S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభ్యర్థులు.. పారాహుషార్..

పరకాల, నవంబర్ 13: ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో అసలు పోరాటం మొదలైంది. దీంతో అభ్యర్థులు ... పారా హుషార్.. నామినేషన్ వేసినప్పటి నుంచి ఖర్చులన్నీ అభ్యర్థుల ఖాతాలోనే జమ కానుంది. రూ. 28 లక్ష లు దాటితే అనర్హత వేటు పడనుంది. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో డబ్బు ఏరులై పారే అవకాశాలు ఉన్నాయి. డబ్బుంటే చాలు పదవి దక్కించుకోవచ్చన్న రీతిలో ప్రచారం సాగనుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటుండగా ఎన్నికల సంఘం నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే అభ్యర్థుల వ్యయంపై నియంత్రణ పెట్టింది. నామినేషన్లు వేసే వరకు ఖర్చుంతా పార్టీ ఖాతా కింద గుర్తిస్తుండగా నామినేషను వేసినప్పటి నుంచి మాత్రం ఖర్చంతా అభ్యర్థుల ఖాతా కిందే లెక్కిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో డబ్బులు భారీగా చేతులు మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి విచ్చల విడిగా మద్యం, డబ్బులు ప్రవహించకుండా అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా అధారాలు లేకుండా నగదు తరలిస్తు న్న వారిపై కేసులు నమోదు చేసి నగదుతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు. దీంతో పాటు ఆయా పార్టీల ఖర్చులను కూడా లెక్కిస్తారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తామంటే కుదరదు. హంగు అర్భాటాలు శ్రుతిమించి భారీ స్థాయికి చేరుకుంటే ఇబ్బందులే. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు చేస్తున్న ఖర్చుంతా పార్టీకి సంబంధించిన ఖర్చుగా నమోదు చేస్తున్న అధికారులు నామినేషను వేసినప్పటి నుంచి మాత్రం ప్రతి పైసా అభ్యర్థి ఖర్చు కిందే లెక్కిస్తారు. నామినేషన్ వేసినప్పటి నుంచి ఖర్చులను ఎన్నికల వ్యయ విభాగం ఆయా అభ్యర్థుల ఖాతా కిందే జమకడతారు. ఏ రోజుకు ఆ రోజు లెక్కల్ని నమోదు చేస్తారు. అభ్యర్థులు కూడా ఖర్చుల వివరాలను నమోదు చేసేందుకు రిజిస్టర్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, భోజనాలు తదితర అన్ని అంశాలను పరిశీలిస్తారు. ఖర్చు రూ. 28 లక్షలు దాటితే మాత్రమే అభ్యర్థిపై అనర్హత వేటు వేస్తారు.