S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘వీక్లీ’ సవాళ్లు ఎదుర్కోడానికి సిద్ధం!

ఆంధ్రపత్రిక ‘వీక్లీ’ 1908లో పుట్టింది. అది ‘అక్క’. డైలీ 1914 నుంచీ ప్రచురణ అయ్యింది. ఇది ‘తమ్ముడు’ - ఆంధ్రపత్రిక వీక్లీలో నేను డైలీలో వుండగానే 1962 ఏప్రియల్, 24 సంచిక నుంచీ నా ‘విడీవిడని చిక్కులు’ నవల సీరియల్‌గా ప్రచురణ మొదలయింది. అది పధ్నాలుగు వారాల పాటు సచిత్ర వారపత్రిక పాఠకుల్ని - అనుకున్న దానికన్నా - ఎక్కువగా ఆకర్షించింది. ‘కృష్ణాపత్రిక’ వీక్లీలో అదే సమయంలో నా నవల ‘ఎదిగీ ఎదగని మనుషులు’ సీరియల్‌గా యాత్ర కొనసాగించింది. అదే టైములో మొత్తం యాభై మూడు వారాలపాటు, పాఠకులకు వీరాజీ (నవలా) సీరియల్ రచయితగా సన్నిహితుడై పోయాడు.
‘నవలలు బాగా వండుతాడు’ అన్న కితాబుతోనే నేను ఆంధ్రపత్రిక వంట ఇంట్లో కొలువు సంపాదించుకున్నాను. (డైలీ ఎడిటోరియల్ హాలులో అని నా ఉద్దేశం) అయితే నాకు వారపత్రిక సేవ చేసే ‘రాత’ ఉన్నది కనుక పరిస్థితులు నన్ను ఆంధ్రుల అభిమాన వారపత్రిక రూమ్‌లో పడేశాయి. అందుకు అప్పుడు నిరుత్సాహపడ్డానేమో గానీ, ఇప్పడు ఒక రకంగా సంతోషిస్తూన్నాను.
పత్రిక ప్రచురణ ఆగిపోయి పాతిక సంవత్సరాల తరువాత కూడా నన్ను నాటీ నేటి ‘వీక్లీ’ పాఠకులు, పెద్దలు - పరిశీలకులు కూడా వారపత్రిక ‘స్పెషలిస్ట్’గా ఆదరిస్తున్నారు. అదో విరోధాభాస.
‘విడీవీడని చిక్కులు’ సీరియల్ ప్రారంభమైనాక మొదటి ఏడు వారాలు మాత్రం, ఏ వారానికా వారం ఏదో ఒక బొమ్మ (ఇలస్ట్రేషన్) వేశారు గానీ ఎనిమిదో వారం నుంచి అదే చివరి బొమ్మతో బొమ్మతో చివరి దాకా కొనసాగించారు. అప్పట్లో అదో సంప్రదాయం అయ్యింది. నా సీరియల్ వస్తున్నప్పుడు ‘్థమ్’ హెడ్డింగ్ - ఇది ‘ట్రాజెడీ’ సుమా అని పాటకులను హెచ్చరిస్తూన్నట్లుగా వుంది కానీ రకరకాలుగా ‘విడీవిడని చిక్కులు’గా అయిపోయిన నా జీవితానికి అదే ఒక సందేశం అయింది.
‘విడీవిడని చిక్కులు’ నువ్వే రాశావా? కాపీ కొట్టావా? అని ప్రశంసాపూర్వకంగా అడిగేవారు పెద్దలు.
మహీధర రామమోహనరావు మొదలు సమీక్షకులు ఆర్.ఎస్.సుదర్శనం, కడియాల రామమోహన్‌రాయ్ దాకా ఈ నవలని చదివి ‘్ఫదా’ కావడంతో, వారి విశే్లషణలు చదివిన తరువాత - దీన్ని నేను కూడా ఒక పాఠకుడిగా, దిగువ మధ్యతరగతి సంఘజీవిగా మరోసారి చదువుకున్నాను. ఈ నవల నేను అనుకోకుండా, ఆంధ్రపత్రిక వీక్లీ కథల పోటీకి పంపడం, దాన్ని శంభూ ప్రసాద్ గారి సతీమణి శ్రీమతి కామాక్షమ్మ గారు చదివి నా గురించి వాకబు చెయ్యడం - ఇవన్నీ యాదృచ్ఛికాలా? దైవ ప్రేరేపితాలా? కానీ నాకు మార్గదర్శకాలు.
