S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవనది

ఒక ప్రవాహానికి కదులుతున్న ప్రతిబింబంలా నేను
తడి చూపుల్ని ఆరేసుకున్న చెట్టులా ఈ ఒడ్డున
ఏకాంతర అంతరంగ మధనంలో
విరిగిపడే ఒక నేను.

జీవన గమనానికి ఆంతరంగిక ఆలోచనకీ
ప్రవాహిని ఈ జీవనది
నీటిలా పారే మనసుకి
విశ్వాస బలంతో అంతఃకరణ శుద్ధితో
కర్మలు శుద్ధి గావించబడతాయి.

భౌతిక భవ బంధనాలు చుట్టుకుంటూ
భోగ విలాసాలు రెక్కలు చాచుకుంటూ
మనిషిని నిశ్చలంగా ఉండనీయవు.

ధ్వజమెత్తిన కాంక్షా స్థాయిలు
సనాతన ధర్మాలని సైతం
వినాశం వేస్తాయి.

తులనాత్మక పరిశీలనలో
లౌకిక వైభవములే జీవిత
పరమార్థాలుగా కనిపిస్తాయి.

ఆధ్యాత్మిక సంపూర్ణ ప్రపంచంలో
రక్షింపబడేవి ధర్మపక్షాన ఉంటాయి
ఇప్పటి ఆలోచనలు నాలో ప్రవాహ వేగమై
ఇలా ఈ నదిని నాలో నింపుకోవడం
అలలు అలలుగా తేలిపోవడం
గులకరాళ్ల శబ్ద సంగీతంలో మునిగిపోవటం
జీవిత సాన్నిహిత్యాన్ని సన్నిహితంగా చూడటం
నిర్మలంగా పరిపూర్ణంగా
ఆలోచన వాకిళ్లను చూడటం నాకిష్టం.

ఆకాశంలో రెక్కలు మొలిచినట్టు
జీవనదిని ఎత్తుకుపోయినట్లు
నాడుల్లో నీటి ప్రవాహాలు జీవ నదులవుతున్నాయి
జీవ నదులు జీవితమవుతున్నాయి.

-గవిడి శ్రీనివాస్.. 9966550601