S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పత్తి కొనుగోళ్ళను పరిశీలించిన మార్కెట్ శాఖాధికారులు

ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 17: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌తో పాటు ఖమ్మం పరిధిలో ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఖమ్మం వ్యవసాయ మార్కెట్ శాఖ సంచాలకులు మల్లేషం, డిఎంఓ సంతోష్‌కుమార్‌లు పరిశీలించారు. శనివారం స్థానిక సాయిబాలాజీ జిన్నింగ్‌మిల్లుతో పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్, జిఆర్‌ఆర్ ఇండస్ట్రీలోని పత్తి కొనుగోళ్ళను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోళ్ళలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులు పత్తిపంటను బస్తాల్లో కాకుండా లూజ్‌గా కేంద్రాల వద్దక తరలించాలని కోరారు. సిసిఐ ద్వారా ప్రకటించిన మద్దతుధరకు రైతులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. పత్తిలో తేమశాతం అధికంగా లేకుండా రైతులు చూసుకోవాలని సూచించారు. పత్తిలోని నాణ్యతను బట్టి సిసిఐ ధరను కేటాయించడం జరుగుతుందని, కావున రైతులు పత్తిలో ఎటువంటి చెత్తాచెదారం లేకుండా నాణ్యమైన పత్తిని తరలించి మద్దతుధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు ఆంజనేయులు, రాజా నిరంజన్, సిబ్బంది పాల్గొన్నారు.