S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భద్రాద్రిని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం

భద్రాచలం టౌన్, నవంబర్ 17: గడిచిన నాలుగున్నరేళ్లలో సాగునీటి రంగానికి పెద్దపీట వేసామని, ప్రజలను కన్నబిడ్డల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని, నూతనంగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని అపద్ధరమ్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భద్రాద్రి రామాలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతుందని, అనుకున్నదానికంటే మరింత మిన్నగా ఆలయాభివృద్ధిని చేస్తామని మంత్రి తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావ్ నామినేషన్ సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం భారీ సంఖ్యలో హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగమన్నారు. దేశం మొత్తం రాష్ట్రం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకొందన్నారు. ప్రజలను కన్నబిడ్డల్లా కేసీఆర్ చూశారని, మళ్లీ అధికారం చేపట్టి అభివృద్ధిని మరింత పరుగులు పెట్టిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలను గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటే, అభివృద్ధికి పెద్దపీట వేసి మరో శతాబ్ధం వరకు చూసుకోనంత అభివృద్ధిని చేస్తామన్నారు. గతంలో తెదేపాలో మంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలం ఏజెన్సీలో రహదారుల అభివృద్ధిని చేపట్టానని, 33 బ్రిడ్జిలను నిర్మించి ప్రజలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్న కూనవరం, వీఆర్‌పురం మధ్య శబరి నదిపై వంతెన నిర్మించి పాపికొండలకు మార్గం సుగుమం చేసిన ఘనత తాను మంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని, ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగినా ఆ శిలాఫలకంపై తన పేరు ఉంటుందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే చర్లలోని వద్దపేట చెక్‌డ్యాం, దుమ్ముగూడెం మండలంలో ప్రగళ్లపల్లి ఎత్తిపోతల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. భద్రాచలం రామాలయం తెలంగాణకే తలమానికమని, తూతూ మంత్రంగా అభివృద్ధి చేస్తే సరిపోదని, ఆగమశాస్త్రాలను అనుసరించి పద్ధతి ప్రకారం కనీవినీ ఎరుగుని రీతిలో భద్రాచలం రామాలయం రూపురేఖలు మారుస్తామన్నారు. ఈ విషయంలో రామభక్తులు అధైర్యపడవద్దని, ఆ బాధ్యతపై తమ ప్రభుత్వంపై ఉంచాలన్నారు. భద్రాచలం పట్టణాభివృద్ధికి చాలా ఇబ్బందులు ఉన్నాయన్న మంత్రి కనీసం డంపింగ్‌యార్డుకు స్థలం కూడా లేదన్నారు. భద్రాచలం నుంచి ఆంధ్రాలో కలిసిన ఐదు పంచాయతీలను తిరిగి తెచ్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, దానికి రాజ్యాంగ సవరణ జరగాలన్నారు. ఐదు పంచాయతీలు ఆంధ్రాలో కలవడానికి ఆర్డినెన్స్ తెచ్చిన భాజపా, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆయన విమర్శించారు. అది మరిచిన సీపీఎం నేతలు టీఆర్‌ఎస్‌పై నిందలు వేస్తున్నారని, ఇందులో టీఆర్‌ఎస్ ప్రమేమం ఏమాత్రం లేదన్నారు. దైవాన్ని నమ్మని కమ్యూనిస్టులు భద్రాద్రి రాముడిని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని కేంద్రంలో చక్రం తిప్పుతుందని, భద్రాచలం నుంచి వేరైన ఐదు పంచాయతీలపై తమ పార్టీ యుద్ధం కొనసాగుతుందని, సాధించే దాకా విశ్రమించమన్నారు. కమ్యూనిస్టులకు భవిష్యత్ ప్రశ్నార్థకమై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ప్రజాభిప్రాయాన్ని కూటగట్టుకునే శక్తి సీపీఎంకు ఏనాడో పోయిందన్నారు. పబ్బం గడుపుకోవడం కోసం అర్థం లేని విమర్శలు చేస్తున్నారని, 40 ఏళ్లు ఏకధాటిగా గెలిచిన సీపీఎం ఎమ్మెల్యేలు భద్రాచలం ప్రాంతానికి ఏమి చేశారో ప్రజలకు తెలుసన్నారు. భద్రాద్రి రాముడి దయవల్ల రాష్ట్రంలో మళ్లీ టీఆర్‌ఎస్ పాలన వస్తుందని, ఉగాది నాటికి ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇస్తామన్నారు. ప్రాజెక్టులతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. భద్రాచలం టీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రావ్‌ను గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అంతకుముందు ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావులు మాట్లాడారు. కార్యకర్తలు 20రోజులు కష్టించి పనిచేస్తే టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే సమగ్రాభివృద్ధి, బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, ఆ దిశగా కేసీఆర్ వేస్తున్న అడుగులకు ప్రజలు తోడుగా నిలవాలని, టీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రావ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుందన్నారు. సభలో తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావ్, మానె రామకృష్ణ, రసూల్, ఎగ్గడి అంజయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.