S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాలంతో... కాలాతీతంగా... -- వినదగు..

ఇహం + పరం = నేను
జీవాత్మ + పరమాత్మ = మానవాత్మ
కాలంతో వ్యక్తి చైతన్యం
కాలాతీతంగా విశ్వచైతన్యం
ఇహ చైతన్యం జీవాత్మది... అంటే భౌతిక చైతన్యమంతా దేహంలోని వ్యక్తి ఆత్మదే.
పర చైతన్యం విశ్వాత్మది... అంటే ప్రకృతి చైతన్యమంతా ప్రకృతిగా రూపుదాల్చిన పరమాత్మది.
అందుకే జీవాత్మది వ్యక్తి ధర్మం లేదా భౌతిక చైతన్యం అవుతుంటే పరమాత్మది విశ్వ లేదా ప్రకృతి ధర్మం అవుతోంది.
ఇలా ఐహిక, ఆయుష్మిక అంశల సమ్మేళనం మన మానవ అవతరణం. అంటే పుట్టుకతో ఐహిక అంశనే వ్యక్తి ఆత్మగాను, పరమ అంశనే పరమాత్మగాను మన దేహాన్ని చేరుకుంటాయి. ఇలా మన భౌతిక వైయక్తిక ఆత్మ పరమాత్మలు ఒకే జీవితాన్ని పరిరక్షిస్తూ ఒక్కటే అనిపించేలా రెండు ఆత్మలవుతున్నాయి. ఒక విధంగా రెండూ ఒకేలా దేహంలో కొలువై ఉండటంతో రెంటినీ సమానంగానే చూడటం జరుగుతోంది. అందుకే పరమాత్మ మనలోనిదే అనటం. పరమాత్మ, జీవాత్మలది సమస్థాయిగానే పరిగణించటం.
అయితే పరమాత్మ వ్యక్తి ఆత్మకంటే ఊహించలేనంత శక్తివంతమే. గీతోపదేశంలో కృష్ణుడు ఈ అసమానత్వాన్ని గురించి అర్జునుడికి స్పష్టంగా చెప్తాడు. తానే దిగి వచ్చిన పరమ పురుష తత్వాన్ని అని పదేపదే అంటుంటాడు. వ్యక్తి ఆత్మకు చెందిన జ్ఞాన ప్రకాశనమంతా తనదే అంటాడు. ఇలా పరమాత్మ అందించే జ్ఞానమంతా అంతరంగ ప్రజ్ఞగా పరిగణించటం జరుగుతోంది. బహుముఖీనంగా వ్యక్తి ఆత్మకు సహకరించటం జరుగుతోంది.
నిజానికి ఒకే గూటిలో వసించే రెండు పక్షుల్లాంటివి ఇహ, పరమాత్మలు. ఇక్కడ ఐహిక ఆత్మ అంటే జీవాత్మ అనే. జీవ, పరమాత్మలు రెండూ ఒకేచోట వర్తిస్తుండటం వల్ల ఒకదాన్ని గురించి మరొకదానికి చాలా స్పష్టంగా తెలుసు. ఐహిక ఆత్మ జీవితాన్ని అనుభవిస్తుంటే ఆ అనుభవ పోకడలను పరమాత్మ గమనిస్తుంటుంది. తమాషా ఏమిటంటే జీవాత్మ తన అసలు అస్తిత్వాన్ని మరచి భౌతిక అనుభవాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అదే వాస్తవం అనుకుంటుంది. ఇటువంటి జీవాత్మతో పరమాత్మ కలిసి జీవనం సాగిస్తున్నప్పటికీ ప్రాపంచికతలో కూరుకుపోదు. అదే శాశ్వతం అని అసలే అనుకోదు.
పరమాత్మది అలౌకిక చైతన్యం... జీవాత్మది లౌకిక చైతన్యం. రెండూ అభిన్న ఆత్మలుగా అనిపిస్తున్నప్పటికీ మానవ రూపంలో రెండింటి వర్తనంలో భిన్నత్వం ఉంది. ప్రధానంగా పరమాత్మది శాశ్వత ప్రజ్ఞ.. జీవాత్మది అశాశ్వత ఆవాసం. అంటే కాలానికి అందని అతీత ప్రజ్ఞ విశ్వాత్మది... కాలబంధానికి లోబడినది జీవాత్మ వర్తనం. అందుకే కాలనిబంధనను ఛేదించే ప్రయత్నంలో విశ్వాత్మ చైతన్యానికి చేరువ అవుతుంది జీవాత్మ. పరమాత్మ సైతం దివ్యత్వంతో దేహాన్ని చేరుకుని అదే దేహంలో కాలం గీసిన గీతపై తన చైతన్యాన్ని ఆవిష్కరిస్తూ జీవాత్మకు అన్ని విధాల సహకరిస్తూ విశ్వ ప్రజ్ఞను వ్యక్తి ప్రజ్ఞకు మిళితం చేస్తుంటుంది. ఇలా జీవాత్మ విషయంలో పరమాత్మ క్రియేటర్, కంట్రోలర్ అవుతుంటే జీవాత్మ క్రియేటెడ్, కంట్రోల్డ్ అవుతోంది. అంటే స్వతంత్రత పరమాత్మది అవుతుంటే ఆధారితం జీవాత్మ.
