S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మౌనం

మౌనం
ఓ పదునైన ఆయుధం!
మాటల్లేని
విజ్ఞాన సర్వస్వం!
వౌనంగా మెరుస్తున్నందుకే కాబోలు...
చుక్కలంత అందంగా కనిపిస్తాయి!
వౌనంగా వెనె్నల కురిపిస్తున్నందుకే కావొచ్చు...
చంద్రునికంత ప్రకాశం!
భాషంటూ లేనిది
వౌనం!
మానవ సంబంధాలకు
ఆలంబనగా నిలిచేదీ వౌనమే!
మాట జారి...
చేటు తెచ్చుకోకుండా ఉండాలంటే...
వౌనాన్ని ఆశ్రయించక తప్పదు!
మనసు మాట్లాడాలంటే...
నోటికి తాళం వేయాల్సిందే!
మనసు వౌనం వహిస్తేనే కదా...
హృదయం మాట్లాడుతుంది!
*

-దాస్యం సేనాధిపతి 9440525544