S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పట్టణ ప్రాంతాల్లో 1.75 లక్షల ఇళ్ల నిర్మాణం

అమరావతి, జనవరి 18: పేదలకు పెద్ద ఎత్తున గృహనిర్మాణం చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గృహ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవతంగా పూర్తిచేసేందుకు తగిన రుణాలందించి బ్యాంకర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ పేదల గృహనిర్మాణంపై శుక్రవారం సచివాలయంలో టిడ్కో, మెప్మా, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు, బ్యాంకర్లతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రుణాల మంజూరును వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని 44 బ్యాంక్‌లు ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గృహ రుణాల మంజూరుపై బ్యాంకులు శ్రద్ధ వహించాలన్నారు. ఇప్పటి వరకు రుణాలు అందించేందుకు ముందుకురాని బ్యాంక్‌లు మూడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో వచ్చే నెలాఖరులోగా లక్షా 75వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలనేది తమ లక్ష్యంగా చెప్పారు. ఇందుకు అనుగుణంగా బ్యాంకర్లు తగిన రుణాలు మంజూరు చేయాలని పునరుద్ఘాటించారు. రుణ మంజూరులో కఠినంగా వ్యవహరించకుండా, పేదల కోసం నిబంధనలు సరళీకరించుకోవాలని సూచించారు. సిబిల్ స్కోర్ విషయంలో పాలనాపరమైన అనుమతులు సంబంధిత బ్రాంచ్ స్థాయిలోనే ఉండాలన్నారు. రాష్ట్రంలో 4,82,597 మంది పట్టణ గృహ లబ్ధిదారులకు రుణాలివ్వాలని ఎస్‌ఎల్‌బీసీ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటి వరకు కేవలం 5,988 మందికి రూ 199.62 కోట్లు బ్యాంక్‌లు రుణంగా అందించాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుత పట్టణ గృహనిర్మాణ లబ్ధిదారులకు ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్‌కు చెందిన 20 బ్యాంక్‌లు మాత్రమే రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. పీఎంఏవై- ఎన్టీఆర్ నగర్ పథకం కింద 5,29,786 ఇళ్లు మంజూరు చేశామని, 4,60,492 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయని, వీటిలో 3,60,365 ఇళ్ల నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. వీటిలో 1,42,061 శ్లాబ్‌ల నిర్మాణం పూర్తయ్యాయని, 75,284 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ పట్టణ గృహనిర్మాణ కింద 4,28,444 మంజూరు కాగా, 1,11,613 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, వీటిలో 73,752 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.