S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమయం లేదు మిత్రమా

ఎం వరప్రసాద్ దర్శకత్వంలో నిర్మాత జిఎమ్ మురళీధర్ నిర్మిస్తున్న చిత్రం సమయం లేదు మిత్రమా’. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో చిత్రాన్ని ప్రారంభించారు. పూర్తి కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో నోయల్, ట్వింకిల్ సౌజ్ (తొలి పరిచయం) హీరో హీరోయిన్లు. నిర్మాత జిఎమ్ మురళీధర్ మాట్లాడుతూ ‘ఇది నా మొదటి చిత్రం. డైరెక్టర్ వరప్రసాద్ చెప్పిన కథ, కథనం నచ్చి సినిమా నిర్మాణానికి ముందుకొచ్చాం. అందరూ ఆదరించాలని కోరారు. దర్శకుడు ఎం వరప్రసాద్ మాట్లాడుతూ ‘టైటిల్ మీకు తెలిసిందే. క్యాచీ టైటిల్. ఈ చిత్రం కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్. నన్ను నమ్మి బాధ్యతలు అప్పగించిన నిర్మాతకు కృతజ్ఞతలు. మంచి టెక్నీషియన్లు కుదరడం మరో అదృష్టం. నగేష్ ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించబోతున్నారు అన్నారు. నగేష్ మాట్లాడుతూ సినిమాలో మెయిన్ విలన్‌గా చేస్తున్నానని, అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పారు.