S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-23

జింబోకింక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
‘్ఛ! నువ్వు మూర్ఖురాలివి. అసలిది నీ తప్పు కాదు. ఆ రోజే వాణ్ని నరికి పారేస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు’ అన్నాడు పళ్లు నూరుతూ.
‘అదంత తేలిక్కాదులే. అయినా బావా! నాకు తెలియక అడుగుతాను. నేనెవర్ని చేసుకుంటే నీకెందుకు?’
‘ఎందుకా? నువ్వు నా మరదలివి కాబట్టి. నీ మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి’
‘నిజంగా అంత అభిమానం, బాధ్యత ఉంటే ఆ తాళేదో నువ్వే నా మెళ్లో కట్టెయ్యకూడదూ?’ అల్లరిగా అంది చిన్ని.
‘నేనా?’ కంగారు పడిపోయాడతను.
‘కంగారు పడకు బావా! నీకిష్టమైనట్టు నువ్వు గౌతమిని చేసుకో. నేను నాకిష్టమైన ప్రభుగారిని చేసుకుంటాను. ఇంక గొడవేం ఉంది?’
‘అది కాదు చిన్నీ! నువ్వు.. నిజంగా అతన్ని ప్రేమిస్తున్నావా?’ జింబో గొంతు వణికింది.
‘అసలా అనుమానం ఎందుకొచ్చింది నీకు?’
‘ఏం లేదులే! నేను తప్పనిసరిగా పెద్దమ్మ వాళ్ల అడవికి వెళ్లాలి. రావడానికి నాలుగు రోజులు పడుతుంది. వచ్చాక నా అనుమానాలన్నీ చెప్తాను’ అంటూ ఎవరో తరుముతున్నట్టు పరిగెత్తాడు జింబో.
అతని ఆరాటం అర్థం చేసుకున్న చిన్ని మరీ చిన్నపిల్లలా గిరగిర తిరిగింది.
ఈ అలజడి గౌతమి, ప్రభు వచ్చేశారు. గౌతమి పక్కన పడుకున్న చిన్ని అత్త మాత్రం అలసి ఆదమరచి నిద్రపోతూనే ఉంది.
‘చిన్నీ! ఏవిటీ ఆనందం?’ ఆమెని పొదివి పట్టుకుంటూ అంది గౌతమి.
‘మన పథకం నెరవేరింది గౌతమీ. బావ నేను నిజంగానే ప్రభుగారిని ప్రేమిస్తున్నానని కంగారు పడిపోతున్నాడు’ అంటూ అంతా చెప్పింది చిన్ని ఉత్సాహంగా.
‘నేను చెప్పలేదూ? జింబో నిన్ను ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నన్ను చూసి కాస్త సరదా పడ్డాడంతే! అవునూ మీ బావ వస్తే రేపు మనం పాతాళ స్వర్గానికి వెళ్లేదెలా?’ అంది గౌతమి దిగులుగా.
‘ష్! గట్టిగా అనకు. ఎవరైనా వినగలరు. బావ మళ్లీ కొండ దిగి అడవిలోంచి వెళ్లిపోయాడులే. నాలుగు రోజుల దాకా రానని కూడా చెప్పాడు. మీరు మాత్రం పొద్దునే్న వచ్చెయ్యండి’ అంది చిన్నీ మెల్లగా.
‘కానీ మీ వాళ్లంతా ఇక్కడే ఉంటారుగా’ కంగారుగా అన్నాడు ప్రభు.
‘దానికి నేనో పథకం వేశానె్లండి. మీరు వెళ్లి పడుకోండి. అత్తలేస్తే గొడవవుతుంది’ అంటూ వాళ్లిద్దర్నీ పంపేసింది చిన్ని. తర్వాత తన మంచం మీద పడుకుని ఆకాశంలో జింబో రూపాన్ని తల్చుకుంటూ నిద్రలోకి జారిపోయింది. అయితే ప్రభుకి, గౌతమికి రెప్పమూత పడలేదు. అక్కడ విజయ నాయక్ ఒంటరిగా చీకట్లో ఎన్ని అవస్థలు పడుతున్నాడో అన్నదే వాళ్ల బాధ. చెరో మూలా పడుకున్నారు గానీ లేకపోతే అతన్ని గురించే చర్చించుకునేవారు.
భారంగా తెల్లవారింది. ఎప్పుడు లేచిందో చిన్ని మేనత్త ముద్ర కుండ తీసుకుని ఏటికేసి వెళ్లిపోయింది.
