S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓ చిన్న మాట

జీతం ఉద్యోగి ఖాతాలో పడెయ్యడం వచ్చేక మొదటి తారీఖున జీతం తీసుకునే మజా మాయమవడం ‘ఓ చిన్న మాట’గా చెప్పడం బావుంది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఖ్యాతి కొట్టేసిన కాంగ్రెస్ ప్రతిపక్షం అనేదే లేకుండా దశాబ్దాల పాటు దేశాన్ని ఏలింది. ఆ స్థాయిలో కాకపోయినా అలాంటి ఖ్యాతి కొట్టేసి తెరాస రాష్ట్రాన్ని ఏలుతున్నది. కొంతకాలం విపక్షాలకు స్థానం లేకపోవడం సహజమే. తారలు తమ విషయాలు గోప్యంగా ఉంచుకోవడం వల్లనే గాసిప్స్ పెరుగుతున్నాయన్న ప్రియాంక అభిప్రాయం సరైనదే. అవీ ఇవీ అంటూ చెప్పిన అంశాలు ఆకట్టుకున్నాయి.
-బి.స్నేహమాధురి (పెద్దాపురం)
సండే గీత
ప్రతీ వారం మొదటి పేజీలో సండే గీత, ఓ చిన్నమాట మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాయి. ‘మీకు తెలుసా’ శీర్షిక ప్రపంచంలో వున్న వింతలు - విశేషాలను మాకు అందిస్తోంది. నమ్మలేని నిజాలు నమ్మశక్యంగాని సంఘటనలను మా కళ్ల ముందు ఉంచుతోంది. ఇక స్ఫూర్తి ద్వారా ఆధ్యాత్మిక సత్యాలు, విలన్స్ ద్వారా ప్రపంచ ప్రసిద్ధి పొందిన క్రైం కథలను మల్లాదిగారు మా మీద ఎంతో ప్రేమతో అందిస్తున్నారు. ‘వినదగు’ మాకు భగవద్గీతపై విభిన్నంగా భాష్యం అందిస్తోంది. కార్టూన్లు టపాసుల్లా పేలుతున్నాయి. అందరికీ నచ్చే నవరసాల సమ్మేళనంగా ఆదివారం అనుబంధం రూపుదిద్దుకుంటోంది.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
క్రైం కథలు
క్రైం కథలే అయినప్పటికీ వైవిధ్య నేపథ్యాలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం ‘స్టాక్ మార్కెట్’ నేపథ్యం బాగుంది. తంబురా గురించి చెప్పినవి బాగున్నాయి. తంబుర అనగానే వాగ్గేయకారుల్ని అటుంచితే జ్ఞాపకం వచ్చేది నారద మహర్షి! ఉలకని పలకని పత్రికల గురించి గోపాలంగారు ప్రస్తావించారు. వెబ్‌లో తన గురించి వస్తున్న గాసిప్స్ గురించి పూనమ్ పాండే బాధపడటం సహజమే కాని అందుకు కారణం అడ్డూ అదుపూ లేకుండా ఆమె చేసే సంచలన వ్యాఖ్యలే.
-ఆర్.మరువకాశి (కడప)
అవీ-ఇవీ
వేలెడంత ఉండే పిగ్మీ మంకీ, 15 అడుగులు దూకడం, ఉల్ఫ్‌బర్డ్ రావెన్ తెలివి, భయమన్నదే ఎరుగని ఓల్వరిన్‌ల గురిచి వింత విషయాలు తెలిశాయి. మన మీద మనం విశ్వాసం ఉంచుకోవాలి. మంచివైపు పయనిస్తే మనం బలపడతాం అని చెప్పే ‘సండే గీత’ బావుంది. బ్యాంకాక్ షాపులో బొమ్మ అదృష్టం తెస్తుందని జనం విరగబడి కొంటున్నారట. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఇలాంటి పిచ్చోళ్లు ఉన్నారన్నమాట.
