S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేవుడు అమ్మకానికి లేడు!

మీరు దేవుడిపట్ల విశ్వాసం కలిగివున్నారా? మనలో చాలామంది భగవంతుడిపట్ల నమ్మకం కలిగి వుంటాం. రోడ్డు వెంట ఆడుకుంటున్న చిన్నారులను మీరు ఇదే విషయమై ప్రశ్నిస్తే, ‘ఔను, దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను’ అంటూ వెల్లడిస్తారు.
ఒకవేళ, వారిలో ఒకరిని ‘‘మీరు ఎందుకు నమ్ముతున్నారు?’’ అని ప్రశ్నిస్తే, ‘‘ఎందుకంటే, నా తల్లిదండ్రులు నాకు చెప్పారు కాబట్టి’’ అని లేదా, ‘‘మా నాయనమ్మ చెప్పింది కాబట్టి’’ అంటారు. ఒకవేళ వారి నాయనమ్మ వద్దకు మీరు వెళ్లి ఇదే ప్రశ్నను అడిగితే, ఆమె ఏం చెప్తుందంటే.. ‘ఔను, దేవుడు ఉన్నాడు. మీరు ఇలాంటి ప్రశ్నని ఎందుకు అడిగారు?’’ అంటూ ఎదురు ప్రశ్నిస్తారు.
కానీ, ఇవే ప్రశ్నలను మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. వాస్తవానికి, ఎన్నో అంశాల్లో నాస్తికుడు చాలా నిజాయితీగా ఉంటాడు. ఆయన ఎందుకు నమ్మడంటే అలాంటి అనుభవాన్ని ఆయన ఏనాడూ పొంది ఉండడు కాబట్టి. మీకు భగవంతుడిపట్ల నమ్మకం ఉంటే, ఈ విశ్వాసాన్ని బలంగా చాటి చెప్పేందుకు మీ వద్ద ఉన్న ఆధారం ఏంటి?
మీరు ఆధ్యాత్మికమైన సిద్ధాంతాన్ని అనుభవించారా?
‘‘దేవుడ్ని నేను నమ్ముతాను. ఎందుకంటే.. దేవుడి ఉనికికి సంబందించిన అనుభవాలు నాకున్నాయి’’ అని మీరు పూర్తి విశ్వాసంతో ఈ మాట చెప్పగలరా? మీకు స్వీయానుభవం లేకుండా, ఇలాంటి మాటలు చెప్పడం అబద్ధం మాత్రమే కాకుండా అర్థం పర్థంలేనివి కూడా అవుతాయి.
గుడ్డిగా నమ్మడంలో ఎలాంటి తప్పులేదు, ఎందుకంటే ఇది మనల్ని కొన్నిసార్లు నడిపిస్తుంది. అయితే, క్రమానుగతంగా ఈ వాదాన్ని బలపరిచేందుకు సరైన అనుభవాలు తప్పనిసరిగా కావాలి. నమ్మకం లేదా అంచనాలు విజయవంతం అయ్యేందుకు వ్యక్తిగత అనుభవాలు ఉండాలి. అయితే, మనం ఈ వ్యక్తిగత అనుభవాలు ఎలా పొందాలి, అసలెందుకు మనకు ఇలాంటి అనుభవాలు ఉండాలి? స్థూలంగా, అన్ని మతాలు మరియు ఆధ్యాత్మిక విధానాలకు సంబంధించిన కార్యాచరణల్లో మరియు శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాల్లో కూడా మన ఉనికిని చాటుకునేందుకు తగిన పరిజ్ఞానం కావాల్సి ఉంటుంది. ప్రాథమికంగా, ఈ భౌతిక ప్రపంచానికి ముందు ఏవో ఉందని మనం నమ్ముతాం. దీంతోపాటుగా మన పంచేంద్రియాల సాక్షిగా కలిగిన అనుభూతులతో వాటిని విశ్వసనీయంగా తీసుకుంటాం. ఈ విషయం మనకు ఎందుకు తెలుసంటే... ప్రతిరోజూ మనకు ఆయా అంశాల వెనుక ఎన్నో దృశ్యాలు గమనంలోకి వస్తుంటాయి. అయితే, వాటి వెనుక వున్న విషయాలను మనం గుర్తించేది ఎలా?
