S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (2-6-2019 నుంచి 8-6-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. మాటల్లో తొందరపాటు కూడదు. అనుకోని సమస్యలుంటాయి. నిల్వధనం కోల్పోయే అవకాశం. సౌకర్యాదులు శ్రమకు గురి చేస్తాయి. వారం మధ్యమంలో సంప్రదింపులుంటాయి. కొత్త వార్తలు కొంత ఒత్తిడికి గురి చేయవచ్చు. ఇతరుల సహకారం కోరడంకన్నా సహకరించడం మంచిది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సోదర వర్గంతో చిన్నచిన్న సమస్యలు రాకుండా చూసుకోవాలి. గౌరవ లోపాలు లేకుండా చూసుకోవాలి. వారాంతంలో సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. శ్రమ ఉన్నా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. విద్యారంగంలో అనుకూలత ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రల విషయంలో అనుకూలత. కొంత అసంతృప్తి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటు కూడదు. శ్రమ తప్పకపోవచ్చు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త పనుల నిర్వహణలో కొంత జాగ్రత్త అవసరం. సంప్రదింపులకు అనుకూలం. కార్యనిర్వహణ దక్షత. వారం మధ్యమంలో కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత ఒత్తిడులుంటాయి. మాట తీరులో జాగ్రత్త అవసరం. నిల్వధనం వల్ల సమస్యలుంటాయి. బంధువర్గంతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. సామాజిక అనుబంధాలు వృద్ధిలోకి వస్తాయి. భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశం. పెద్దలతో అనుబంధాలు బలపడతాయి. వారాంతంలో సంప్రదింపులుంటాయి. సహకార లాభాలు సంతోషాన్నిస్తాయి. కొత్త వార్తల వల్ల సంతృప్తి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సోదర వర్గంతో అనుకూలత.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో పరామర్శలుంటాయి. ఖర్చులు అధికం. వేరు వేరు విషయాల కోసం పెట్టుబడులు తప్పకపోవచ్చు. పితృవర్గ వ్యవహారాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాదుల్లోనూ జాగ్రత్త అవసరం. విశ్రాంతి లోపం ఇబ్బంది పెట్టే సూచనలు. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. వ్యవహార శైలిలో అప్రమత్తంగా మెలగాలి. కాలం ధనం శ్రమ వ్యర్థం కాకుండా చూసుకోవాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. వారాంతంలో కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాట తీరు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తుంది. బంధువర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. కుటుంబ ఆర్థికాంశాల్లోనూ అనుకూలత. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. పితృవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారు. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. విశ్రాంతి లోపం. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త అవసరం. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. పెట్టుబడుల్లో తొందరపాటు కూడదు. ప్రయాణాదుల్లో అప్రమత్తంగా మెలగాలి. దానధర్మాల వల్ల అన్ని విధాలుగా శ్రేయస్కరం. వ్యతిరేకతలపై విజయం. పోటీ రంగంలో గుర్తింపు. వారాంతంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. పితృవర్గ సంబంధ వ్యవహారాలు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి. పదోన్నతికి అవకాశం. వ్యాపార రంగంలోనూ గుణాత్మకమైన పరిణామాలు. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాలి. బాధ్యతల నిర్వహణలో సంతృప్తి. వారం మధ్యమంలో అన్ని రూపాల్లో లాభాల కోసం ప్రయత్నం చేస్తారు. ప్రయోజనాలు సంతోషాన్నిస్తాయి. గుర్తింపు, గౌరవాలు పెరుగుతాయి. పెద్దల ఆశీస్సులు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి. కొత్త పనులపై ప్రత్యేక దృష్టి. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. వారాంతంలో ఖర్చులు అధికం. పెట్టుబడుల వల్ల మంచి జరుగుతుంది. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాదులకు అవకాశం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సుదూర ప్రయాణాలపై దృష్టి. విద్యారంగంలో పరిపూర్ణ ఉన్నతి. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం. కొంత అసంతృప్తి ఉంటుంది. పితృవర్గ వ్యవహారాల్లో అభ్యున్నతి. కార్యనిర్వహణలో సంతోషం. వేరువేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారుల ఆదరణ, గుర్తింపు లభిస్తుంది. పదోన్నతికి అవకాశం. సమస్యలను అధిగమిస్తారు. వేరు వేరు బాధ్యతలు ఒకేసారి నిర్వహించాల్సి వస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. సోదర వర్గంతో అనుకూలత. దగ్గరి ప్రయాణాలు. వారాంతంలో లాభాలు అన్ని రకాలుగా సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ప్రయోజనాలు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు కూడదు. నిర్ణయాదులు వాయిదా వేసుకోవాలి. అధికారిక వ్యవహారాల్లో లోపాలకు అవకాశం. శ్రమతో కార్యక్రమాలుంటాయి. అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సంఘటనలకు అవకాశం. