S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేను పునర్నిర్మితం కావాలి...

నేను...
దృశ్య, అదృశ్య మేలు కలయికను.
భౌతికమంతా విజిబుల్.. అధిభౌతికమంతా ఇన్విజిబుల్.
దృశ్య సౌందర్యానికి పదార్థ వనరులే మూలం.. అదృశ్య అందాలకు పదార్థేతర అంశలే భూమిక.
సౌందర్యంలా భాసించే చర్మం వెనుక ఒక మాంసపు ముద్ద.. దేహ దారుఢ్యం వెనుక ఒక ఎముకల గూడు. మేథా సంపన్నత వెనుక ఒక మెదడు - ఇలా ఎంతో వ్యవస్థ ఈ మానవ అవతరణలో రూపుదిద్దుకుంది. లక్షల సంవత్సరాల పరిణామ సంస్కారం ఈ ‘నేను’ సంసార సంస్కారం వెనుక దాగి ఉంది. ఇదంతా విజిబుల్‌గా పరిశోధనలకు అందుతూనే ఉంది.
అయినా, పరిశోధనకు అందని అంతశ్శోధన ఆవిష్కరించే సంస్కారం వెనుక ఎన్నో మానవ అవతరణ రహస్యాలు దాగి ఉన్నాయి.. అవి అంతర్నేత్రానికి మాత్రమే అందేవి. అవి గిక ప్రయాణంలో ప్రజ్ఞానంగా ఆవిష్కృతమయ్యేవే తప్ప ఆధారాలుగా అందించగలిగేవి కావు. అవి అక్షర సంస్కారానికి వంద శాతమూ అందుబాటులో ఉండవు. కొన్ని మానవ అవతరణ రహస్యాలు అనుభవాలుగా, అనుభూతులుగా గిక సంస్కారంలో విగిలిపోతాయే తప్ప అక్షర అనుబంధంలో చేరవు.
విజ్ఞానశాస్త్ర అక్షర పొత్తాలలో ‘దృశ్య నేను’ అగుపించినట్లుగా ‘అదృశ్య నేను’ శాస్తవ్రేత్తల మేధకు అందదు. అదృశ్య నేను ఆలోచనకు, పరిశోధనకు ఆవల అనుభవంగా, అంతశ్శోధనగా ప్రజ్ఞాన భాసురమవుతుంటుంది.
‘నేను’ దృశ్యంగా హ్యూమన్.. అదృశ్యంగా ‘డివైన్’. కాబట్టి, సైన్స్ సైలెన్స్ అయిన ప్లేన్స్‌లోనే హ్యూమన్ డివైన్‌గా అనుభూతిలోకి వస్తుంది. ఈ డివైన్ హ్యూమన్ పరిణామ రహస్యాలన్నీ ‘ఆకాశిక్ రికార్డ్’గా పదిలమై ఉంటాయి. ఈ రికార్డ్ దృశ్యమానం కావాలంటే భౌతిక నేనుకు యోగసాధనతో దివ్యదృష్టి ఏర్పడాలి.
ఈ దిశగా ప్రయాణం సాగించిన దివ్యజ్ఞాన సమాజ స్థాపకులలో ఒకడైన లెడ్ బీటర్ ‘ "A record which can be seen and consulted by anyone who possesses the degree of clairvoyance requisite to appreciate the vibrations of the finely subdivided matter upon which it is impressed' ’ అని.
* * *
నేను...
భౌతికంగా ‘మేన్ ఆఫ్ ది వరల్డ్’ - ప్రాపంచిక జీవి అని.
ప్రాపంచిక పౌరుషంలోనే మానవ తత్త్వం ప్రకాశిస్తుంటుంది. ఈ పాంచభౌతిక తత్వంతో ఖగోళతత్వం సంయోగిస్తే తప్ప మానవాంశ దివ్యాంశగా పరిణమించదు. అంటే, నేను అనే వైయక్తిక చైతన్యానికి ఖగోళ చైతన్యం జత కలవాలి.. ఈ చైతన్య సంయోగమే యోగం. ‘ భగవంతుడు - భక్తుడు’ అన్న సంప్రదాయం నుండి ‘మాస్టర్ మీడియమ్’ అన్న సంస్కృతిలోకి పరిణమిస్తే తప్ప Man of the Universe అనే Masterism నెలకొనదు. భౌతిక కొమ్మ గిక రెవ్మలను తొడగాలి. దీనే్న మనం ది యాక్ట్ ఆఫ్ బికమింగ్, రిజనరేషన్ అని చెప్పుకోవచ్చు.
