S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కన్నుల్లో వెన్నెల

కొమ్మ మీద కోయిలా
కుహుకుహు గీతికలా
గుండెలో హాయిలా
ఇలా ఇలా ఊచే సరాగాల ఊయల
ఆ వలపు ఆ తలపు మైమరపు
ఊసుపోక రాయలా.. ఊహలతో
కవిత ఇలా ఇలా
తను...
నా తనువు మనసు తపన తపసు
కడలిపై అలలా అలలపై కలలా
కదిలే వెనె్నల వెలుగై నా కన్నుల
పుచ్చ పువ్వులా.. విచ్చి వెనె్నల్లా...
కాటుక కళ్ల వాకిళ్లు
ఆ కామునికవి పొదరిళ్లు
కొప్పులో బంతిపువ్వు పెదవిపై
మొలక నవ్వు
పరికిణీ పావడాలకు తగవు
దాచలేక వయసు బిగువు
మిసమిసలాడే నవ వధువు
తొణికిసలాడే తొలి మధువు
రెండు కళ్లు చాలవు కలువ
కనులు చూడను
ఉన్న గొంతు చాలదు దాని
సొగసులను పాడను
అచ్చ తెనుగు అమ్మాయి
ఆ బాపు బొమ్మోయి...
పల్లె వెలుగు.. పల్లె వెలుగు...
ఆవుల పొదుగుల జాలు
పచ్చిపాల నురుగు
దూడలకై వదిలిన పాలకై
లేగదూడ పరుగు
నిజమో.. కాదో...
రివ్వున ఎగిరే ఆ గువ్వల
గుంపుల నడుగు
కొమ్మారెమ్మల కూసే
కోయిలమ్మల నడుగు
కొండలపైనుంచి గెంతుకొచ్చే
కొండవాగు నడుగు
కోనల పరిగెట్టే జింకల
గుంపుల నడుగు.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505