S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చెల్లని బిల్లుతో కాపు రిజర్వేషన్లు రావు

గుంటూరు, సెప్టెంబర్ 21: శాసనసభ ఆమోదించిన కాపు రిజర్వేషన్ బిల్లు చట్టప్రకారం చెల్లదని, కర్ణాటక బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ద్వారకానాథ్ ఇటీవల రాజమండ్రిలో తెలిపారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక అరండల్‌పేటలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వానికి మంజునాథ కమిషన్ పేరిట రెండు నివేదికలు వేర్వేరుగా అందాయని, వాటిలో ఒక నివేదికపై చైర్మన్ సంతకం లేదని, మరోనివేదికపై కమిటీ సభ్యుల సంతకాలు లేవని, ఈ పరిస్థితుల్లో అవి ఎలా చెల్లుబాటు అవుతాయని ప్రశ్నించారు. ఈ వాస్తవం తెలిసినందునే కాపునేత ముద్రగడ పద్మనాభం బిల్లును వెనక్కు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. చైర్మన్ మంజునాథ కమిషన్ నివేదికలో కాపులకు సాంఘిక వెనుకబాటు తనం లేదని స్పష్టంచేసినట్లు సమాచారం ఉందన్నారు. ముగ్గురు కమిషన్ సభ్యులు విడివిడిగా అందజేసిన నివేదికలో కూడా కాపులకు సాంఘిక వెనుకబాటు తనం ఉన్నట్లు స్పష్టత ఇవ్వలేకపోయినట్లు తెలిసిందన్నారు. అందుకే ఆ రెండు నివేదికలను రాష్ట్రప్రభుత్వం నేటికీ బహిర్గతం చేయలేదన్నారు. హైకోర్టు బహిర్గతం చేయాలని ఆదేశించినా ప్రభుత్వం మిన్నకుండిపోయిందని, అసలు ప్రభుత్వం నివేదికలను ఎందుకు బహిర్గతం చేయడం లేదో అర్థంకావడం లేదని, తక్షణమే అధికారికంగా ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కన్న మాస్టారు, రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి పరశా రంగనాథ్, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, కృష్ణబలిజ సంఘం నాయకులు అన్నం వీరరాఘవయ్య, మధుసూధనరావు, ఏసుబాబు, అంగిరేకుల గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.