‘రిజనరేషన్’ అంటే రెన్నొవేషన్ కాదు. రికన్‌స్ట్రక్షన్ - పునర్నిర్మాణం అనే. ఈ జన్మలోనే ఉన్న వ్యవస్థ కంటే మేలైన, సమర్థవంతమైన దేహ వ్యవస్థ, మానసిక వ్యవస్థ, అధ్యాత్మక వ్యవస్థ సంప్రాప్తం కావాలి. ఇలా పునర్నిర్మాణం అంటే ఎవరో చేసే ప్రక్రియ కాదు - మనకు మనంగా చేసుకోవలసింది.. నాకు నేనుగా తయారుకావలసింది. నేను ‘పునర్నిర్మిత నేను’గా రూపుదిద్దుకోవటం ముఖ్యం. ‘్ఫజికల్ ఇమ్మోర్టాలిటీ’కి ఈ పునర్నిర్మిత నేను పునాది.
నిజానికి, పునర్నిర్మాణానికి ఈ భూగోళ వనరులు సరిపోవు. ఈ భౌగోళిక బలం, ఇహ జీవనం సాగించటానికే సరిపోతుంది.. మరి ‘పర’ జీవనం సాగాలంటే! ...ఖగోళ బలం చేకూరాలి. ఖగోళ వనరులు అంటే గ్రహ, నక్షత్రాదుల ప్రభావాలు సక్రమగతిన పాంచభౌతిక వనరులను చైతన్యపరచ గలగాలి. అప్పుడు తప్ప పాంచభౌతిక దేహంలోని సెల్స్, టిష్యూస్, ఉలాన్స్ ఎపిథీరియల్ సెల్స్‌గా, ఎథీలియల్ టిష్యూస్‌గా, ఎపిథీలియల్ ఉలాన్స్‌గా ఈథరిక్ బాడీకి అనుబంధంగా పరిణమించి ఫిజికల్ ఇమ్మోర్టాలిటీకి భూమిక వహించవు.
* * *
నేనుకు సంప్రాప్తమయ్యే పునర్నిర్మాణ ప్రక్రియలో ఎపిథీలియల్ వ్యవస్థ ప్రధాన పాత్రే పోషిస్తుంది. అసలు, దేహంలోని సెల్స్ ఎపిథీలియల్ సెల్స్‌గా పరిణమించాల్సిన అవసరం ఏమిటి? అన్నది ఒక ప్రశ్న. సాధారణంగా కణాలు దేహపరమైన వ్యవస్థలో దేహం లోపలనే కణ అల్లిక అంటే టిష్యూస్‌గా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటాయి. నిజానికి, భౌతిక శరీరానికి రక్షాకవచం వంటి ఈథరిక్ బాడీ ఒకటుంది. ఈ ఈథరిక్ బాడీకి కావలసిన ఫోర్స్ ఎపిథీలియల్ వ్యవస్థ వల్లనే సాధ్యవౌతుంది. ఈ వ్యవస్థలో దేహపర కణాలు సమర్థ ఎపిథీలియల్ సెల్స్‌గా పరిణమించటం లేదా పునర్నిర్మితం కావటం అత్యవసరం. ఈ పునర్నిర్మాణం వల్లనే యోగి శరీరం ఫిజికల్ ఇమ్మోర్టాలిటీకి అనువుగా తయారవుతుంది.
ఎపిథీలియల్ సెల్ బహురూపాలుగా విస్తరిస్తుంటే మామూలు దేహ కణం రెండు మూడు సైజ్‌ల వరకే పరిమితం అవుతుంది. అయితే ఎపిథీలియల్ సెల్ మాత్రం మూడు నుండి ఏడు రకాల రూపాలలో పరిణమించగలుగుతుంది. ఇలా ఎపిథీలియల్ సెల్స్ అంటే టిష్యూస్ దేహం లోపలనే కాక దేహం బయటా తమ ప్రభావం చూపిస్తుంటాయి.
అందుకే, దేహపరంగా యోగసాధన సాగుతున్నప్పటికీ ఆ ఇహ యోగ సాధనా ఫలితం కేవలం ఈ దేహానికే పరిమితం కాక దేహాతీతమైన అధిభౌతిక దేహం అంటే ఈథర్ బాడీపై ప్రభావం చూపిస్తుంటుంది. హ్యూమన్ డివైన్ కావటానికి, మోర్టల్ ఇమ్మోర్టల్ కావటానికి ఈ ఎపిథీలియల్ సెల్ పరిణామం అత్యంత అవసరం. అప్పుడు కానీ ఇహ నేను ‘పర నేను’గా ప్రభవించదు. ఇలా వ్యక్తి చైతన్యంతో ఖగోళ చైతన్యం సంయోగించటమే యోగసాధనా పరంగా జరిగే ‘ఇమ్మోర్టల్ - ఎపిథీలియల్ సెల్’ పరిణామం.
