దుతున్నారు. సుందరంగా అద్దుతున్నారు సంగీత వాయిద్య కళాకారులు. ‘ఏదైనా, ఎంతైనా సాధనమున సమకూరునన్నారు’ ఆర్యులు.
ఈ విధమైనటువంటి మేథోమదనం జరుగుతోంది విశ్వనాథం మాస్టారి హృదిలో.. మదిలో. రవీంద్రభారతి ప్రాంగణం ఆవరణలో సంగీత విభావరి కాస్తంత ఊరట కలిగిస్తోంది విశ్వనాథంగారి దినచర్యలో. సహధర్మచారిణి లేని లోటుతో వెళ్లదీస్తున్న శేష జీవితంలో, ఇటువంటి ఆనందాలు విశేషాన్ని కలిగిస్తుంటయ్, విశ్వనాథం మాస్టారికి.
తన ఆనందానుభూతిని షేర్ చేయటానికి ఎవరైనా వున్నారా.. అంటూ కలియ వెతికారు విశ్వనాథం మాస్టారు. విశ్వనాథం మాస్టారు కంటివేటుకి దొరకనంత వీలుగా దాక్కునున్నాడు పంకజంని చాటు చేసుకుని కుర్రాడు. అయినా పట్టువిడవకుండా విశ్వనాథంగారు అటుగా నడిచారు.
అంతే.. విశ్వనాథంగారు ఇటుగా రావడం గమనించిన కుర్రాడు జంపయి కారు పార్కింగ్ వైపు పరుగందుకున్నాడు - ఆ వెనుకనే పంకజం అతగాడ్ని అనుసరించింది. వారిద్దర్ని వెంబడిస్తూ వెళ్లిన విశ్వనాథంగారు కూడా కారు పార్కింగ్ చేరి కారెక్కేశారు వాళ్లతోకూడి.
ఏమిటి.. ఆ ముగ్గురు.. అని ఆశ్చర్యపడ్తున్నారా...
వెరీ సింపుల్.. ఆ ముగ్గురూ మూడు తరాలకి ప్రతీకలు.. విశ్వనాథంగారి కూతురు పంకజం. విశ్వనాథంగారి మనవడు ఆ కుర్రాడు ప్రవీణ్.
పెద్దంతరం.. మధ్యంతరం.. కుర్రతనం.

--ఆచార్య క్రిష్ణోదయ 7416888505