-జె.్ధర్మతేజ (గొడారిగుంట)
సృజనకు సత్కారం
భారతీయ సినీ రంగానికి వనె్నలద్దిన ఫాల్కే పేరిట ఇచ్చే అవార్డు చిత్రసీమకు మణిమకుటం లాంటిది. ఆ కిరీటం కోసం వేచి చూచేవారెందరో ఉన్నారు. అది దక్కడం అంత సులువేం కాదు. ప్రేక్షకుడికి ఏం కావాలో, ఏం చెప్పాలో, ఏం చూపాలో, ఎలా ఆవిష్కరించాలో ఊహించి రూపమివ్వడం తేలికైన పనికాదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతగా ఎరుగని రోజుల్లో కేవలం మెదడుకు పదునుపెట్టి సమాజాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేసిన మాధ్యమం సినిమా. అలాంటి సినీ రంగానికి ఎనలేని కృషి చేసిన వారికి ‘్ఫల్కే’ అవార్డు దక్కడం ప్రశంసనీయం.
-మార్టూరు అజయ్‌కుమార్ (రామచంద్రాపురం)
డూప్లికేట్
ప్రేమ కథలనగానే లైలా మజ్ను, సలీం అనార్కలి, షాజహాన్ ముంతాజ్ కథలు జ్ఞాపకం వస్తాయి. వాటిలో నిజాలకన్నా కల్పనలే ఎక్కువ. షాజహాన్‌కున్న భార్యల్లో ముంతాజ్ ఒకరు. ఆమెకు పిల్లలు పుట్టగానే పనికిరాకుండా పోయింది. ఇంకొకామెను పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ చిహ్నంగా తాజ్‌మహల్ కట్టించినట్లు కథ ప్రచారం చేశారు. దాని వెనుక నిజానిజాలు ఎలా ఉన్నా భార్యపై ప్రేమతో డూప్లికేట్ తాజ్‌మహల్ నిర్మించిన ఖాద్రిని నిజమైన ప్రేమికుడిగా మెచ్చుకోవలసిందే. ఇది నిజంగా జరిగింది కాబట్టి. అవీ-ఇవీలో సముద్ర గర్భంలోని మ్యూజియం, చిన్నారి చిలుకలకు ఆవాసమైన చెట్టు ఆకట్టుకున్నాయి.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)
కోహినూర్
ఈ వారం స్పెషల్‌లో ‘కోహినూర్ ఎవరిది?’ వ్యాసం ఎంతగానో ఆలోచింపజేసింది. ప్రస్తుతం కోహినూర్‌పై వివాదం వల్ల ప్రయోజనం లేదు. మన దేశం నుంచి (దొంగిలించుకు)పోయిన అనేక వస్తువులు బ్రిటిష్ మ్యూజియంలో ‘ఇండియా నుంచి బహుమతి’ అన్న లేబుల్‌తో కనిపిస్తాయి. ఘరానా దొంగతనం. జెల్లీ ఫిష్ అసలు చేప కాదని, అది ఎన్నటికీ మరణించదని తెలిసి ఆశ్చర్యపోయాం. అలాగే షీకాయ్, తుమ్మెదల గురించి తెలియని విషయాలు చెప్పారు. కొందరు ఒప్పుకోకపోయినా ప్రేమ కంటే గౌరవం గొప్పదని, జంతువులకు తెలియందీ మనుషులకే తెలిసింది గౌరవమే అని ఏం చెప్పారండి! సండే గీత భేషుగ్గా ఉంది.
-కె.సుభాష్ (శ్రీనగర్)
స్పర్శ
ఒక చిన్న స్పర్శ ద్వారా ప్రేమ ప్రవహిస్తుంది. అది హృదయాన్ని కదిలిస్తుంది. బాధ నుంచి విముక్తి కలిగిస్తుంది అని గొప్పగా చెప్పారు ఓ చిన్న మాటలో. ‘లోకాభిరామమ్’లో గోపాలంగారు యూనివర్సిటీ విద్యార్థి నాయకుని కొత్త ఆలోచన గురించి చెప్పారు. బాగుంది.
-కె.సాహిత్యదీప్తి (రమణయ్యపేట)