చిన్ని హడావిడిగా లేచి గౌతమీ వాళ్లతో కలిసి పక్కగా పారుతున్న ఏటి పాయ దగ్గరికెళ్లి దంతధావనం లాంటివన్నీ ముగించుకుని నీట్‌గా తయారై దొర వున్న గుహకేసి బయల్దేరింది. అయోమయంగా అనుసరించారు ప్రభూ వాళ్లు.
‘ఏవిఁటి తల్లీ పూర్తిగా తెల్లవారకుండానే ముగ్గురూ ముస్తాబై బయల్దేరారు?’ అంది కొండమ్మ నవ్వుతూ. ఇప్పుడు వాళ్లందరికీ గౌతమీ వాళ్లతో కూడా మంచి చనువు ఏర్పడింది.
‘అరె! నీకు తెలియదా వదినా? ఇవాళ మన గౌతమి పుట్టింరోజు. పాపం! వాళ్లింట్లో ఉంటే వూరందర్నీ పిల్చి బ్రహ్మాండమైన విందు చేసుకునేదిట. ఈ అడవిలో చిక్కుకుపోయింది. కనీసం బాబా ఆశీస్సులైనా తీసుకుందామంటే వెళ్తున్నాం’ కళ్లు చేతులూ తిప్పుతూ అంది చిన్ని.
‘అవునా? చాలా సంతోషం తల్లీ! నువ్వు ప్రేమించిన ఈ బాబుని కట్టుకుని నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా ఉండు’ అంది కొండమ్మ గౌతమిని గుండెలకి హత్తుకుంటూ. బిత్తరపోతూనే ఆమె పాదాలకి నమస్కరించింది గౌతమి. కొండమ్మ మరింత కంగారు పడిపోయింది.
‘వద్దు తల్లీ! పెద్దింటి బిడ్డవి. చదువుల సరస్వతివి. నీ చేత మొక్కించుకుంటే పాపం చుట్టుకుంటుంది.’ అంటూ విషయం చాటేసింది. అంతే! బిలబిల్లాడుతూ అందరూ వచ్చి గౌతమికి శుభాకాంక్షలు చెప్పారు.
‘మీ అంత గొప్పగా చెయ్యకపోయినా మేమూ చెయ్యగలం విందు. చిన్నీ! దొరకి నువ్వే చెప్పి ఎలాగైనా విందుకి ఏర్పాటు చేయించవే’ అన్నారు ఉత్సాహంగా.
‘బాబాని అడుగుతాను’ అనేసి ప్రభు, గౌతమితో కలిసి తండ్రి దగ్గరికెళ్లింది చిన్ని. విషయం విన్న దొర మొహంలోనూ ఆనందం చోటు చేసుకుంది. ఆమెని పక్కన కూర్చోబెట్టుకుని ఆశీర్వదించి-
‘ముందుగా చెప్తే జింబోగాడి చేత చీర అదీ కూడా తెప్పించేవాణ్ని కదా తల్లీ! ఇప్పుడు వాడూ ఇక్కడ లేడు’ అన్నాడు దిగులుగా.
‘అవేం అక్కర్లేదు బాబా! నేను నీ పెద్ద కూతుర్నన్నావ్. నీ ఆశీస్సులు చాలు’ అతని కాళ్లకి నమస్కరిస్తూ అంది గౌతమి.
‘అలా కాదు బాబా! బావ లేకపోతేనేం మన వాళ్లందరూ వున్నారుగా. మన పద్ధతిలో విందు చేసుకుంటాం. నీ కూతురు నాకు అక్కే కదా. అక్క పుట్టింరోజు ఇక్కడే బ్రహ్మాండంగా చేద్దాం’ అంది చిన్ని ఉత్సాహంగా.
‘ఇప్పుడవన్నీ ఎందుకు చిన్నీ..’ వారించబోయింది గౌతమి.
అయితే, చిన్ని, అక్కడ చేరిన యువకులూ ఒప్పుకోలేదు. దొర చేత, గౌతమి చేత కూడా ‘సరే’ అనిపించారు.
‘నేను రాలేను తల్లీ! మీరంతా హాయిగా పండుగ చేసుకోండి’ అన్నాడు దొర గౌతమి తల నిమురుతూ.
‘్థంక్స్ బాబా!.. కాస్సేపు సరదాగా గడిపి నేను మాత్రం నీ దగ్గరికొచ్చేస్తాను’ అంది గౌతమి గోముగా. తర్వాత అతనికివ్వాల్సిన మందులు చెప్పి బైటికొచ్చేసింది.
