S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాటుసారా రహిత జిల్లాగా నెల్లూరు

గూడూరు, నవంబర్ 13: నెల్లూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తయారు చేయడానికి నవోదయం పథకం ద్వారా ప్రణాళికలు సిద్దం చేసామని ఎక్సైజ్ శాఖ నెల్లూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వి.రాధయ్య తెలిపారు. మంగళవారం ఆయన గూడూరు ఎక్సైజ్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా విలేఖరుల మాట్లాడారు. జిల్లా పరిధిలోని గూడూరు డివిజన్‌లో ఎక్సైజ్ శాఖలో నేరాలు, శాఖాపరమైన పురోభివృద్ది తదితరాలపై సమీక్ష నిర్వహించామన్నారు. నెల్లూరు జిల్లాలో నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాల నిరోధంపై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అయినప్పటికీ కావలి డివిజన్‌లో కప్పరాళ్లతిప్ప, వెంకటగిరిపాళెంలోని అరవపాళెంలో నాటుసారా తయారు చేస్తున్నారని, ఆ ప్రాంతాల్లో ప్రతి నెల 12, 30వ తేదీల్లో ప్రత్యేక దాడులను నిర్వహిస్తున్నామన్నారు. ఎక్సైజ్ కమీషనర్ ఆదేశాల మేరకు నవోదయం పథకం ద్వారా జిల్లాను నాటుసారారహితంగా తయారు చేయడానికి రంగం సిద్ధం చేశామన్నారు. ప్రధానంగా జిల్లాలో అనధికారిక మద్యం షాపులు (బెల్టు) నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో బెల్టుషాపులు లేకుండా గ్రామ, మండల, నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జాతీయ రహదారుల్లో తమిళనాడుకు స్పిరిట్, గంజాయి తదితర మత్తుపదార్థాలు రవాణా అవుతున్నట్లు తమ దృష్టికి రావడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి వాహనాలు తనిఖీ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సంక్రాంతికి ఇతర రాష్ట్రాలతోపాటు జిల్లాల నుంచి చెన్నై మరియు అనేక రాష్ట్రాలకు గంజాయి, స్పిరిట్ అక్రమ రవాణా చేయడం స్మగ్లర్లకు వెన్నతోపెట్టిన విద్యని, కాబట్టి ఆ దిశగా చర్యలను వేగవంతం చేశామన్నారు. జిల్లాలో 349 బ్రాందీషాపుల్లో ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించడంతోపాటు ఆయా బ్రాందీషాపుల్లో మద్యం కల్తీ లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 75శాతం హెచ్‌పీఎస్ (కంప్యూటరీకరణ పద్దతి)లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, మిగతా 25శాతం కంప్యూటర్ మరమ్మతులు, నెట్, కరెంట్ సక్రమంగా పనిచేయని కారణంగా ఆన్‌లైన్ సేవలు వినియోగించలేకపోతున్నట్లు తెలిపారు. 25శాతాన్ని కూడా సెల్‌టెల్ అనే ప్రైవేటు కంపెనీ నిర్వహిస్తోందని, వారితోకూడా మాట్లాడి త్వరలో హెచ్‌పీఎస్ పనిచేసేలాధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఒంగోలు జిల్లాలో పామూరు, కడప జిల్లాలో పోరుమామిళ్ల సరిహద్దు ప్రాంతాల్లో కల్తీమద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతాల్లో షాపులపై ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయని చెప్పారు. హెచ్‌డీ అనే మద్యం అతిగా సేవిస్తే ప్రమాదకరమని, మరణాలు కూడా సంభవిస్తున్నాయని, వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా బెల్టుషాపులు నిర్వాహకులపై 980 కేసులు నమోదు చేసామిన, ఈ కేసుల్లో 980 మందిని అరెస్టుచేయడం, మద్యం, బీరుబాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా సీఆర్పీ 110, 109 సెక్షన్లు అమలులో ఉన్నాయని, మొదటిసారిగా బైండోవర్ కేసులు నమోదు చేస్తామని, కోర్టు రూ. లక్ష మేరకు జరిమానా విధించవచ్చని, అనంతరం జైలుకు కూడా పంపవచ్చని ఆయన హెచ్చరించారు.
