S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంచి (సండేగీత)

ఓసినిమా నటుడు టీవీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ గమ్మతె్తైన మాట చెప్పాడు.
‘నేను చనిపోయిన తరువాత నా గురించి ఎవరూ ఏమి అనుకుంటే నాకేమిటీ? అవి నాకు విన్పించవు కదా?’
చాలా మంది చరిత్రలో తమ పేరు నిలిచిపోవాలని ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అవి అన్నీ వృథానా?
ఆ సినీ నటుడు అన్న మాటలో కొంత వాస్తవం వుంది. కొంత అవాస్తవం ఉంది. అది అర్థసత్యం అనవచ్చు.
చాలామంది గొప్పతనాన్ని ఆ వ్యక్తి చనిపోయిన తరువాత గుర్తిస్తారు. అదే విధంగా చనిపోయిన తరువాత అవార్డులు ఇస్తారు. ఇలాంటి సందర్భాలలో బాధ కలుగుతుంది. ఇప్పటికైనా గుర్తించారని ఆనందం కూడా కలుగుతుంది.
చనిపోయిన తరువాత మనం గురించిన విషయాలతో సంబంధం లేదన్న విషయం సరైంది కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయాడు. కానీ అతని వారసులు వుంటారు. వాళ్లు ఆ చనిపోయిన వ్యక్తి గురించి గర్వంగా ఫీల్ కావాలి. అందుకని చనిపోయిన తరువాత కూడా మన గురించి నలుగురూ ఏమని అనుకుంటారో అది కూడా ముఖ్యమైందే.
మనం శాశ్వతం కాదు.
ఆ మాటకొస్తే ఏదీ శాశ్వతం కాదు.
మనం ప్రయాణం చేస్తూ వుంటాం.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి
ఒక ఊరి నుంచి మరో ఊరికి
ఒక ఇంటి నుంచి మరో ఇంటికి
ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి
మనం ఏ పని చేసినా మనస్సు పెట్టి చేయాలి. మన శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించి పని చేయాలి.
మనం బతికి వున్నప్పుడే కాదు చనిపోయిన తరువాత కూడా మన గురించి మంచిగా చెప్పుకోవాలి.
మనం శాశ్వతం కాదు.
కానీ
మనం వున్న ప్రాంతంలో
మనం చేస్తున్న పనిలో, ఉద్యోగంలో
ఎంతో కొంత పాజిటివ్ మార్పుని తీసుకుని రావాలి.
అదే విధంగా - వ్యక్తులు బతికి వున్నప్పుడు, మన దగ్గర పని చేస్తున్నప్పుడే వాళ్ల మంచిని గుర్తించాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001