S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నియంత పాలనకు కౌంట్‌డౌన్

కరీంనగర్, నవంబర్ 13: కేసిఆర్ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, ప్రజాగ్రహం కట్టలు తెంచుకుందని, ఈ ఎన్నికల్లోనే తెరాస కనుమరుగుకాక తప్పదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని 10వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించి పేక మేడలా కూల్చేందుకు అధికారంలో ఉన్నంతకాలం అందినంత దండుకున్న కల్వకుంట్ల కుటుంబానికి కాలం చెల్లే రోజులు దగ్గరపడ్డాయని, ఈ ఎన్నికలే వారికి చివరివని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసిఆర్ మనుగడ కొనసాగించలేకే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, మళ్లీ అధికారం అప్పగిస్తే ఏం పాలిస్తాడని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికలు కేసిఆర్ కుటుంబ పాలన, ధన బలానికి తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరు అని, ఈ పోరాటంలో దొరలోడాలి, ప్రజలే గెలువాలన్నారు. అబద్ధాల కోరు మాటల గారడితో ప్రజలను నమ్మించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను దేవతగా అభివర్ణించి అధికారంలోకి రాగానే మాట మార్చిన కేసిఆర్‌కు ఈ ఎన్నికల గుణపాఠమయ్యేలా ఓటరు ఓర్పుతో నేర్పుగా తీర్పు ఇవ్వాలని, ఇది ప్రజలను వంచించే పార్టీలకు గుణపాఠం కావాలన్నారు.