అది అలా వుంచి ఆలోచిస్తే - ఈ నవల నా నవల లన్నింటిలో ఎక్కువ ఎడిషన్‌లు వెలువడ్డది. ‘తొలి మలుపు’ తర్వాత నిలదొక్కుకున్నాను దీనితో. ఆదాయం విషయంలో కూడా ముందే ఉండటంతో అందులో వున్న తపనకి ఆలవాలమై వాస్తవికతకి అద్దం పట్టింది. అయితే పత్రిక వీక్లీ నుంచి నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు (వాళ్లు ఉద్యోగం ఇచ్చారుగా).
అటు తరువాత కథ ఈ విడీవిడని చిక్కులు-లకు సంబంధించి చెబుతాను. ఆంధ్రపత్రిక వీక్లీ ఎడిటోరియల్ శాఖలోకి ఈ సీరియల్ పూర్తి అయిన కొన్ని వారాలకే నేను బిక్కుబిక్కున ప్రవేశించాను. నాకు అంతా క్రొత్తగా వున్నది కానీ, నేనెవరికీ ‘స్ట్ఫా’కీ పాఠకులతో సహా ఎవరికీ కొత్తగా అనిపించలేదు. సుస్వాగతం లభించింది.
అప్పుడు వెండిమబ్బు (కన్నడ నవల) సీరియల్, పిలకా గణపతిశాస్ర్తీ గారి విశాల నేత్రాలు వస్తున్నాయి. స్వతంత్ర సీరియల్స్ తక్కువ. ఆంగ్ల అనువాదాలు, ఇతర భాషలు బెంగాలీలో, కన్నడ మొదలయిన భాషల నవలలు ఎక్కువ. కాకపోతే బొమ్మల సీరియల్స్ సత్యమూర్తి (చదువులరావు ఫేమ్) దేవిక మొదలైన వారి బొమ్మల సీరియల్స్ దండిగా వుండేవి. నేను అనుకున్నాను - మన వాళ్లు రాసిన, మన జీవితం మీది ‘వర్ణ’ చిత్రాలు అంటే (అక్షరాల బొమ్మలు) గల సీరియల్స్ వేస్తే బాగుండు వీక్లీలో.
‘కానీ రావద్దా?’ అన్నాడు రాధాకృష్ణగారు. నిజమే. ఆ మాటకొస్తే కథలు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి పడేవి కాదు. ‘ఆరుద్ర’ సరదాగా రాసిన ఉపయుక్తమైన కథకుల ‘చిట్కాలు’ అన్న చిరుపొత్తం ఆం.స.వా.ప. ఉచితంగా పంపిణీ చేసింది. దానికి మంచి గిరాకీ మాత్రం వచ్చింది.
‘బెన్‌హర్’ ‘టెన్ కమాండ్‌మెంట్స్’ ‘కింగ్ ఆఫ్ కింగ్స్’ లాంటి సూపర్ హిట్ ఆంగ్ల చిత్రాలను, ఆయా పంపిణీ సంస్థల అనుమతితో ఒరిజినల్ ఫొటోలతో వేస్తూండేవాళ్లు. వీటికి కూడా మంచి ఆదరణ వుండేది. అయితే వీటి అనువాదం అంత సులభం కాదు...
దీంతోపాటే అప్పట్లో ‘సిండికేటు’లు చాలా వుండేవి. ఉదాహరణకు ఎఫ్‌బిఏ కథలు. ‘అతి ప్రముఖుల కథలు’ ‘కార్టూన్ - కామిక్ స్క్రిప్ట్స్’ వగైరాలు ఇప్పటి రేట్లతో పోలిస్తే చాలా సరసమైన ధరలకి దొరికేవి. ఒక్క భాషలో ఒక్క పత్రికకి మాత్రమే వాళ్లు కాపీరైటు ఇచ్చేవారు. అవే దేవుడిచ్చిన వరాలు!