స్వామి వివేకానంద తన సంభాషణల్లో ఒక చోట మనకు అందుబాటులో వున్న స్పృహలో వున్న అంశాల ఆధారంగానే మనకు భిన్నమైన భావనలు కలుగుతాయని పేర్కొంటారు. ఐన్‌స్టీన్ అంతటి తెలివైన వారు అయినప్పటికీ, వారు తమ మెదడులో ఉపయోగించుకునేది కేవలం పదిశాతం మాత్రమేనని శాస్తవ్రేత్తలు సైతం అంగీకరించారు. దీన్నిబట్టి, మన స్పృహ లేదా పరిజ్ఞానాన్ని ఏ పనె్నండు శాతమో లేదా పధ్నాలుగు శాతమో ఉపయోగించుకుంటే... ఎలాంటి ఫలితాలు వస్తాయో ఒకసారి ఊహించండి. ఇదిలా ఉంచితే, మిగతా 85 శాతం సంగతి ఏంటి?
పూర్తిగా మనసు కేంద్రీకరించి చేసే మెడిటేషన్ మరియు యోగిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా మన సూక్ష్మమైన నాడీ ప్రాంతాలు పునరుత్తేజితం పొందుతాయి. తద్వారా మనం మన స్పృహను మరెన్నో రెట్లకు విస్తరించవచ్చు. అంతేకాకుండా సూపర్ కాన్షియస్‌నెస్ కోసం ఆకాశమే హద్దుగా ముందుకు సాగవచ్చు. అంతేకాకుండా సముద్రం అంతటి సవిశాలమైన లోతైన విజ్ఞానాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. మనల్ని మనం మథించుకుంటూ మరింతగా అనే్వషించుకుంటూ లోతుల్లోకి.. మరింత లోతుల్లోకి పోవడం ద్వారా భగవంతుడిని అనుభూతి చెందవచ్చు.
దీన్ని ఒక విజ్ఞాన సంబంధమైన కార్యంగా తీసుకోండి.. ‘‘ఇప్పటికే నా హృదయాంతరాలలో దివ్యమైన కాంతుల అంకురం ఉంది’’ అనే ఊహలతో ప్రారంభించండి, అనంతరం దాన్ని పరీక్షించండి. మీరే ప్రయోగం చేసేవారు, ప్రయోగానికి లోనయ్యేవారు కూడా! మీ హృదయమే ఓ ప్రయోగశాల. అలాంటి సందర్భంలో మీరు ఏం తెలుసుకున్నారన్నది గమనించండి. మీరు ఎలాంటి అనుభూతిని పొందింది తెలుసుకోండి.
మానవులుగా మనం వస్తువులను నేరుగా అనుభూతి చెందేందుకు అవకాశం ఉంది. హృదయం ద్వారా అనుభవించడం మనసు ద్వారా గ్రహించడం చేయవచ్చు. ఇది మన జన్మహక్కు. మన బాధ్యత. ఇలాంటి వాటిపట్ల ఆసక్తి వున్నవారికి వాటిని అందించడమే. నా గురువు పూజ్య బాబూజీ ఒకసారి ధ్యానం కోసం మీరెంత రుసం వసూలు చేస్తారని నేను ప్రశ్నించగా, ‘‘నా గురువునుంచి ఈ జ్ఞానాన్ని నేను ఉచితంగా పొందాను. అలాంటప్పుడు నేను ఎందుకు రుసుం వసూలు చేయాలి?’’ అని నిర్మొహమాటంగా తెలిపారు.
మన దివ్యత్వం పంచుకోవడం కోసం ఉద్దేశించింది. యోగా లేదా దేవుడిని అమ్మేవారి ద్వారా మూర్ఖులు అవకండి. ఒకవేళ, దేవుడు అమ్మకానికి ఉంటే మీరే దేవుడిని కొనుక్కోగలరు. అలాంటిప్పుడు మీకు దేవుడి అవసరం ఏముంది?

-క్లమేశ్ డి పటేల్