S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 21: క్రీస్తు పునరుత్థానం సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే ఈస్టర్ పండగ ను నగర శివారు ప్రాంతాలో ఘనంగా జరుపుకున్నారు. గుడ్ ఫ్రైడే రోజున శి లువలో మరణించిన ఏసుక్రీస్తును శనివారం సమాధి చేసిన అనంతరం లేఖనంలో పేర్కొన్న విధంగా 3వ రోజున ఆదివారం సమాధి నుంచి సజీవునిగా లేచిన క్రీస్తు ఘడియలైన తెల్లవారుఝాము సమయాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు ఆదివారం వేకువజాము 4గంటలకే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు పునరుత్థానంతో మనిషికి పరలోక రాజ్యప్రవేశంతోపాటు నిత్యజీవం పొందిన విషయాలతో కూడిన బైబిల్ వాక్యోపదేశం చే శారు. ఈసందర్భంగా సింగ్‌నగర్ లూ థరన్ చర్చి నార్త్ పారీష్‌లో చర్చి పా స్టర్ రెవరెండ్ జీ ప్రభుదాస్, తెలుగు బాప్టిస్ట్ చర్చి, ఇమ్మానియేల్ బాప్టిస్ట్ చ ర్చి, సాల్వేషన్ ఆర్మీ చర్చి, సెవెన్త్ డే చ ర్చి, షారోను ప్రార్థనా మందిరం, హె బ్రోను ప్రార్థనా మందిరం, జేఎన్‌సీ చ ర్చి, ఫిలదెల్ఫియా చర్చి, హోసన్న ప్రా ర్థనా మందిరాలలో వేలాదిగా క్రైస్తవు లు పాల్గొని ఆరాధనలో పాల్గొన్నారు.
క్రైస్తవులతో రద్దీగా కృష్ణానది ఒడ్డు
ఈస్తర్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవులు నిర్వహించే బాప్టిజం కార్యక్రమాలు ఆదివారం ఉదయం కృష్ణానది ఒడ్డున ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని వివిధ చర్చిల సంఘ సభ్యులు బాప్టిజం తీసుకోవడానికి గాను నగరంలోని పున్నమి ఘాట్ సమీపంలోని కృష్ణానదీ రేవు వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనల అనంతరం సిద్ధపడిన సంఘ సభ్యులకు ఆయా చర్చిల పాస్టర్లు బాప్టిజం ఇచ్చారు. బాప్టిజం కోసం వచ్చిన క్రైస్తవ భక్తులతో కృష్ణానది ఒడ్డు రద్దీగా మారింది. ఇదిలా ఉండగా క్రైస్తవ జీవితంలో బాప్టిజం తీసుకునే ఘట్టానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. నగరంలో ఉన్న ఏకైక నదీ తీరం కృష్ణానది ఒడ్డున క్రైస్తవులు బాప్టిజం తీసుకునేందుకు సరైన వసతులు లేకపోవడంతో వేలాది మంది పలు ఇబ్బందులకు గురైయ్యారు. క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం బాప్టిజం తీసుకునేందుకు తగిన వసతులతో కూడిన ప్రత్యేక ఘాట్‌ను తమకు కేటాయించాలని పలువురు స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు.

సెయింట్ పీటర్స్ కో కథెడ్రల్‌లో
కన్నుల పండువగా ఈస్టర్ వేడుకలు
పటమట, ఏప్రిల్ 21: వన్‌టౌన్ తా రాపేటలోని 125ఏళ్ల చరిత్ర కలిగిన సె యింట్ పీటర్స్ కో కథెడ్రల్‌లో ఆదివా రం ఈస్టర్ (పాస్కా) వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోస ఫ్ రాజారావు మోన్సిగ్నోర్, పీటర్స్ కథెడ్రల్ విచారణ కర్తలు ఫాదర్ మువ్వల ప్రసాద్ పాస్కా కొవ్వొత్తిని వేలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు భక్తులకు ఈస్టర్ సందేశమిస్తూ ఉత్థానుడైన క్రీస్తు మరణాన్ని జయించి సజీవుడై లేచారని తెలిపారు. మానవుల పాపపరిహార్థం ఏసుక్రీస్తు సిలువ మరణం పొందారన్నారు. క్రీస్తుమార్గం మానవునికి రక్షణ మార్గంగా నిలుస్తోందన్నారు. అనంతరం పీటర్స్ కథెడ్రల్‌లో ప్రత్యేకంగా అలంకరించిన పూజాపీఠంపై బిషప్ రాజారావు, మోన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్, ఫాదర్ రవికాంత్ తదితర గురువులు ఈస్టర్ ‘సమష్టి దివ్యపూజాబలి’ సమర్పించారు. పూజానంతరం కతోలిక భక్తులకు దివ్యసత్ప్రసాదం అందచేశారు. తొలుత బిషప్ రాజారావుమృత్యుంజేయుడైన క్రీస్తుకు పవిత్ర సంబ్రాణీ దూపం వేయగా భక్తులు ఉత్థానుడైన క్రీస్తును స్వాగతిస్తూ కొవ్వొత్తులు వెలిగించి గీతాలు ఆలాపించారు. వేడుకలకు హాజరైన భక్తులకు బిషప్ రాజారావు, మోన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.