* * *
‘నేను’ దేహ వ్యవస్థలో కణ సముదాయ వ్యవస్థనే. అయితే దేహపర టిష్యూలలో ఈ కణాలు ఇబ్బడిముబ్బడిగా, క్రిక్కిరిసినట్టు ఉండవు. కణానికి కణానికి మధ్య కొంత దూరం అంటే గాప్ అండ్ స్పేస్ ఉంటుంది. అయినా కణాలు ఎపిథీలియల్ సెల్స్‌గా నిలదొక్కుకోవటం వల్ల ఎపిథీలియల్ టిష్యూలలో అల్లికగా ఉండే ఎపిథీలియల్ సెల్స్ మధ్య దూరం దగ్గరవుతుంది. అంటే గ్యాప్ అండ్ స్పేస్ తగ్గుతుంది. పైగా ఎపిథీలియల్ సెల్స్ సంఖ్యా గణనీయంగా పెరుగుతుంది. ఇలా ఎపిథీలియల్ సెల్స్ సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో శరీర ఆరోగ్యానికి దోహదపడే ఎపిథీలియల్ టిష్యూలు, ఎపిథీలియల్ ఉలాన్స్ బలపడతాయి.
మొత్తానికి మన దేహంలోని రక్తప్రసరణ వ్యవస్థలో కానీండి, చర్మ వ్యవస్థలో కానీండి, శ్వాసకోశ వ్యవస్థలో కానీండి, గుండె వ్యవస్థలో కానీండి, మెదడు వ్యవస్థలో కానీండి, ఎపిథీలియల్ కణ వ్యవస్థ అనేది బలపడితే అంటే ‘్ఫర్స్’్ఫల్ అయితే తప్ప ఆరోగ్య వ్యవస్థకు మూలమైన జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగదు. బాక్టీరియా, వైరస్‌లు బాధించవు.
పైగా, హార్మోన్‌లు ఎంజైమ్‌ల ఉత్పత్తికి ఎపిథీలియల్ టిష్యూల పనితీరు ఎంతో అవసరం. కిడ్నీలు సక్రమంగా పని చేస్తూ వ్యర్థాలు ఎప్పటికప్పుడు వైదొలగుతుండాలంటే ఎపిథీలియల్ వ్యవస్థ సక్రమగతిన ఉండాలి. చెవులు, నాసిక, నాలుక మొదలైన సున్నిత వ్యవస్థల పనితీరుకు ఎపిథీలియల్ టిష్యూలు ఎంతగానో దోహదపడుతుంటాయి. స్ర్తిలు కన్‌సీవ్ కావటానికి- గర్భధారణకు - సైతం ఈ ఎపిథీలియల్ వ్యవస్థ ఎంతో ముఖ్యం.
ఇంతకీ, మానవ పరిణామంలో మానవ అవతరణ ‘మరణం’తో ముగియటానికి కానీ, అనారోగ్యంతో దేహం క్షీణదశను చేరుకోవటానికి కానీ ‘ఎపిథీలియల్ డిఫెక్ట్స్’ ‘ఎపిథీలియల్ ఇన్‌గ్రోత్’ అనేవి మూలమవుతున్నాయి. అంటే, ఎపిథీలియల్ కణ సంఖ్య ఎంత గణనీయంగా ఉంటే ఆరోగ్యం అంత బలంగా ఉంటుంది.
ఈ మానవ జీవన వ్యవస్థలో ఎదురయ్యే ప్రతీ అనారోగ్య సమస్యకు కారణం ఎపిథీలియల్ డిఫెక్ట్. కాబట్టి మెడిసినల్‌గా కానీ, మెడిటేషన్ పరంగా కానీ ఎపిథీలియల్ ఫోర్స్ చక్కగా, బలంగా నెలకొంటే తప్ప దేహపరంగా కానీ, దేహాతీతంగా కానీ ‘నేను’ మోర్టల్ స్థితి నుండి ఇమ్మోర్టల్ స్థితికి పరిణమించలేదు.
గికంగా చెప్పుకునే ‘్ఫజికల్ ఇవ్మోర్టాలిటీ’కి నాంది ఈ ఎపిథీలియల్ వ్యవస్థనే!

-విశ్వర్షి 9393933946