ఎలా చూసినా విశ్వాత్మలోని తొణకిన అంశనే జీవాత్మ. కాబట్టే జీవాత్మ వర్తనం పరమాత్మ వర్తనానికి మూలంగానే సాగుతుంటుంది. మంచినీటి బావిలోని ఊట తాగే నీరే అయినట్లుగా విశ్వాత్మ నుండి విడివడ్డ పరమాత్మ అంశ జీవాత్మగా పారలౌకిక చైతన్యంతోనే వర్తిస్తుంటుంది. అయినా అంశ అంశనే... మూలం మూలమే!
ఇంతకీ జీవాత్మ అలౌకిక అంశతో చేస్తున్నది ఏమిటి? అంటే ఆ పరమాంశకు ప్రతిబింబంగా పరిణమించడమే! అయితే ప్రాపంచిక మనుగడతో ఎదగ ప్రయత్నించటంతో ఘర్షణ తప్పటంలేదు. అందుకే మనం భగవదంశకు ప్రతీకలా కాగలుగుతున్నామే తప్ప సాక్షాత్తూ ఆ పరమాత్మనే కాలేక పోతున్నాం. అందుకే మన ప్రవృత్తి కంట్రోల్డ్ నేచర్ అవుతోంది. దశావతరాలు పరమాత్మవే తప్ప పరమాత్మనే కాదు అన్నట్టుగా మానవావతారమూ పరమాత్మ అంశనే తప్ప పరమాత్మ కాదు. అంటే మన మానవత్వం అద్వితీయంలా అనిపించే ద్వితీయమే. అయినప్పటికీ విశ్వచైతన్యంలో జీవాత్మది ద్వితీయ స్థానమే.
అసలు సృష్టి అంటే విశ్వప్రజ్ఞ... పరమాత్మ ప్రజ్ఞ. ఆ అలౌకిక ప్రజ్ఞ నుండి పుట్టుకొచ్చిందే మన అద్వితీయ మానవ ప్రకృతి సైతం. కాబట్టి మానవాత్మ పరమాత్మ విషయకంగా ఆధారితమే తప్ప ఆధారం కాలేకపోతోంది. అందుకే జీవాత్మ భగవదంశనే తప్ప పరమాత్మ కాదు. దీనే్న ఆధ్యాత్మిక ప్రపంచం ‘ద్యిజూ ఘత్ఘీకఒ ళ్ఘౄజశఒ ద్యిజూ ఘశజూ ఆ్దళ జజ్పజశ ళశఆజఆక ఘత్ఘీకఒ ళ్ఘౄజశఒ ఘశ జశఛిజశజఆళఒజ్ఘౄ ఒ్ఘౄ ఔ్ఘఆ యచి ద్యిజూ’ అని అంటుంది.
అంతెందుకు, ఒక చెంబుతోనో లేదా ఒక బిందెతోనో నదీ ప్రవాహం నుండి నీటిని చేదినపుడు అది నీటి ప్రవాహ అంశనే అవుతుంది తప్ప మొత్తం ఆ నదినే కాలేదు. అలాగే పరమాత్మ పాయనే జీవాత్మ తప్ప జీవాత్మ పరమాత్మ కాదు. అంశ ఎప్పటికైనా మూలాన్ని చేరుకోవలసిందే తప్ప మూలం కాలేదు.
ఆత్మ విషయకంగా ఈ ఇహ-పర ‘దర్శనం’ అవసరం. అప్పుడు తప్ప కృష్ణుడి ఆత్మగీత మన జీవనగీత కాలేదు... మన పరంగా గిక గీత కాలేద. మనమూ, మన భౌతికతా, మన పరాప్రకృతి - అంతా అద్వితీయతే... అంతా దివ్యత్వమే. ఈ ఎరుకతో తప్ప జీవితం సచ్చిదానంద నిలయం కాలేదు. ఈ సచ్చిదానంద స్థితి మనలోనిదే తప్ప ఎక్కడి నుండో ఊడిపడేది కాదు. మన ఆనందానికి మనమే మూలం తప్ప మరొకటి ఆధారం కాదు. అయినా ప్రాపంచికంగా మనపై అనేక ప్రభావాలు తప్పటం లేదు. ఈ ప్రభావాల నుండి తప్పుకుని జీవించటం నేర్పేది భగవద్గీత.
దీనికి కావలసిన దార్శనికతే ‘నేనెవరు?’
ఇది ప్రశ్న కాదు... సమాధానం కాదు... నిజానికి జీవన విధానం.

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946