బార్లలో మద్యం తినిఖీ చేసిన డీసీ
గూడూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని ఒక బార్‌ను డిప్యూటీ కమిషనర్ రాధయ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా థర్మామీటర్ ద్వారా ఓటీ, ఓఏబీ మద్యాలను కల్తీ లేకుండా తనిఖీ చేయడం విశేషం. కృష్ణాపట్నం పోర్టు, ఓజిలి ప్రాంతాల్లోని మద్యం తయారు చేసే గోదాముల వద్ద నుంచి మద్యం సరఫరా అవుతుందని, అయితే ఈ తనిఖీల్లో మద్యంలో కల్తీ లేనట్లు గుర్తించామన్నారు. మద్యంషాపు యజమానులు సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పని స్పష్టం చేసారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ సూపరిండెంట్ కె.వెంకటరామిరెడ్డి, ఇన్‌చార్జ్ సీఐ కిషోర్, ఎస్సై సుబ్బరాజు ఉన్నారు.

‘ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావాలి’
వింజమూరు, నవంబర్ 13 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావాలని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల ప్రచార అధికారి బి తారక్ ప్రసాద్ తెలిపారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఐసీడీఎస్ కార్యకర్తలు తయారుచేసిన పౌష్టికాహార ప్రదర్శనను ఆయన పరిశీలించారు. పాఠశాలలో అధికారులు, ప్రధానోపాధ్యాయులు, జడ్పీటీసీ సభ్యులు పులిచర్ల నారాయణరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలను విడుదల చేశారు. కేంద్రం చేపడుతున్న భేటీ బచావో, భేటీ పడావో పథకాన్ని వివరిస్తూ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు, లోక్ సత్తా రాష్ట్రీయ సమన్వయ కమిటీ సభ్యులు ఎం మాలకొండారెడ్డి మాట్లాడుతూ లింగ నిర్థారణ పరీక్షలను ప్రోత్సహించ రాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడీఓ షేక్ జహీర్, ఇన్‌చార్జ్ సిడిపిఓ పద్మజ, ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు సింగరాజు శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి కె రామారావు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
* జిల్లా అటవీ శాఖాధికారి వేణుగోపాలరావు
ఉదయగిరి, నవంబర్ 13: జిల్లాలో అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా అటవీ శాఖాధికారి సి.వేణుగోపాలరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక అటవీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం బేస్‌క్యాంప్ సిబ్బందికి నూతనంగా అందజేసిన జీపిఎస్ ట్యాకర్స్ పనితీరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జీపిఎస్ ట్యాకర్స్ విధానాన్ని మొదట ఉదయగిరిలోనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో తిరిగే బేస్‌క్యాంప్ సిబ్బందికి ఈ పరికరాలు అందచేయడం ద్వారా వారి రోజువారి చేసే పనితీరును ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అటవీ ప్రాంతాల్లో బేస్ క్యాంప్ సిబ్బంది ఏమైనా గుర్తిస్తే వెంటనే జిల్లా సబ్ డివిజన్, రేంజ్ కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలన్నారు. అటవీ ప్రాంతంలో ఫోన్లు పనిచేయకపోయినా జీపిఎస్ ట్యాకర్స ద్వారా ఎప్పటికప్పడు సమాచారం అందించే వీలుందన్నారు. అటవీ సంపదను రక్షించే భాగంలో బేస్‌క్యాంప్ సిబ్బందికి వీటిని అందించినట్లు తెలిపారు. రేంజ్ కార్యాలయ ఆవరణలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తు పట్టుబడిన వాహనాలను ఆయన పరిశీలించారు. అనంతరం దుర్గంపల్లి నర్సరీని సందర్శించారు. ఆయన వెంట రేంజ్ అధికారి అల్లాభక్షు, డిఆర్వో చిరంజీవి తదితరులు ఉన్నారు.