S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒత్తిళ్లను జయిస్తే... మంచి ఫలితం’

విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మంచి మార్కులు సాధించగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయినట్లయితే పరిస్థితి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మెదళ్లలో కదలాడుతుంటాయి. ప్రణాళిక ప్రకారం చదవడంతోపాటుగా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.
సమాధానాలు రాయడం ఒక కళ
ఎంత బాగా చదివినా, ఎంత గుర్తున్నా, వ్రాసే విధానం తెలియకపోతే మంచి మార్కులు సాధించడం కష్టం.
1.చేతివ్రాత బాగుండాలి
2.నిర్వచనం ఉంటే యథాతథంగా రాసే ప్రయత్నం చేయాలి.
3.చిన్న ప్రశ్నలకు వ్రాసే సమాధానాలలో ముఖ్యమైన విషయాలు వదలకుండా రాయాలి.
4.జవాబులో నిర్వచనం ఉంటే ముందుగా రాయాలి.
5.సైడ్ హెడ్డింగ్స్ ముఖ్యమైన వాటికి అండర్‌లైన్ చేయాలి.
6.అవసరమైన చోట చిత్రపటాలను గీచి, భాగాలు గుర్తించాలి.
7.పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండాలి.
పరీక్షలకు ఎలా చదవాలి?
1.సబ్జెక్టులన్నింటికి సమయం కేటాయించి ప్రణాళికతో చదవాలి.
2.ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య చదివితే మంచి ఫలితం ఉంటుంది.
3.కష్టమైన, ఇష్టం లేని సమ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి.
4.ప్రతిరోజు అవసరమైనంత నిద్ర పోవాలి.
5.ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి.
6.చల్లని పదార్థాలు తినడం, త్రాగడం చేయకండి.

పరీక్షలకు రెండు రోజుల ముందు

1.మొదటి పరీక్ష కోసమే చదవాలి.
2.గతంలో చదివినంత వరకు మాత్రమే రివిజన్ చేయాలి. కొత్తవి నేర్చుకోవాలని ప్రయత్నించకండి.
3.సరిపడా నిద్ర పోవాలి. కష్టపడి చదవడం వరకు మాత్రమే, కాని ఫలితం మన చేతుల్లో ఉండదని గుర్తించాలి.
4.ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి.

పరీక్ష రోజున

1.పరీక్ష సమయానికి కనీసం గంట ముందు చదవడం ఆపండి.
2.పరీక్ష వ్రాయడానికి కావలసినవి సిద్ధం చేసుకోవాలి.
3.స్నేహితులతో సరదాగా మాటలు తప్పించి పరీక్ష గురించి చర్చించకూడదు.
4.పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరాలి.

పరీక్ష హాలులో

1.2 నుండి 5 నిమిషాలు కళ్లు మూసుకొని ప్రశాంతంగా కూచోవాలి.
2.ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలు శ్రద్ధగా విని పాటించాలి.
3.పరీక్షకు సంబంధించిన సబ్జెక్ట్ మెటీరియల్ ఇతరములు చిన్న ముక్క కూడా దగ్గర ఉంచుకోకూడదు.
4.ప్రశ్నపత్రంపై గాని, బెంచ్‌పై గాని, పాడ్‌లపై గాని ఏమీ వ్రాయకూడదు. తనిఖీ బృందాలు డిబార్ చేస్తారు.
5.ప్రశ్నపత్రం శ్రద్ధగా చదవాలి.
6.తేలికగా ఉన్న ప్రశ్నకు సమాధానం మొదటగా వ్రాయాలి.
7.మొదటి పేజీ అందంగా వ్రాసే ప్రయత్నం చేయాలి.
8.ప్రశ్నలు కష్టంగా అనిపిస్తే కంగారుపడొద్దు. మీకే కాదు, అందరికీ అలాగే అనిపిస్తాయి.
9.సమాధానాలు వ్రాయడం పూరె్తైన తర్వాత ప్రశ్నల నంబర్లు సరిచూసుకోండి.
10.సమయం మిగిలితే వ్రాసిన సమాధానాలు పునః పరిశీలించుకోవాలి.

పరీక్ష హాలు నుండి బయటకు వచ్చాక

1.స్నేహితులతో తప్పొప్పుల గురించి చర్చించకూడదు.
2.ఆహారం తీసుకొని, కొంత సమయం విశ్రాంతి తీసుకొని తరువాతి పరీక్షకు ప్రిపరేషన్ కావాలి.

అన్ని పరీక్షలు అయినాక

1.నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఫలితం నా చేతుల్లో లేదనుకోవాలి.
ఫలితాలు విడుదలయిన తర్వాత
1.వచ్చిన మార్కులను బట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి.
2.ఫెయిలయిన విద్యార్థులు, చదువు జీవితంలో ఒక భాగమని, మంచిగా బ్రతకడానికి చాలా మార్గాలున్నాయని అర్థం చేసుకోవాలి. చావడం అనేది మూర్ఖులు మాత్రమే చేస్తారు. తెలివిగలవారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.
లక్ష్య సాధనలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ వుంటాయి. వాటికి ఎదురీదుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లినవారే ప్రపంచ విజేతలు అవుతారు.

-డా.అట్ల శ్రీనివాస్‌రెడ్డి