చిన్ని ఆనందానికి హద్దే లేదు. లేడిపిల్లలా పరిగెత్తికెళ్లి విషయం చాటించేసింది. క్షణం ఆలస్యం చెయ్యకుండా కొండమ్మ పదిమంది కుర్రాళ్లని పిల్చి విషయం చెప్పి వాళ్లు చెయ్యాల్సిన పనులు పురమాయించింది. వాళ్లు ఉత్సాహంగా అడవంతా దండోరా వేసేశారు విందు, వేడుకలు ఉన్నాయని. ఇదంతా చూస్తున్న గౌతమి-
‘ఏవిఁటి చిన్నీ ఇదంతా?’ అంది అయోమయంగా.
‘చెప్పేది విను. చేసేది చూడు. ప్రశ్నలడక్కు’ అంటూ వాళ్లిద్దర్నీ అడవికి ఓ మూలగా ఉన్న గుబురైన పొద దగ్గరికి తీసుకెళ్లింది చిన్ని. అక్కడ కాకర తీగెలాంటి తీగ ఒత్తుగా అల్లుకుపోయి ఉంది.
‘ఈ ఆకులన్నీ కొయ్యండి’ అంది మెల్లగా తనూ కోస్తూ.
ముగ్గురూ కలిసి గంపెడు ఆకులు కోశారు. కొండ మీద గుంటలా వున్న ఓ చోట పోసి మరో రాయి తీసుకుని ఆ ఆకుల్ని మెత్తగా నూరింది చిన్ని. తర్వాత ఓ కుండ తెచ్చింది. ముగ్గురూ కలిసి ఆ ఆకుల నించి పసరు పిండి కుండని నింపారు.
‘ఇదేం పసరు?’ కుతూహలంగా అడిగాడు ప్రభు.
‘చూద్దురుగాని. తొందరపడకండి’ నవ్వింది చిన్ని.
తర్వాత ఆ కుండ మీద ఈతాకులు కప్పి అచ్చం కల్లుకుండలా తయారుచేసి, తాటితోపులోని ఓ తాడికింద పెట్టింది.
అప్పటికే తాళ్ల మీదికెక్కి కల్లు కలెక్ట్ చేస్తున్నారు కొందరు. చిన్ని పెట్టిన కుండ మిగతా కుండల్లో కలిసిపోయిందన్న నమ్మకం కుదిరాక-
‘ఇంక పదండి’ అంది చిన్ని.
‘అంత కల్లు ఏం చేస్తారు?’ అంది గౌతమి.
‘ఏం చేస్తామా? ఏట్లో పోస్తాం. లేకపోతే ఏవిఁటి గౌతమీ... కాదు కాదు అక్కా. మాకు పండుగ చేసుకోవడం అంటే తినడం, తాగడం, కొండదేవరకి నైవేద్యం పెట్టాక అదే పని. మీరూ తాగాలి’
‘మేమా? కల్లా? ఛ!’ కంపరంగా అంది గౌతమి.
‘అయితే మీ కర్మ! పాతాళస్వర్గం లేదు. నగర ప్రవేశము లేదు. మా బావని కట్టుకుని ఇక్కడే పడుండు’ చిరాగ్గా అంది చిన్ని.
‘దానికీ కల్లు తాగడానికీ ఏవిఁటి సంబంధం?’
‘నామాట కాస్త వింటారా? మీకోసం నేనెంత ధైర్యం చేశానో తెలుసా? మా వాళ్లు ఎంత శాంతంగా మంచిగా ఉంటారో అడవి జోలికొచ్చినా, ముఖ్యంగా పాతాళ స్వర్గం గురించి మాట్లాడినా రాక్షసులై పోతారు. మీ కోసం నేనింత సాహసం చేస్తుంటే మీరు కాస్త కల్లు తాగడానికి ఆలోచిస్తున్నారా? మీ నగరవాసులు ఆడ మగ తేడా లేకుండా ఎంతలా తాగి తందనాలాడతారో నాకు తెలుసు’ అంది చిన్ని ఆవేశంగా.
‘సారీ చిన్నీ! నువ్వు చెప్పింది కరెక్టే. కల్లు తాగడానికి మాకేం అభ్యంతరం లేదు’ అన్నాడు ప్రభు కంగారుగా.
‘అలవాటు లేదని అలా అన్నాను గానీ మిమ్మల్ని అవమానించడానిక్కాదు చిన్నీ! కష్టపడైనా తాగుతాను’ అంది గౌతమి.
చిన్ని నవ్వింది.
