S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పొగరుబోతట!

...అంటున్నారు ముద్దుగుమ్మ నయనతార ప్రవర్తనను చూసిన వాళ్లు. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో..ఎలా మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. టాలీవుడ్, కోలీవుడ్‌లంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఈ భామ రెండు భాషల్లోనూ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. నయనతార సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనదు. యాడ్స్‌లో నటించదు. అప్పుడెప్పుడో ఒక్కసారి యాడ్‌లో కనిపించి మాయమైంది అంతే! అయితే ఇలా చేయడం వల్ల నయనతార ఫ్రెండ్లీనేచర్ కాదనీ, ఆమెకు గర్వం అనీ, పొగరనీ చాలామంది సినీ జనాలు అనుకుంటుంటారు. ఈ విషయం గురించి నయనను కదిలిస్తే మాత్రం -‘‘అవును. నేను పొగరుబోతునే. అంతేకాదు, అహంకారిని కూడా. అయితే ఏంటట? నాతో వేళాకోళంగా ప్రవర్తించే వాళ్ల దగ్గరే అలా ఉంటాను. మిగతా వాళ్ల దగ్గర అలా ఉండాల్సిన అవసరం నాకేంటి? నాతో సినిమాలు చేసిన వాళ్లకు నేనెంత ఫ్రెండ్లీగా ఉంటానో తెలుసు. ఏమైనా మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి’’ అంటూ బోల్డు బోల్డుగా చెప్పుకొచ్చింది. వాహ్..నయనా..మజాకా!!

-సమీర్