S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దీప ద్వయం

-పెరుగు రామకృష్ణ

9849230443
ఒక ఉషోదయం
పురాతన గుడి దీపం ముందు ప్రవేశించా
ధ్వజస్తంభం సాన్నిహిత్యంగా
నేలమీంచి ఆకాశానికి విస్తరిస్తున్న వెలుగు చూసి
మనసు జోడించి ప్రార్థించాను
నా చుట్టూ దీప వలయం...
కాంతితోపాటూ... నన్నూ
ఓ దివ్య మార్గంలోకి నడిపింది...

ఒక సంధ్యా సమయం
మాటల కరచాలనాల కొలనులోకి ప్రవహించా
బ్రతుకుని, స్వార్థాన్ని కౌగిలించుకున్న మిత్రులలో
ఒక ప్రారంభం కోసం అనే్వషించా
నా నెత్తిన దీప సమూహపు వల
ఆకాశం నుంచి వెలుగుతోపాటు నన్నూ
నేల మాళిగల్లో బంధించింది...

ఒక దీపం నన్ను మనిషితనంతో నింపితే
మరో దీపం ఏకాంత సమూహంగా నిల్పింది..!!

*

రుబారుూలు
-జక్కని వేంకటరాజం
9440021734

నింగిలోన చందమామ నిప్పులు కురిపించునా?
వేసవిలో ప్రభాకరుడు వెనె్నల వర్షించునా?
తారలు దిగి వచ్చి నేల తళతళమని మెరయునా?
మానవ ధర్మము మరచిన ప్రకృతి వర్షించునా?

సుందరమ్ముగ ప్రతి దినమ్మును సూర్యుడే ఉదయించు చుండును
ప్రాణ దాతగ ప్రతి క్షణమ్మును లోకమును రక్షించుచుండును
జీవరాశుల ప్రాణశక్తికి దైవమై వెలుగొందుచుండును
సూర్యుడే ఉదయించకుంటే ప్రాణమెట్టుల నిలచియుండును?

స్నేహబంధము విలువ యెంతో కాలమే అది నిర్ణయించును
మొక్కగా మొలకెత్తి స్నేహము వృక్షమై ఫల సంపదొసగును
లెక్కకెందరు లేరు మిత్రులు? ఒక్కడైనను క్షేమమరయడు
హితము గోరెడు నొక్క మిత్రుండన్న జీవితమందు చాలును.

సజ్జనులతో స్నేహమది యొక తరువుగానే గోచరించును
షరతులే లేనట్టి స్నేహము వెనె్నలై ఇల ప్రసరించును
ప్రేమ పంచుట ప్రేమ పొందుటలోని మధురిమ ఎంత గొప్పది
విశ్వమును ప్రేమించు వారల హృదయమెంతో విస్తరించును

ఆశతోనే మనిషి బ్రతుకును
ఆశతోనే వేచి యుండును
బ్రతుకుపైనే ఆశ చచ్చిన
ఆత్మహత్యకు పూనుచుండును

సుడులలో చిత్తమ్ము చిక్కును
తనువు రోగములందు జిక్కును
తనువు, మనసును ఒకటి జేయగ
యోగమున చేరంగవలయును

కోటి పడగలు

- ఒబ్బిని,
9849558842

చీమల బారులు కాకుండా
కార్ల బారులు సింగారించుకుంటున్నాయి
తంగేడుపూలు గాకుండా
ట్రాఫిక్ దీపాలు పూస్తున్నాయి!
కళ్ళల్లో చెమ్మ ఇగిరిపోతుంది!
‘తన తనం’ తరిగిపోతుంది
కోటి పడగలై కార్పొరేట్లు కాటేస్తున్నారు
ఆకాశంలో వీసా స్టాంపులా
ఉదయిస్తున్నాడు చంద్రుడు
తూనీగ రెక్కలు బంధించి
దానితో మట్టిబెడ్డలు మోయిస్తున్నట్లు
ఇక్కడి పౌరుడి పెడరెక్కలు విరిచి
నేల తాకిస్తున్నారు
శాంతి ధర్మాన్ని సమిధలుగా వేస్తూ
ఆరని యుద్ధ హామీలతో
యుద్ధ సంగీతాలు వినిపిస్తుంటారు
తుమ్ము తుమ్ముకీ
ఆకాశంలో వీసా స్టాంపులా
ఉదయిస్తున్నాడు చంద్రుడు
కళ్లల్లో చెమ్మతనం ఆవిరైపోతుంది!
రైలు రోడ్డు ఒడ్డున రాలే గంధకంలా
బస్సు రోడ్డు పక్కన రాలి ఎగిరే
దూదిపింజల్లా
ఆకాశపు జల్లెడ లోంచి జారే
వానచినుకుల్లా
పొలాల్లో పాతిన
చెరకుగడల్లాంటి కాలూ, చేతుల్లా
త్యాగాల రావులు! పెట్టుబడుల పెట్టెలు!
కోటి పడగలతో కాటేస్తున్నారు కార్పొరేట్లు
పెట్టుబడుల కోట్లు ధరించి
వికలాత్మ అయిన
ఈ సముద్రం
దేశం నలుమూలలా తుపాన్ని విస్తరించితే
నురగలు కక్కుతూ
పేరు చెరిగిపోతున్న
భారతావని కోలుకుంటుందేమో!