‘అన్నట్టు నేనిచ్చింది మాత్రమే తాగండి. మా వాళ్లిచ్చింది పొరపాటున కూడా తాగొద్దు. ఓసారి ఆఫీసర్‌గారిని కూడా కలిసి వెళ్దాం. నేనేం చేసినా, ఏం మాట్లాడినా అడ్డురాకండి’ అంటూ హెచ్చరించి, కొన్ని పళ్లు తేనెల్లాంటివి తీసుకుని విజయ నాయక్‌ని కలిసి, గుసగుసగా ఏదో చెప్పింది. ఆమె సాహసానికి ఆశ్చర్యపోయాడు విజయనాయక్.
‘్థంక్స్ చిన్నీ! నీ సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం’ అన్నాడు మనస్ఫూర్తిగా.
‘అప్పుడే అంత ఆనందపడిపోకండి. అక్క బాబా దగ్గరుంటుంది. నేను మీ ఇద్దర్నీ తీసికెళ్తాను. నేను బైటే వుండి అక్కడి వాళ్లని మభ్యపెడుతూంటాను. మీరు ఓసారి లోపలికెళ్లి ఎవరి కంటా పడకుండా వచ్చెయ్యాలి. అదీ నేను సంకేతం ఇచ్చాక’ అంటూ హెచ్చరించి ప్రభూ వాళ్లతో కలిసి వెళ్లిపోయింది చిన్ని.
తర్వాత ఏం ఎరగనట్టు ఆటవికులు ఏర్పాటు చేసిన విందులోకి చేరిపోయారు ముగ్గురూ.
అడవిపూల దండలతో గౌతమిని ముంచేశారు ఆడవాళ్లు. నిలువెత్తు కొండదేవత విగ్రహం ముందు చేరి పూజలు చేశారు. డాన్సులు చేశారు. విగ్రహం పక్కనున్న పెద్ద తొట్టెలో వున్న కల్లుని ముంతలతో ముంచుకుని తాగుతూ, కాల్చిన మాంసాన్ని పీక్కుతింటూ చిందులు వేశారు. ప్రభు, గౌతమి చిన్ని ఇచ్చిన కల్లు ముంతల్ని పట్టుకుని దిక్కులు చూస్తూ తాగడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు యువకులు మత్తెక్కువై పెద్ద పూల దండ తెచ్చి గౌతమి, ప్రభుల మెడల్లో వేసి అదే పెళ్లి తంతు అన్నట్టు చప్పట్లు కొట్టారు. ఒకే దండలో బిత్తరపోయి చూస్తున్న ప్రభూ వాళ్లని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు అమ్మలక్కలు.
మరో గంటకల్లా ఎక్కడి వాళ్లక్కడ పడిపోయారు. నిశ్చలంగా. ఓసారి అందర్నీ పరికించి, అంతవరకూ తాగినట్టు నటిస్తున్న చిన్ని చేతిలోని ముంత విసిరేసి -
‘అక్కా! నువ్వింక బాబా దగ్గరికెళ్లిపో. మేం రావడం ఆలస్యం అయినా కంగారు పడకు. పొరపాటున మా బావ వస్తే మాత్రం ఇటుకేసి రానివ్వకు’ అని హెచ్చరించి, ప్రభు చెయ్యి పట్టుకుని పల్లంగా వున్న వైపు నడిచింది. కాస్త తాగినా తల తిరుగుతోంది గౌతమికి. అయినా అడ్డదిడ్డంగా పడున్న ఆటవికుల్ని తప్పించుకుంటూ దొర వున్న గుహకేసి నడిచింది.
చిన్ని మాత్రం తిరిగి చూడకుండా ప్రభు, నాయక్‌తో కలిసి నడక సాగించింది.
గంట తర్వాత కాస్త కిందుగా వున్న ఓ కొండ చూపిస్తూ..
‘అదిగో! అదే పాతాళ స్వర్గం’ అంది.
‘ఏవిఁటి.. ఆ కొండా పాతాళ స్వర్గం?’ నీరసంగా అన్నాడు ప్రభు.
‘అదే.. అక్కడికెళ్లాక గానీ దాని గురించి మీకు తెలియదు’ నవ్వింది చిన్ని.
‘పద తొందరగా వెళ్దాం’
‘ముందు నేను వెళ్తాను. మీరు మెల్లగా రండి. కొండ చుట్టూ కందకం, దాంట్లో భయంకరమైన మొసళ్లు ఉంటాయి. తోడేళ్లలాంటి రెండు కుక్కలుంటాయి. (ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్