S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గిరిజన సంస్కృతిని గౌరవిద్దాం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: గిరిజన ప్రాంతాలకు సంబంధించి కేంద్రానికి గవర్నర్లు ఇచ్చే నివేదికలను పార్లమెంటరీ కమిటీలు పరిశీలించాలని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు సూచించారు. జాతీయ గిరిజన కమిషన్ (ఎన్‌సీఎస్‌టీ) వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జ్యువల్ ఓరం ప్రసంగించారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను అందరూ గౌరవించడం సాంఘిక మర్యాద మాత్రమే కాదని.. అది రాజ్యాంగ బాధ్యత అని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా గిరిజనులు వివిధ రూపాల్లో ప్రకృతిని ఆరాధిస్తున్నారని, అవి భిన్నంగా ఉండవచ్చు కాని.. వారు చివరగా ప్రకృతినే ఆరాధిస్తారని వెల్లడించారు. గిరిజనుల సాంస్కృతిక గుర్తింపు రక్షణ పేరుతో వారిని జాతీయ ప్రధాన స్రవంతి నుంచి వేరుగా చూడరాదని అన్నారు. వారి ఆకాంక్షలు, అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు గిరిజన యువతకు అవకాశం కల్పించాలన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వివిధ రాష్ట్రాల గవర్నర్లు కేంద్రానికి ఇచ్చే నివేదికలు పార్లమెంట ముందుంచాలని ఆయన సూచించారు. అలాగే ఈ నివేదికలను పార్లమెంట్‌లోని గిరిజన వ్యవహారాల కమిటీ పరిశీలించాలని వెంకయ్య నాయుడు సూచించారు. కేంద్రంలో గిరిజన వ్యవహారాల కోసం మంత్రిత్వ శాఖను, జాతీయ గిరిజన కమిషన్‌ను అటల్ బిహారీ వాజ్‌పేయి కాలంలోనే ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.