S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యాంత్రికతకు చోటివ్వొద్దు

భర్త చేసే వృత్తి వివరాల మీద ఆసక్తి కనబరుస్తూ, అతని మాటల్ని వినగలిగే ఓర్పును అలవర్చుకోవడమే మొదటి సూత్రం. ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయితే ఈ సూత్రం భార్యాభర్తలిద్దరికీ వర్తిస్తుంది.
* * *
రెండో సూత్రం ‘స్పేస్ ఇవ్వడం’. రోజంతా ఇంట్లో పనులతో సతమతమై ‘మిస్ అయిన ఫీలింగ్’ను భర్తతో పంచుకోవాలన్న భావన భార్యలో ఉండడం సర్వసాధారణం. కానీ ఆ ధోరణి భర్తలో విసుగును కలిగించవచ్చు. భర్త మూడ్‌కి అనుసారంగా అతనికి స్పేస్ ఇవ్వాలి. ఎందుకంటే భార్యభర్తలిద్దరూ విభిన్న లింగాలు. కనుక వారి భావోద్వేగాలు, వ్యక్తీకరణ ఏవీకూడా ఒకలా ఉండవు. ఈ విషయాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి.
స్పేస్ ఇవ్వడంలో ఉండే వైఫల్యమే భార్యభర్తల మధ్య తెలియని యాంత్రికతను పెంచుతుంది. ఆ యాంత్రికత తలెత్తకుండా చూసుకోవాలంటే తగినంత స్పేస్ భర్తకు ఇవ్వడం తప్పనిసరి.
* * *
మూడో సూత్రం ‘్భర్త భాషను అర్థం చేసుకోవడం’. ఇక్కడ భాషను అర్థం చేసుకోవడం అంటే అతని వ్యక్తీకరించే పద్ధతులను తెలుసుకోవడం. మితభాషి, మధ్యస్థంగా మాట్లాడటం, అతిగా మాట్లాడటం... ఈ మూడింట్లో భర్త ఏ రకమో అర్థం చేసుకోవాలి. ఓ సంభాషణలో భార్య పాత్ర ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని కూడా భార్య సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి.
అంటే వక్తగా ఉండాలా? లేక శ్రోతగా ఉండాలా? అన్న అంశంపై భార్యకు స్పష్టత ఉండాలి. ఆఫీసులో ఏవైనా ఒత్తిళ్ళు తలెత్తినప్పుడు అవి భర్త మూడ్‌ను పూర్తిగా మార్చేస్తాయి. ఆ సమయంలో భర్త భాషను సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత భార్యదే. ఆ సమయంలో చూపే కోపం, విసుగులాంటి నకారాత్మక భావోద్వేగాలు వ్యక్తిగతమైనవి కావని కేవలం పరిస్థితులకే పరిమితమైనవి అని అర్థం చేసుకోవాలి.
అలాగే ఆఫీసు విషయాలు పంచుకుంటున్నప్పుడు బోరింగ్ విషయాలుగా కొట్టిపారెయ్యకుండా ఆసక్తికనబరచాలి. ఎవరైనా ‘మీ భర్త ఏం చేస్తారు?’ అని అడిగినప్పుడు ముక్తసరిగా ఓ వాక్యంతో సరిపెట్టే సమాధానం కాకుండా, ఆ ఉద్యోగం గురించి ఓ ఐదు నిమిషాలు అయినా వివరించగలిగే నాలెడ్జ్ ఉండాలి.
తన వృత్తిపట్ల, అక్కడి బాధ్యతల పట్ల అవగాహన ఏర్పరచుకొని, అర్థం చేసుకునే భార్యను గౌరవించని భర్త లోకంలోనే ఉండడు!
* * *
నాలుగో సూత్రం ‘అభిరుచులు తెలుసుకోవడం’. ప్రతి ఒక్కరికి కొన్ని అభిరుచులు ఉంటాయి. కొందరికి సినిమాలు ఇష్టం, ఇంకొందరికి క్రికెట్ ఇష్టం, మరికొందరికి పుస్తకాలంటే ఇష్టం. భర్త అభిరుచి ఏదో మొదట తెలుసుకోవాలి.
ఆ అభిరుచిలో ప్రవేశం లేకపోయినా నిరాసక్తత ప్రదర్శించకుండా, తెలుసుకోవాలి అనే జిజ్ఞాసను ప్రదర్శించాలి. ఆ జిజ్ఞాసే మానసికంగా అన్ని విషయాల్లోనూ భార్యాభర్తల మధ్య సామీప్యాన్ని పెంచుతుంది.
ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక దశలో ‘లైక్ మైండెడ్ ఫ్రెండ్స్’ కావాలి అని కోరుకుంటారు. ఆ వ్యక్తి జీవిత భాగస్వామే అయితే ఆ భార్యాభర్తల బంధం ధృడపడడాన్ని ఆ దేవుడు కూడా అడ్డుకోలేడు.
* * *
అయిదో సూత్రం ‘్ఫర్యాదులు మానుకోవడం’. ముందు చెప్పినట్టు ‘్ఫస్ట్ ఇంప్రెషన్’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్త వాతావరణంలో అడుగుపెట్టాక కొన్ని అసౌకర్యాలు కచ్చితంగా ఉంటాయి. చిన్న విషయాలకు కూడా అతిగా సందిస్తూ ప్రతిరోజూ సాయంత్రానికి ఓ ఫిర్యాదుతో సిద్ధంగాఉండడం అన్నది భార్యలోని సంకుచిత్వ ధోరణిగా ఒక్కోసారి భర్తకు అనిపించవచ్చు.
ఆ క్షణానికి బుజ్జగించనట్టు అనిపించినా అప్పుడే వ్యక్తిత్వంపై అభిప్రాయాలకు బీజం పడుతుంది. ఏదైనా సమస్యగా అనిపించినా ఓ వారం, పది రోజులు అది సర్దుకునే పరిష్కారాలు ఉన్నాయేమో అని ఆలోచించాలి. లేకపోతే ‘నాన్నా...మేక’ కథలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
అలాఅని ఎంత కష్టం ఉన్నా పంటి బిగువున భరించమని అర్థంకాదు. సమస్య వచ్చినప్పుడు కొంత సమయం పరిష్కరించబడుతుందేమో అని చూసాక, తర్వాత స్వీయ పరిష్కారాన్ని కూడా ఆలోచించి అప్పుడు చెబితే భార్యమీద భర్తకు సదభిప్రాయం ఏర్పడేలా చేస్తుంది.
సక్సెస్‌ఫుల్ భార్యంటే షార్ట్‌స్పాన్‌లో జీవితాంతం ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్న ఫీలింగ్‌ను జీవించేలా చేసే సక్సెస్‌ఫుల్ స్ర్తి.

--శృంగవరపు రచన 99591 81330