S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజల పక్షానే జనసేన

విశాఖపట్నం, నవంబర్ 18: ప్రజల పక్షాన పోరాటాలు చేసేది జనసేన పార్టీ ఒక్కటేనని, అధినేత పవన్ కల్యాణ్ సమస్యలను గుర్తించి వాటిపై ఉద్యమిస్తారని మాజీ మంత్రి పీ బాలరాజు అన్నారు. జనసేన ఆధ్వర్యంలో సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన శంఖారావం సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలన్న ధ్యాసే లేని టీడీపీ ప్రభుత్వాన్ని తన పర్యటనతో కదిలించారన్నారు. రాజధాని భూ సేకరణ, తూర్పుగోదావరి సెజ్‌లు ఇలా సామాన్య ప్రజానీకం, రైతాంగం ఎదుర్కొనే సమస్యలపైనే పవన్ దృష్టి సారించారన్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం వారి కష్టార్జితాన్ని కూడా లాక్కునేలా వ్యవహరిస్తోందన్నారు. జనసేన సమావేశాలకు పవన్ వస్తేన జనం వస్తారని, అధికార పార్టీ విమర్శలు చేసిందని, అయితే సాధారణ కార్యకర్తలు తలచుకుంటే జనసేన జనభేరిగా మారుతుందన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రజానీకం ఇప్పుడు మార్పు కోరుతున్నారని, యువత యావత్తు పవన్ వెంటే ఉన్నారన్నారు. ప్రజాసమస్యలపై జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌ను నిలువరించేందుకు అధికార పార్టీ ఎన్నో ఆటంకాలు కల్పించేందుకు యత్నించిందని, వాటన్నింటీ సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నామన్నారు. యువతకు న్యాయం జరగడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే జనసేన అధికారంలోకి రావాలన్నారు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చిన మీదటే జనసేనలో చేరానన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముత్తా కృష్ణారావు మాట్లాడుతూ జనసేన కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు. పలు గ్రామాల్లో కార్యకర్తలను టీడీపీ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారని, వీరందరికీ జనసేన అధినేత అండగా ఉంటారన్నారు. పార్టీలో మధ్యవర్తుల ప్రమేయం అంటూ ఉండదని, నేరుగా అధినేత పవన్‌తోనే సంప్రదించేలా వాట్సప్ గ్రూపుల్లో చేర్చామన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా నేరుగా అధినేతకు చెప్పుకునే అవకాశం, ప్రజాస్వామ్యం జనసేనలో ఉందన్నారు. జిల్లా కోఆర్డినేటర్ ఆశోక్ కుమార్ సారధ్యంలో మాజీ మంత్రి బాలరాజును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ పార్ధసారధి, జాయింట్ కోఆర్డినేటర్ ప్రభు, జిల్లా నాయకులు చింతలపూడి వెంకటరామయ్య, మండవ రవికుమార్, కోన తాతారావు, బొలిశెట్టి సత్యనారాయణ, డాక్టర్ సునీతి, గుంటూరు వెంకట నరసింహరావు, వేగి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
భారీ ర్యాలీ
జనసేన శంఖారావ సభను పురస్కరించుకుని జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు మోటార్ సైకిళ్లు, వాహనాలతో ర్యాలీ చేయగా సుమారు గంట సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

===

గురునానక్ జయంతి వేడుకలు
ఆరిలోవ, నవంబర్ 18: గురునానక్ జయంతి వేడుకల్లో భాగంగా సిక్కులు నగరంలో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఏటా గురునానక్ జయంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలతో పాటు పలు ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగానే రహదార్లు శుభ్రపరిచారు. అనంతరం గురుద్వారా నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, జగదాంబ, ఆర్కే బీచ్ మీదుగా తిరిగి గురుద్వారా వరకూ ప్రదర్శన నిర్వహించారు. పలువురు మహిళలు,సిక్కు సాధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.