శ్రీమతి ‘త్రివేణీ’ కన్నడంలో ‘టాప్’ రచయిత్రి. ఆమె నవలలను ‘శర్వాణి’ అనే గృహిణి చాలా చక్కగా అనువాదం చేసి అందించడంతో మన తెలుగులో వచ్చిన ‘ఒరిజినల్’ నవలలాగే ఉండేవి అవి. ‘శర్వాణి’గారు నిజంగా తెలుగు అమ్మాయి కాదు. ఆమె భర్త రామయ్యగారు ఇండియన్ బ్యాంక్ మేనేజర్‌గా పని చేసేవారు. ఈమె తెనుగింటి కోలు. ఈమె తన తెనుగు భాషను, ‘నేను భారతి, వీక్లీ లాంటి మన పత్రికలు’ చదివి నేర్చుకున్నాను. అంటే నాకు ఆశ్చర్యం వేసింది. శర్వాణీ దంపతులు - వారి సంతానం ‘తీన్ కన్య’ ముగ్గురూ అతి చురుకుగా ఉండేవారు. 1966 తరువాత నేను బెజవాడ డైలీలో వున్నప్పుడు కూడా వీరు మంచి ఫ్రెండ్సే నాకు. దానికో కామా పెడతానిప్పుడు.
ఆంధ్రపత్రిక వీక్లీ అనో - లేదా సింపుల్‌గా ‘వీక్లీ’ అనో అనేవాళ్లు తప్ప ఆంధ్ర సచిత్ర వారపత్రిక అనటం ఎవ్వరికీ అలవాటు లేదు.
అనువాదాలు వెయ్యొచ్చా? అన్న మీమాంస నాటి పెద్దలకు రాలేదు. సూపర్ స్టార్ ‘గ్రేస్‌కెల్లీ’ జీవిత చరిత్రను ‘కింగ్ అండ్ ఐ’ అన్న దానిని ఫొటోలతో సహా కొనుక్కున్నాం. నేను వీక్లీ సేవలకు రాంగానే దాన్ని ‘నేను మా రాజుగారూ’ అంటూ సీరియల్‌గా చేశాను.
కాకపోతే ఈ అనువాదాలని వేయడంలో ఆంధ్రపత్రిక వీక్లీ అద్భుతమయిన ప్రపంచ సాహితీ మణిపూసల్ని తెలుగు పాఠకులకు అద్భుత కానుకలుగా అందించింది. ‘టేల్ ఆఫ్ టూ సిటీస్’ (రెండు మహానగరాల కథ) ‘హంచ్ బ్యాక్ ఆఫ్ నాటర్‌డామ్’ నవలను ‘ఘంటారావం’గా తెనుగులో అందరూ ‘వీక్లీ’ ధర్మమా అని చదువుకున్నారు.
నాకు అర్థమయింది. అప్పుడు బెజవాడలో నా పుస్తకాల్ని - మరి ఇతర నవలల్ని సమీక్షిస్తున్నప్పుడు పెద్దలు ‘స్వతంత్ర నవల’ అన్న మాట వాడేవారు. టాయ్‌స్టాయ్, అలెగ్జాండర్, డ్యూమాస్, జూల్స్‌వెర్న్, మార్క్‌ట్వేన్ లాంటి ఎందరో మహనీయుల మాతృభాష ఏదైనా, తెలుగు వాళ్లు తెలుగులోనే చదివి ఆనందించే సీరియల్స్ ఇచ్చింది ఆంధ్ర పత్రికయే కదా! సూరంపూడి సీతారామ్‌గారు గొప్ప అనువాదకులు. అటు తరువాత సోవియట్ ల్యాండ్ ప్రచురణ సంస్థలలోకి వెళ్లిపోయినా వారు మరి ఇరవై ఏళ్ల తరువాత ‘నన్ను’ ఆప్యాయంగా, వాత్సల్యంగా ఎంతో ఇదిగా ఆదరించారు. ఎందుకంటే నేను చేసిన 1982 రష్యా యాత్రకు పిలుపు రావడం వెనుక ఇటువంటి పెద్దల ప్రేమపూర్వకమయిన ‘హస్తం’ ఉంది అనుకుంటాను. విశాలాంధ్ర శ్రీకాంత్ సంగతి చెప్పనే అక్కర్లేదు. చివరి క్షణం దాకా అలా లెటర్స్ రాసి రాసి నా రష్యా పర్యటనకు గైడ్ చేస్తూ, దోహదించాడు. ఇందులో నాకు వాళ్లతో గల ముఖాముఖీ పరిచయాల కన్నా నా ‘తొలి మలుపు’ నవల మొదలుగా - గల నా ‘అభ్యుదయ భావాలు’ అన్నీ రచనలే ఎక్కువ. ఈ అభ్యుదయం అన్న విశేషణం నేను తగిలించుకున్న బ్రహ్మ పదార్థం కాదు. అప్పటి ‘ప్రోగ్రెసివ్ జూర్గాన్’ అది. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయంటే - వారపత్రికలోకి నేను ప్రవేశించేసరికి - తెలుగు వారి హృదయాలను దోచుకుంటున్న ‘వీక్లీ’కి తంబుచెట్టి స్ట్రీట్‌లో రెండు డోర్ నెంబర్‌లు (ఆరు మరియు ఏడు) గల భవనంలో వేరే ఒక ‘గూడు’ లేదు అనగా ‘గది’ లేదు.
ఒక పెద్ద హాలుంది. దానికి మెయిన్ రోడ్డు మీదకి కిటికీలు ఉన్నాయి. అందులో అమ్మకాల విభాగం అంటే సర్క్యులేషన్ డిపార్ట్‌మెంట్ చాలా భాగం ఆక్రమించుకున్నది. దీనిలోనే ఓ చివర వారపత్రిక ఇన్‌చార్జిగా అప్పుడు తాత్కాలికంగా వంటున్న ఎస్.వెంకటేశ్వరరావు గారు మరో ఇద్దరు. మందరపు లలిత - సుబ్బారావు - క్లర్కు శాస్ర్తీ వగైరాలు కూర్చున్నారు. అక్కడే చాలా పెద్ద బల్ల మీద (కుర్చీ ఉంటుంది లెండి) పిలకా గణపతి శాస్ర్తీగారు కూర్చునేవారు. మరో చివర సర్క్యులేషన్ మేనేజర్ - స్ట్ఫా అంతా దాటిపోయాక - మూల మీద మరో పెద్ద బల్ల రంగుల కాగితాలు, డ్రాయింగ్ వాలుబల్ల వగైరాలతో డి.ఆర్.గారు అనగా అసలు పేరు దశక రామలింగేశ్వరరావు గారు ఏకాకిగా కూర్చుని కవర్ పేజీ వర్క్ చేసుకుంటూ వుండేవాడు.
వారపత్రిక ప్రూఫ్ రీడర్లు, వర్కర్లు డైలీ రోటరీ హాలుపై మిద్దె మీద ఉండేవాళ్లు. ఆ పత్రిక కార్యాలయం ఇప్పుడు లాగా కాంక్రీట్ పిల్లర్స్ మీద కట్టింది కాదు. మిద్దెల మీద మిద్దెలుగా కట్టిన పాత మోడల్. ఈ మిద్దెల్ని వరండాల మధ్యన నిర్మించి కలిపి మెట్లు వేసి కలిపేశారు. డైలీ నుంచి మెట్లెక్కుతూ మధ్యలో ఓ హాలులోకి ఐదారు మెట్లెక్కి దూరితే అది అడ్వర్టయిజ్‌మెంట్ శాఖ. దాని హెడ్డు ‘అన్నయ్య’గారు. అట్లా కాకుండా ఎడిటర్ పక్క తిరిగి ‘ల్యాండింగ్’ మీద మెట్లు ఎక్కితే మరో చిన్న రూము. ఈ రూము నుంచి పడమరకి మెట్లు ఎక్కితే - వీక్లీ ప్రెస్సు... తిన్నగా రెండు సోపానాలు దిగితే రాధాకృష్ణగారి రూము. అలాగాక తూర్పుకి తిరిగి నాలుగు మెట్లు దిగితే నేను చెప్పిన సర్క్యులేషన్ మరియు వీక్లీ ప్లస్ భారతి వగైరా బల్ల వుంటాయి. ఏవో సోకాల్డ్ ‘ఇంటర్‌కామ్’ సదుపాయం ఉండేది. ఇదో మాయాబజారు సెట్టింగులా వుండేది. నాటి కాలపు మిద్దెలన్నీ అంతే. కానీ చరిత్రాత్మకాలు. 70వ దశకంలో ఈ భవనం కాల గర్భంలో కలిసింది. ఫొటో కూడా కరువే. అందుకే ఇంత వర్ణన.
