S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శరద్గీతాలు

గీ॥ అది లసత్తర తారకా హారపంక్తి
చారు తర శరద్రాత్రి విశాల దాత్రి
కవల మినే్నట వెనె్నల అలలదేలి
అల్లనల్లగ సాగే జాబిల్లి నావ

గీ॥ రమ్యకానన గిరి శిఖరములనుండి
కెరలివల గొనుసెలయేటి తరగలందు
చలువ జాబిల్లి వెనె్నల జల్లుకురియ
మించె వెనె్నల కారు శోభించెజగతి

గీ॥ మృదుల భావమ్ములన్ పొదరిండ్ల డాసి
సరళ పదవల్లరులకు పందిరులు వేసి
సుకవి పండించు రస కావ్య శోభలట్లు
శారదోదయ చంద్రికల్ సాంద్రమయ్యె

గీ॥ వనములందునను ద్యాన వనములందు
శైలములయందు దూర దేశములయందు
జిలుగు వెనె్నల నిండారు సీమలందు
సిత శరచ్చంద్రికా మరీచికలు వెలసె
గీ॥ నిర్మలాకాశ సరసి వెనె్నలల అలల
పొలుపుమీరిన తెలకలువ పూవువోలె
చిత్ర రమణీయ శారదారాత్రులందు
అల్లదో చంద్రబింబము అందగించె

గీ॥ పొంగి పొరలెడు ఆకాశ గంగలోన
అలల పయనించు కల రాజహంసవోలె
శారదాంబుదల హరుల జల్లులాడి
సొగసు మీరెను చుక్కల సొబగు ఱేడు

గీ॥ మల్లియ పొదన్ అరవిరుల మాటునందు
సురభిళోత్పుల్లమల్లికాసుమమువోలె
గగన మండల తారకాగణమునందు
వెల్లివిరిసెను తెల్లజాబిల్లి పూవు

గీ॥ నీల చేలమ్ము దాల్చిన నింగి పడతి
సిగను దురిమిన మంచి సంపెగయనంగ
నవశరత్తుల పున్నమినాటి దేమి
చెలువుమీరెను విను వీధి కలువరేడు

గీ॥ తరువులందునరంగారు తలరులందు
అల్లలాడెడు ఒక పండుటాకనంగ
ఆకసమ్మున చుక్కల యందు దాగి
అందగించెనుపున్నమి చందమామ

గీ॥ అమరకాంతలు పాల సంద్రమును జేరి
చేదుకొని యెడునొక వెండి చేద యనగ
మెరుగుమెమితోడలెనె్నలనురుగు దేల
అంబరమ్మున బురణిల్లె నమృతరోచి

గీ॥ గగన సౌధాగ్రమున గవాక్షములయందు
తళుకు జలతారు మేలు పరదాల వోలె
నిండుపున్నమి పండు వెనె్నలల రేయి
సతశంనే్మషముల నభస్సీమమెరసె

-ఉమాపతి బి.శర్మ 9246171342