S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రోజు చివర్లో...(సండేగీత)

రోజు చివర్లో సినిమా చూసి కొందరు, వార్తలు చూసి మరి కొందరు నిద్రపోతుంటారు.
ఇట్లా ఎన్నో చెప్పవచ్చు.
కానీ-
రోజు చివర్లో ఏం చెయ్యాలి?
ఈ ప్రశ్న వేసుకుంటే జవాబుని ఆలోచించవచ్చు.
ఈ రోజు ఏం చేశాం? అన్న ప్రశ్న అవసరం. మన జవాబుతో రేపు ఏం చెయ్యాలో బోధపడుతుంది. ఏం చేయకూడదో కూడా అర్థమవుతుంది.
మన శక్తిసామర్థ్యాల మేరకు మనం పని చేశామా?
ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నామా?
ఎవరినైనా బాధపెట్టామా?
ఎవరి పట్లనైనా కఠినంగా ప్రవర్తించామా?
మన పట్ల మనమైనా ప్రేమపూర్వకంగా వున్నామా?
రేపటి గురించి ఏమైనా ఆలోచించామా?
రోజు చివర్లో-
ఈ ప్రశ్నలు సమాధానాలనే కాదు.
మన పురోగతికి బాటలు వేస్తాయి.
రోజు చివర్లో
మనకు మనం ఏం మాట్లాడుకుంటామన్నది
మరీ ముఖ్యమైంది.
ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం చేయకపోతే ఇప్పుడైనా చేద్దామా?

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001