‘నేను బుద్ధిమంతుడు, రాముడు’ ఏకగ్రీవంగా పని చేసుకుంటూ వుండగా ఆర్టిస్టు డి.ఆర్.గారు ఫొటో తీశారు. ఆయన మంచి ఫొటోగ్రాఫర్ కూడా. కథలకి బాపు, కేతినీడి, దేవిక మొదలయిన వారు వేసేవారు బొమ్మలు. ఆనక ‘సరాగం’ ‘సాంబు’ వగైరాలు వచ్చారు.
* * *
రాత్రి నాన్నగారు అన్నారు ‘వండలేనమ్మ పొయ్యి వంకర’ అన్నట్లుంది అంటారు. నువ్వు సదుపాయాల వూసు ఎత్తితే ‘నీకిది యాసిడ్ టెస్ట్ అనుకో.
ఎటువంటి పత్రిక ఆలయంలో నువ్వు భక్తుడిగా, అర్చకుడిగా ప్రవేశించావో ఆలోచించి చూడు అంటూ ఎంకరేజ్ చేశారు నాన్నగారు. పెరుగన్నంలోకి తాను తెచ్చిన ‘మలవాలప్పరా’న్ని (అరటి పండు వొలిచివేస్తూ...).
రేడియో వాళ్లు ఆ మధ్య మా వూళ్లో అలనాటి ఆంధ్రపత్రిక మీద చిన్న ‘టాకు’ అడిగారు. దాని స్క్రిప్టు తెచ్చుకున్నాను. నాతోపాటు శ్రవ్య నాటికల కాపీలతోపాటు.
నాన్నగారన్నాక అది గుర్తుకు వచ్చింది - ప్రాతఃస్మరణీయుడు దేశోద్ధారక నాగేశ్వరావు పంతులుగారు. ఆ ప్రొద్దునే్న వ్యాసం కొంత వినిపించా - ఆఫీసు తొందరలో వున్న మా ‘సారు’కు (నాన్నగారినే ‘సారు’ అనేవాణ్ణి ముద్దుగా) లెట్ మి కోట్ ‘రంగూన్ నుంచి క్వెట్టా దాకా, రామేశ్వరం నుంచి కశ్మీరం దాకా వున్న ఆంధ్రులు అందరి కోసం ఆంధ్రపత్రిక విజ్ఞాన దీపికయై అందుబాటులో ఉండాల్సిందే’ అన్నారు దేశోద్ధారకుడు పంతులుగారు. అసలు పేరాయనది ‘నాగలింగం’ కాని దాన్ని ‘మోడరన్’గా మార్చి నాగేశ్వరరావు చేసుకున్నారట. అట్లాగే యుగకర్త ‘కందుకూరి’ వారి నాటి పత్రికా రచననీ, ప్రచురణనీ, బాణీని ఆధునికం చేస్తూ, పంతులుగారు ఆంధ్రప్రత్రికని ‘కని, పెంచారు.’
ఆ రోజుల్లో పోస్ట్ఫాసు వున్న ప్రతి గ్రామానికి, అది ఎంత గ్రామమయినా సరే ఆంధ్రపత్రిక ‘టపా’లో అందేది. దాన్ని గ్రామీణులు ‘రచ్చబండ మీదకు చేరి’ చెవులారా ప్రతి శనివారం వినేవారు. మనసున పట్టించుకునేవారు.. అలా సాగిందా రేడియో వ్యాసం...
నాకు ఇప్పుడు ఏనుగంత బలం వచ్చింది!
(ఇంకా భోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com