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. నూతన కార్యక్రమాల నిర్వహణ. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు సంతోషాన్నీ సంతృప్తినీ ఇస్తాయి. ఉన్నత విద్య, ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి. ఆధ్యాత్మిక ప్రయాణాల వల్ల మేలు కలుగుతుంది. దానధర్మాలు అన్ని లోపాలను తీసివేస్తాయి. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాల్లో కొంత జాగ్రత్త అవసరం. అధికారిక వ్యవహారాలు మెరుగుపరచుకుంటారు. సామాజిక అనుబంధాల్లో కొంత జాగ్రత్త అవరం. పితృవర్గ సంబంధాలు పెరిగే అవకాశం. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి. వారం మధ్యమంలో అనుకోని సమస్యలుంటాయి. ప్రమాదాలకు అవకాశం. ఊహించని సంఘటనలు ఇబ్బంది పెట్టే అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. నిర్ణయాదులను వాయిదా వేసుకోవాలి. దైవారాధన, దానధర్మాలు తప్పనిసరి. ప్రశాంతంగా గడపాలి. బాధ్యతలు విస్తరిస్తాయి. వారాంతంలో ఉన్నత కార్యక్రమాలపై దృష్టి. ఉన్నత విద్య, ఉద్యోగాదులుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. గుర్తింపు గౌరవాదులు మెరుగు పరచుకుంటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో పోటీ రంగంలో గుర్తింపు, వ్యతిరేకతలపై విజయం. కాంపిటీషన్స్‌లో అనుకూలత. రోగనిరోధక శక్తి పెంచుకుంటారు. కార్యనిర్వహణ దక్షత. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. రుణాలను అధిగమిస్తారు. శ్రమతో కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో భాగస్వామ్యాల్లో చాలా వత్తిడులుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. భాగస్వామితో కొంత జాగ్రత్త అవసరం. వ్యవహరాల్లో లోపాలకు అవకాశం. ప్రయాణాదుల్లో అప్రమత్తంగా ఉండడం శ్రేష్ఠం. దానధర్మాలు అవసరం. విశ్రాంతి లభిస్తుంది. వారాంతంలో అనుకోని ఇబ్బందులు. అనుకోని సమస్యలుంటాయి. కార్యనిర్వహణలో లోపాలు అధికం. ముఖ్య నిర్ణయాదులను వాయిదా వేయాల్సి ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతాన వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. ఆలోచనలకు రూపకల్పన చేసే ప్రయత్నం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే ప్రయత్నం. క్రియేటివిటీ లోపించవచ్చు. వారం మధ్యమంలో వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు కోసం ప్రయత్నం. అన్ని పనుల్లోనూ శ్రమ. అయినా గెలుపు లభిస్తుంది. శత్రు, రుణ, రోగాదులను అధిగమిస్తారు. కార్యనిర్వహణలో సంతోషం కలుగుతుంది. అలసిపోయే అవకాశం. వేరు వేరు పనుల నిర్వహణ తప్పకపోవచ్చు. అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గౌరవం పెంచుకుంటారు. వారాంతంలో పరిచయాలు, స్నేహానుబంధాలు మెరుగుపడతాయి. వ్యర్థమైన ప్రయాణాలు, ఖర్చులకు అవకాశం.
కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. శారీరకమైన ఒత్తిడులుంటాయి. గృహ వాహనాదుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విద్యా వ్యవహారాల్లో అనుకూలత. ప్రయాణాదుల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. తొందరపాటు నిర్ణయాదులకు అవకాశం. ప్రణాళికల విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. సృజనాత్మకత ఉన్నా అప్రమత్తంగా మెలగాలి. సంతాన సంబంధమైన విషయాదుల్లో ఒత్తిడులు. వృత్తి ఉద్యోగాదుల్లో బాధ్యతలు అధికవౌతాయి. వారాంతంలో వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు. పోటీ రంగంలో అనుకూలత. అన్ని పనులను శ్రమతో నిర్వహిస్తారు. మన్ననలను పొందే ప్రయత్నం చేస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. అధికారుల సహకారం లభిస్తుంది. సోదరులతో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. అధికారిక పర్యటనలకు అవకాశం. రచనా రంగంలోని వారికి కొంత ఒత్తిడులుంటాయి. పితృవర్గ వ్యక్తులతో కలిసి గడిపే అవకాశం. వారం మధ్యమంలో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. గృహ వాహనాదుల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారాల్లో ఒత్తిడులు అధికవౌతాయి. విద్యారంగంలోని వారికి సమస్యలుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. వారాంతంలో సృజనాత్మకత. కొత్త పనుల కోసం రూపకల్పన. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